Drop Down Menus

ఆశ్వయుజ మాసం ప్రారంభం , ఆశ్వయుజ మాసం విశిష్టత | Ashwayuja Masam 2023

ఆశ్వయుజ మాసం ప్రారంభం , ఆశ్వయుజ మాసం విశిష్టత

త్రిముర్తులైన బ్రహ్మ , విష్ణు , మహేశ్వరుల దేవేరులైన సరస్వతి , మహాలక్ష్మీ , పార్వతిదేవిలకు అత్యంత ప్రీతికరమైన..వారి పూజలకు ఉత్కృష్టమైన మాసం ఆశ్వయుజం !

జగన్మాత అయిన పార్వతిదేవి దుష్ట శిక్షణ , శిష్ట రక్షణార్ధం , తొమ్మిది అవతారలను ధరించిన మాసం..ఆయుర్వేద దేవుడు అయిన ' ధన్వంతరీ , త్రిమతాచార్యులలో ద్వైత సిద్ధాంత ప్రవక్త శ్రీ మధ్వాచార్యులు జన్మించిన మాసం. దుష్ట దానవుడైన నరకాసురుడు అంతమొందింపబడి ప్రజలందరికి ఆనందాల వెలుగులను పంచిన దివ్య మాసము ఇది !

ఈ మాసం లోని తొలి తొమ్మిది రోజులు "దేవి నవరాత్రులు." సంప్రదాయబద్ధంగా పూజలు చెయ్యాలి అనుకున్న భక్తులు కలశాన్ని స్థాపించి , ముగ్గురు అమ్మల మూలపుటమ్మను ఈ నాటి నుండి తొమ్మిది రోజుల పాటు నియమముగా ఆరాధించాలి. దేవి పూజను ఆశ్వీయుజ మాసం అష్టమి , నవమిలలో పూజించిన భక్తులకు ఎటువంటి శోకాలు దరిచేరవు. దేవి పూజకు ఉత్కృష్టమైన ఈ రోజులలో అమ్మవారిని పూజించి రోజుకొక నైవేద్యం చొప్పున సమర్పించడం మంచిది. కలశ స్థాపనాదులతో పూజించలేని వారు , అమ్మవారి పటానికి గాని , విగ్రహానికి గాని , పుస్తకాలను గాని పూజిస్తూ స్తోత్ర , నామ పారాయణలను చేయవచ్చు.

ఈ విధముగ దేవి నవరాత్రులలో ఆ తల్లిని ఆరాధించడం వల్ల ఆ దేవి సంతృప్తురాలు అవుతుంది. అంతే కాకుండా దుష్ట , గ్రహ పీడలు నశించి అమ్మవారి కృప కటాక్షలు కలుగుతాయని చెప్పబడుతోంది.

అలాగే , ఈ మాసం లో సప్తమి రోజున గోపూజ చెయ్యవలెను. కపిల గోవును పూజించాలని , కేవలం పంచగవ్యములను మాత్రం స్వీకరించి ఉపవాసము ఉండవలెను.

పూర్ణిమ నాడు  "నారదీయ పురాణము" ను పండితులకు తాంబూలములో వుంచి దానము ఇవ్వవలేను.

పూర్ణిమ నాడు స్త్రీలు జాగరణ చెయ్యటం వలన లక్ష్మిదేవి సంతోషించి , అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తుంది అని శాస్త్ర వచనం.

ఈ నెలలోని బహుళ పక్షములో చతుర్దశి , అమావాస్య తిధులలో దీపాలను దేవాలయం , మఠము ప్రాకారాల్లోను , వీధులు , ఇంటి ముందు సాయంత్రము సమయములో వెలిగించుకోవడంవల్ల పితృదేవతలు సంతృప్తి చెందుతారని చెప్పబడుతోంది.

ఈ విధముగ ఎన్నో విశిష్టతలను సొంతం చేసుకున్న మాసం ఆశ్వయుజ మాసం.

ఈ మాసం లో చేసే పూజలు , విధుల ఆచరణ వల్ల అనంతమైన పుణ్య ఫలాలు కలుగుతాయి. అనంత రూపాలలో విలసిల్లే శక్తిస్వరూపిణి అయిన ఆ తల్లి ఏ రూపములోనైనా , ఏ నామంతోనైనా ఆరాధించవచ్చు. ఆ తల్లి అమ్మలగన్న అమ్మ !.

తనను నమ్మిన భక్తులను ఎట్టి పరిస్థితులలో విడవకుండా కాపాడే కల్పవల్లి  కరుణామయి..ఆ తల్లి !

Tags: ఆశ్వయుజ మాసం, Ashwayuja Masam, Ashwayuja Masam 2023, 2023 Ashwayuja Masam Telugu

ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.