Drop Down Menus

2023 దసరా నవరాత్రుల తేదీలు & దుర్గ పూజ శుభ ముహూర్తం సమయం | Devi Navaratrulu 2023 Dates and Pooja Time

ఈ సంవత్సరం శారదీయ నవరాత్రుల కోసం కలశ స్థాపన సమయం అక్టోబర్ 15 న ఉదయం 11:19 నుండి ప్రారంభమై మధ్యాహ్నం 12:30 వరకు ఉంటుంది.

దసరా అంటే హిందువులకు పెద్ద పండగ. దసరానే విజయదశమి అని కూడా పిలుస్తారు. దసరా సమయంలోనే శరన్నవరాత్రులు నిర్వహిస్తారు. శరన్నవరాత్రుల్లో దుర్గా దేవి ఒక్కో రోజు ఒక్కో అవతారంలో భక్తులకు దర్శనమిస్తుంది. ఈ ఏడాది అక్టోబర్ 15 నుంచి అక్టోబర్ 23 వరకు శరన్నవరాత్రులు జరగనున్నాయి.

దసరా పర్వదినం కోసం అమ్మవారి భక్తులు సంవత్సరం మొత్తం వేచి ఉంటారు. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా పండగ జరుపుకుంటారు. శక్తి సాధనకు నవరాత్రులు అత్యంత పవిత్రమైనవి..

ఈ సంవత్సరం నవరాత్రుల పవిత్ర పండుగ 15 అక్టోబర్ 2023 నుండి ప్రారంభమై అక్టోబర్ 23 వరకు కొనసాగుతుంది. దుర్గా దేవి ఆరాధనకు సంబంధించిన ప్రధాన తేదీలు, పూజా విధానం.. దాని శుభ సమయం మొదలైన వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

నవరాత్రుల శుభ ముహూర్తం :

నవరాత్రుల మొదటి రోజున అమ్మవారి ఆరాధన కోసం కలశాన్ని స్థాపిస్తారు. శక్తి ఆరాధనలో భాగంగా ఈ కలశాన్ని తొమ్మిది రోజులు పూజిస్తారు. ఈ ఏడాది శరన్నవరాత్రులు మొదటి రోజు 15 అక్టోబర్ 2023 న వస్తుంది. ఆరోజు కలశాన్ని స్థాపిస్తారు. కలశాన్ని స్థాపనకు ఉదయం 11:19 నుండి 01pm వరకు శుభ ముహర్తం. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:38 నుండి మధ్యాహ్నం 12:25 వరకు ఉంటుంది.

శైలపుత్రి (బాలా త్రిపుర సుందరి)

శ్లోకం: 

ప్రథమం శైలపుత్రీ చ ద్వితీయం బ్రహ్మచారిణీ

తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకం

పంచమం స్కందమాతేతి షష్టం కాత్యాయనీ చ

సప్తమం కాలరాత్రీతి మహాగౌరీతి చాష్టమమ్‌

నవమం సిద్ధిధాత్రీ చ నవదుర్గాః ప్రకీర్తితాః

నవరాత్రులు.. అమ్మవారి రూపాలు.. ఏ రోజున ఏ పూజ చేయాలంటే.. :

నవరాత్రుల మొదటి రోజు - ఆదివారం15 అక్టోబర్ 2023- ప్రతిపాద, ఘటస్థాపన, మా శైలపుత్రి పూజ.

శరన్నవరాత్రుల్లో పాడ్యమి రోజు ప్రారంభమయ్యే అవతారం శైలపుత్రి. దక్షుని ప్రథమ పుత్రిక, తలపై చంద్రరేఖని ధరించి శూలాన్నీ చేత బట్టి ఎద్దు వాహనంపై కూర్చునే అవతారమే శైలపుత్రి. పరమేశ్వరుడే తనకు పతికావాలని కోరుతుంది. ఆమె కోరిక ప్రకారం హిమవంతునికి పుత్రికగా జన్మించింది.

బ్రహ్మచారిణి ( గాయత్రి )

శ్లో|| వందే వాంఛిత లాభాయ చంద్రార్ధకృతశేఖరాం|

వృషారూఢాం శూలధరాం శైలపుత్రీ యశస్వినీమ్ ||

నవరాత్రుల రెండో రోజు - సోమవారం 16 అక్టోబర్ 2023 - బ్రహ్మచారిణి పూజ

దుర్గమ్మ రెండో అవతారం బ్రహ్మచారిణి. పరమేశ్వరుని భర్తగా పొందడానికి నారదుడి ఉపదేశానుసారం ఘోరతపస్సు చేసింది. ఆకులు కూడా తినకుండా ఉన్నందున అపర్ణగా ప్రసిద్ధి. పరమేశ్వరుని భర్తగా పొందే వరకు ఈమె బ్రహ్మచారిణి. కన్యాకుమారి అనే మరోపేరుంది.

