Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

దేవీ నవరాత్రులు ఏవిధంగా ఆరంభమయ్యాయి..| How did Devi Navratras begin?

దేవీ నవరాత్రులు ఏవిధంగా ఆరంభమయ్యాయి..

ఇక ఐదు రోజుల్లో ప్రారంభం కాబోతున్నసందర్భంగామణిద్వీపములో చింతామణి గృహంలో కామేశ్వరీ, కామేశ్వరులిరువురు ఆనంద పరవశులైవున్న సమయంలో సకల దేవగణ, ఋషిగణ, యోగినీ గణాదులు మహాకామేశ్వరుణ్ణి ప్రార్జించి, స్వామి!

మిమ్ములను పగటికాలమందు అమ్మను రాత్రికాలమందు ఆరాధిసూ తరిస్తున్నాము. ఒక్క రాత్రికాలమందైనా తమరిని ఆరాధించాలనేటటువంటి కోరిక కలుగుతోంది అనుగ్రహించండి స్వామీ! అని వేడుకున్నారు.

భక్తవశంకరుడైన మహాకామేశ్వరుడు మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్ధశినాటి రాత్రికాలము మీకు అనుగ్రహిస్తున్నానని వరప్రదానం చేశాడు. ప్రక్కనే వున్న మహాకామేశ్వరీ అయిన మహాత్రిపుర సుందరి నా స్వామి నన్ను నిర్లక్ష్యంచేసి,

నా అనుమతిలేకనే నా కాలమైన రాత్రికాలాన్ని తమ పూజ చేయుటకు అనుగ్రహించి, నన్నవమానించాడు. అవమానానికి తట్టుకోలేని మహా కామేశ్వరి మహాకాళీ రూపాన్ని దాల్చి,

అనంతవిశ్వాన్ని బ్రిమింగేస్తానని చెప్పి శపథాలు చేసూ, ఉగ్రరూపిణియై, బిల్వవృక్షాన్ని ఎక్కి కూర్చొని వికటాట్టహాసాలు చేస్తోంది.

అమ్మ ఉగ్రరూపానికి లోకాలన్నీ తల్లడిల్లిపోతున్నాయి. సర్వగణాలు మహాకామేశ్వరునివద్దకు పోయి స్వామీ! ఏమిటీ లీల! మేము మా ఆనందం కోసం మిమ్మల్ని రాత్రికాలంలో ఆరాధించాలని అడిగామనుకోండి.

తమరు ప్రక్కనే వున్న అమ్మ అనుజ్ఞ లేకుండా ఏవిధంగా మాకు అనుజ్ఞ ఇచ్చారు. అమ్మవారికెందుకంత కోపం వచ్చింది. ఆ కోపాన్ని తగ్గించే ఉపాయాన్ని మీరే అనుగ్రహించాలని వేడుకొన్నారు.

చిరునవ్వులు చిందిస్తూ మహా కామేశ్వరుడు అమ్మవారి ఉగ్రరూపాన్ని స్తోత్రాదులతో శాంతింప చేయమని ఆదేశించాడు. వారు ఆరుపగళు, ఆరురాత్రుళ్ళు అమ్మవారి యొక్క ఉగ్రతత్వాన్ని శాంతింప చేసేందుకు ప్రయత్నం చేసి విఫలురై మహా కామేశ్వరుణ్ణి ఆశ్రయించారు.

మహాకామేశ్వరుడు కూడా అమ్మ ఉగ్రరూపాన్ని తగ్గించేందుకు పరిపరి విధాల మూడు రాత్రుళు, మూడు పగళు ప్రయత్నించాడు. అయినప్పటికీ అమ్మ కోపం వృద్ధి అవుతోందే కానీ, తగ్గుముఖం పట్టలేదు.

మహాకామేశ్వరి, మహాత్రిపుర సుందరి నీ అనుజ్ఞ లేక నీ కాలమైన రాత్రికాలంలో నన్ను ఆరాధించుటకు అవకాశమిచ్చినందులకు గాను ఈ తొమ్మిది రాత్రుళ్లు, పది పగళ్లు నీయొక్క ఆరాధనకే అవకాశమిస్తున్నాను.

శాంతించి బిల్వవృక్షం దిగివచ్చి లోకాలను ఉద్ధరించు అని ప్రార్థించాడు. అప్పడు ఉగ్రకాళీ రూపాన్ని ఉప సంహరించుకొని కామేశ్వరిగా, మహాకామేశ్వరుణ్ణి చేరింది.

ఈ నవరాత్రులలో అమ్మకు ప్రియమైన, అద్భుతమైన సుగంధ ద్రవ్యాలతో, హరిద్ర కుంకుమ పుష్పాదులతో, సాంబ్రాణి ఉగ్గులను, అగరు ధూపాలతోఅమ్మవారినిసేవించిన సంపూర్ణ ఆయురారోగ్యములు వృద్ధి చెందును.

ఈ నవరాత్రి కాలంలో జనులపాలిట యమదంష్ట్రలు. యమునియొక్క కోరలు. ఈ సమయంలో అనేకమైన సూక్ష్మక్రిములు విశేషంగా అభివృద్ధి చెంది, జీవకోటిని నాశనం చేస్తాయి. ఈ సమయంలో ఈ యొక్క అద్భుత వనమూలికా ద్రవ్యాదులతోఅమ్మవారిని ఆరాధించిన రోగ భూయిష్టమైన దుష్ట సూక్షక్రిములు అంతమొందించబడి, జీవకోటిని రక్షిస్తాయి. అందుచేతనే అమ్మ ఆగ్రహించి ఈ నవరాత్ర వ్రతానికి శ్రీకారం చుట్టింది.

ఈ నవరాత్రులలోనే కృతయుగంలో దుర్గాదేవి మహిసాసుర సంహారం చేసినది.త్రేతాయుగంలోశ్రీరామచంద్రుడు  రావణసంహారం గావించాడు, ద్వాపరయుగంలో పాండవులు అజ్ఞాత వాసాన్ని ముగించుకొని ఆయుధాలు ధరించి విజయాన్ని పొందారు. 

అందుచేత ఈ నవరాత్రి ప్రత విశిష్టత చెప్పట ఆదిశేషునికి కూడా తరంకాదు..

Click here: 2023 దసరా నవరాత్రుల తేదీలు & దుర్గ పూజ శుభ ముహూర్తం సమయం

Tags: Devi Navaratrulu, Dasami, 9days, Durga devi, Vijaya Dasami, Navaratrulu

Comments

Today Tirumala Darshan Information:

తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు . భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలి. అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరు. కాగా, శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు. Tirumala Free Darshan Tickets Counters SSD TOKENS AT SRINIVASAM, VISHNU NIVASAM, BHUDEVI COMPLEX స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలు a)ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం b)రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం c)రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్(ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తారు