నవరాత్రులలో ఎలాంటి నియమాలు పాటించాలి ?
దుర్గాదేవికి ప్రీతిపాత్రమైన దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల సందడి మొదలైంది. సకల సౌభాగ్యాలు ప్రసాదించే దుర్గా దేవిని పూజిస్తే కోర్కెలు తీరుతాయని నమ్మకం. ఈ నవరాత్రుల సమయంలో.. అమ్మవారు తొమ్మిది రోజులు తొమ్మిది రూపాల్లో దర్శనమిస్తారు. ముఖ్యంగా దుర్గా, లక్ష్మీ, సరస్వతి దేవిగా దర్శనమిస్తారు.
ఆశ్వయుజ మాసం శుక్లపక్షంలో మొదటి తొమ్మిది రోజులను దేవీ నవరాత్రులుగా జరుపుకుంటాం. ఈ తొమ్మిది రోజుల్లో చివరి మూడురోజులు దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి. ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరించి.. నైవేద్యాలు సమర్పిస్తారు. కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారం దుర్గాదేవికి దేశవ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా అమ్మవారిని పూజిస్తారు. కొన్ని ప్రాంతాల్లో విగ్రహాలు ఏర్పాటు చేసి డప్పులు, వాయిద్యాల నడుమ అమ్మవారికి ఉత్సవాలు జరుపుతారు. ఎంతో విశిష్టత, ప్రాధాన్యత ఉన్న ఈ నవరాత్రుల సమయంలో ఎలాంటి నియమాలు పాటించాలి ? ఏం చేయాలి.. ఏం చేయకూడదు ? అనే విషయాలపై చాలా మందికి అవగాహన ఉండకపోవచ్చు. ఈ విషయాలన్నీ తెలుసుకుందాం..
దుర్గా అమ్మవారి గుడికి ఈ తొమ్మిది రోజులూ క్రమం తప్పకుండా వెల్లాలి. అమ్మవారి ముందు దీపం వెలిగించి, పూలు పెట్టి.. హారతి ఇచ్చి.. దండం పెట్టుకుంటే మంచిది.
నీళ్లు సమర్పించండి..
నవరాత్రి సమయంలో అమ్మవారికి నీటిని సమర్పించడం చాలా శ్రేయస్కరం.
శుభ్రమైన వస్త్రాలు..
నవరాత్రుల సమయంలో.. నిత్యం శుభ్రమైన వస్త్రాలనే ధరించాలి. పాదరక్షలు వేసుకోకుండా ఉంటే మంచిది. గుమ్మానికి దగ్గరగా చెప్పులు వదలకుండా.. దూరంగా ఉంచాలి.
ఉపవాసం..
ఉపవాసం చేయగలిగిన వాళ్లు.. ఈ తొమ్మిది రోజులు ఉపవాసం ఉంటే మంచిది. అమ్మవారి ఆశీస్సులు పొందడానికి నవరాత్రుల్లో ఉపవాసం అంతర్భాగం. ఉపవాసం ఉండటం ఆరోగ్యానికి కూడా మంచిదే.
అమ్మవారికి అలంకరణ..
దుర్గాదేవికి అలంకారమంటే ప్రీతికరం. సౌభాగ్య ప్రదాయిని దుర్గాదేవి. కాబట్టి.. అమ్మవారిని గాజులు, పూలు, పసుపు, పూల మాలలు, వస్త్రాలతో నిత్యం అలంకరించాలి.
అష్టమి రోజు..
కన్యా పూజ చేయాలి నవరాత్రులు అమ్మాయిలకు ముఖ్యమైనవి. అష్టమి రోజు తొమ్మిది మంది ముత్తైదువులను పిలిచి కాళ్లు కడిగి పసుపు రాయాలి. ఇలా పెళ్లి కాని అమ్మాయిలతో చేయిస్తే మంచిది.
అఖండ జ్యోతి..
అఖండ జ్యోతి వెలిగించాలి. మొదటిరోజు అంటే అక్టోబర్ 17న అఖండ జ్యోతి వెలిగించి.. దానిని తొమ్మిది రోజులపాటు వెలుగుతూ ఉండేలా చూసుకోవాలి. అఖండ జ్యోతి వల్ల సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు, శ్రేయస్సు సిద్ధిస్తుంది. ఈ దీపానికి నెయ్యి వాడితే మంచిది. నెయ్యి అందుబాటులో లేకపోతే మరో నూనెను వాడవచ్చు. కానీ ఆవాలనూనె వాడకూడదు.
బ్రహ్మచర్యం పాటించాలి..
ఈ తొమ్మిది రోజులూ బ్రహ్మచర్యం పాటించడం శ్రేయస్కరం.
వెల్లుల్లి, ఉల్లి..
ఈ తొమ్మిదిరోజులు ఉల్లి, వెల్లుల్లిని వాడకూడదు. వంటల్లో ఇవి లేకుండా చూసుకుంటే మంచిది.
హెయిర్ కట్..
నవరాత్రుల సమయంలో..షేవింగ్, కటింగ్ చేయించుకోకుండా ఉండటం శ్రేయస్కరం.
మాంసాహారం..
అమ్మవారికి ప్రీతిపాత్రమైన నవరాత్రుల సమయంలో.. మాంసాహారానికి దూరంగా ఉండాలి.
ఆల్కహాల్ ..
నవరాత్రులు ముగిసేవరకు మద్యం, ఆల్కహాల్ సేవించకుండా ఉండాలి.
Famous Posts:
> నవరాత్రి 2023 తేదీలు & దుర్గ పూజ శుభ ముహూర్తం సమయం
Tags: Devi Navaratrulu, Navaratris, Dasami, 9days Pooja, Durga Pooja, Devi Navaratrulu Telugu