చంద్రఘంట ( అన్నపూర్ణ )

శ్లో|| దధానా కరపద్మాభ్యాం అక్షమలాకమండలూ |

దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా ||

నవరాత్రుల మూడవ రోజు- మంగళవారం 17 అక్టోబర్ 2023 -  చంద్రఘంట పూజ

అమ్మవారి మూడో అవతారం చంద్రఘంట. శిరస్సుపై అర్థచంద్రుడిని ధరించి ఉంటుంది..అందుకే  ఆమెకు చంద్రఘంట అని పేరు వచ్చింది. ఈ రూపాన్ని దర్శించుకున్నవారికి అన్నపానీయాలకు లోటుండదు.

కూష్మాండ ( కామాక్షి )

శ్లో|| పిండజప్రవరూరుఢా చంద్రకోపాస్త్ర కైర్యుతా|

ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుతా ||

నవరాత్రుల నాలుగవ రోజు - అక్టోబర్ 18 బుధవారం - మా కూష్మాండ పూజ, వినాయక చతుర్థి, ఉపాంగ్ లలితా వ్రతం

నవదుర్గల్లో అమ్మవారి నాల్గవ అవతారం కూష్మాండ. కూష్మాండ అంటే బూడిద గుమ్మడికాయ. ఎనిమిది భుజాలతో విరాజిల్లుతుండటం వల్ల ఈమెను ‘అష్టభుజాదేవి’ అని కూడా అంటారు.

స్కందమాత ( లలిత )

శ్లో|| సురా సంపూర్ణకలశం రుధిరాప్లుతమేవ చ|

దధానా హస్త పద్మభ్యాం కూష్మాండా శుభ దాస్తుమే ||

నవరాత్రుల ఐదవ రోజు - గురువారం 19 అక్టోబర్-పంచమి, మా స్కందమాత పూజ

నవదుర్గల్లో ఐదో అవతారం స్కందమాత. స్కంధుడు అంటే కుమార స్వామి. స్కందుని తల్లి అయినందున ఈమెను స్కందమాత అని పిలుస్తారు. కమలాసనంపై  పద్మాసనంతో శోభిల్లుతుంది. నమ్మిన భక్తులకు విజయాన్నందిస్తుంది.

కాత్యాయని (లక్ష్మి)

శ్లో|| సంహాసనగతా నిత్యం పద్మాశ్రిత కరద్వయా|

శుభదాస్తు సదాదేవీ స్కందమాతా యశస్వినీ ||

నవరాత్రుల ఆరో రోజు - అక్టోబర్ 20 శుక్రవారం, 6వ- షష్ఠి, మాతా కాత్యాయని పూజ

అమ్మవారి ఆరో అవతారం కాత్యాయని. ‘కొత్స’ అనే రుషి తపస్సుకి మెచ్చి ఆయన కోరిక మేరకు కుమార్తెగా జన్మించింది పార్వతీదేవి. కొత్స కుమార్తె కనుకే కాత్యాయని అనే పేరు వచ్చింది.

కాళరాత్రి ( సరస్వతి )

శ్లో||చంద్రహాసోజ్జ్వలకరా శార్దూల వరవాహనా |

కాత్యాయనీ శుభం దద్యాద్దేవీ దానవఘాతినీ ||

నవరాత్రుల ఏడవ రోజు - శనివారం 21 అక్టోబర్ 2023- సప్తమి, మా కాలరాత్రి పూజ

దుర్గమ్మ ఏడో అవతారం కాళరాత్రి. ఈమె శరీరం చీకటిలా నల్లగా ఉంటుంది. అందుకే ఈ దేవికి కాళరాత్రి అని పేరు. ఈమె వాహనం గాడిద. ఈ తల్లి ఎప్పుడూ శుభ ఫలితాలను ఇస్తుంది. అందువలన ఈమెను శుభంకరి అని కూడా పిలుస్తారు.

మహాగౌరి ( దుర్గ )

శ్లో|| ఏకవేణీ జపాకర్ణపూరా నగ్నాఖరాస్థితా|

లంబోష్ఠీ కర్ణికాకర్ణీ తైలాభ్యక్త శరీరిణీ |

వామపాదోల్లసల్లోహలతాకంటక భూషణా|

వర మూర్ధధ్వజా కృష్ణా కాళరాత్రిర్భయంకరీ ||

నవరాత్రుల 8వ రోజు - ఆదివారం 22 అక్టోబర్ 2023 - దుర్గా అష్టమి, మహాగౌరీ పూజ, మహానవమి

అమ్మవారి ఎనిమిదవ అవతారం మహాగౌరి. ఈమె పరమేశ్వరుడిని భర్తగా పొందటానికి కఠోర తపస్సు చేస్తుంది. ఆ సమయంలో ఆమె శరీరం నల్లగా మారిపోతుంది. ఆమె తపస్సుకుమెచ్చి శరీరాన్ని గంగాజలంతో ప్రక్షాళనం చేస్తారు. అప్పటి నుంచి గౌరవర్ణంతో కాంతులను వెదజల్లుతూ ఉంటుంది అమ్మవారు. అప్పటి నుంచి ఆమె మహాగౌరిగా ప్రసిద్ధి కెక్కింది.

సిద్ధిధాత్రి ( మహిషాసుర మర్దిని ) ( రాజ రాజేశ్వరి )

శ్లో|| శ్వేతే వృషే సమారూడా స్వేతాంబరధరా శుచిః|

మహాగౌరీ శుభం దద్యాత్, మహాదేవ ప్రమోదదా ||

నవరాత్రుల తొమ్మిదో రోజు - సోమవారం 23 అక్టోబర్ 2023 - మహానవమి, శరన్నవరాత్రుల పరణ

దుర్గామాత తొమ్మిదవ శక్తి రూపం సిద్ధిధాత్రి. ఈమె అన్ని సిద్ధులనూ ప్రసాది స్తుంది. పరమేశ్వరుడు సర్వ సిద్ధులను ఈదేవీ కృపతో పొందాడని దేవీ పురాణాలు చెబుతున్నాయి.

శ్లో|| సిద్ధగంధర్వయక్షాద్యైరసురైరమరైరపి|

సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయినీ ||

శరన్నవరాత్రుల పదో రోజు - మంగళవారం 24 అక్టోబర్ 2023- దశమి, దుర్గా దేవీ నిమజ్జనం

నవరాత్రి పూజ విధానం:

అమ్మవారిని పూజించడానికి భక్తులు నవరాత్రులలో మొదటి రోజున సూర్యోదయానికి ముందే ఉదయాన్నే లేచి, స్నానం చేసి, ధ్యానం చేసిన తర్వాత, తొమ్మిది రోజుల పాటు నవరాత్రి ఉపవాసం, శుభ సమయంలో ఆచారాల ప్రకారం కలశ స్థాపన చేయండి. దుర్గాదేవికి పండ్లు, పుష్పాలు మొదలైన వాటిని సమర్పించడం, మంత్ర స్తోత్రాలతో దుర్గాదేవిని పూజించడం మొదలైనవి. నవరాత్రుల్లో ప్రతిరోజూ దుర్గా సప్తశతిని ముఖ్యంగా అమ్మవారి పూజలో పారాయణం చేయండి. దీని తరువాత మీ సంప్రదాయం ప్రకారం, అష్టమి లేదా నవమి రోజున, అమ్మవారిని పూజించి.. తొమ్మిది మంది అమ్మాయిలను కూడా ప్రత్యేకంగా పూజించండి.

ఆడపిల్లలకు పూరీ, శనగలు, పాయసం మొదలైన వాటిని ఆహారంగా పెట్టండి. మీ శక్తికి తగ్గట్టు దక్షిణ ఇచ్చి వారి ఆశీర్వాదం తీసుకుని, గౌరవంగా పంపించండి. ఆ తర్వాత ఉపవాసం విరమించండి.

Famous Posts:

> నవరాత్రులలో ఎలాంటి నియమాలు పాటించాలి ?

> దుర్గాదేవిని 9 రకాల పూలతో పూజిస్తే శుభం కలుగుతుందట

> ప్రేమతో అమ్మవారి మనసును ఎలా గెలుచుకోవాలి?

> నవరాత్రి దీక్ష చేయవలసిన విధానం ఆచరించవలసిన పద్ధతులు.

> ఈ దుర్గామాత రూపాలను తలచుకుని ప్రార్థిస్తే.. కష్టాలన్నీ తొలగిపోతాయి.

దసరా నవరాత్రులు, navratri 2023, devi navaratrulu, dasami, vijaya dasami date, dasara 2023, durga pooja, vijayawada, durga stotram, dasara navaratrulu

ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments