Drop Down Menus

నవరాత్రుల్లో కుమారి పూజ ఎప్పుడు చేయాలి? ఏవిధంగా చేయాలి ? Kumari Pooja Vidhanam in Telugu

నవరాత్రులలో సువాసిని , కుమారి పూజ విధానం:

పసుపుకొమ్మలను సేకరించి , నిమ్మరసంలో మూడు రోజులు నానబెట్టి , ఎండలో ఆరబెట్టి , కుంకుమరాళ్లను కలిపి , దంచి , జల్లించి , సేకరించినది ఉత్తమమైనది. ఇటువంటి కుంకుమతో అమ్మను ఆరాధించిన అన్నికోర్మెలునెరవేరతాయి.

కుంకుమను స్త్రీలు ప్రత్యక్షంగా ధరించవచ్చు. పురుషులు ముందుగా చందనమును ధరించి , ఆపైన కుంకుమను ధరించాలి. ఈవిధంగా ధరించనియెడల పురుషత్వము నశిస్తుంది.

అదేవిధంగా పసుపును పురుషులు శరీరానికి పూసుకొనరాదు. పూసుకొనిన యెడల పురుషత్వము నశిస్తుంది.

సువాసినీ పూజ ఏవిధంగా చేయాలి ?

సలక్షణాలతో ఏవిధమైన అవయవ లోపంలేని సౌమ్యమైన , ముతైదువను ఎంచుకొని., అమ్మవారిగా భావించి., షోడశ ఉపచారములతో శ్రీసూక్త విధానంగా సహస్ర , త్రిశతీ , అష్ణోత్తర , ఖడ్గమాల నామములతో అర్చించి , మంగళహారతి ఇచ్చి , ఆభరణ , పుప్ప , హరిద్ర , కుంకుమ చందనాదులతో సత్కరించి , ఆ సువాసినితో ఆశీర్వచనము తీసుకొనిన సువాసినీపూజ పూర్తియగును.

ఈ సువాసినీపూజ శ్రీచక్రనవావర ణార్చన అనంతరం దేవీనవరాత్రులలో నిర్వహించాలి. వైవియస్ఆర్ శక్తి అనుసారం ఒక ముతైదువకుగానీ , ముగురికిగానీ , ఐదుగురికిగానీ , ఏడుగురి కిగానీ ,తొమ్మిదిమందికిగానీ , పద్దెనిమిదిమందికి గానీ , ఇరవై ఏడుమందికి గానీ , యాభై నాలుగు మందికి గానీ , నూట ఎనిమిది మందికిగానీ , ఐదువందల యాభై ఎనిమిదిమందికి గానీ , వెయ్యిన్నూట పదహారు మందికిగానీ సువాసినీపూజ చేయవచ్చును.

బ్రాహ్మణ ముతైదువలకు సువాసినీపూజ చేసిన భక్తి , జ్ఞాన , వైరాగ్యములు , విద్యాభివృద్ధి కలుగును.

క్షత్రియ ముతైదువలకు సువాసినీపూజ చేసిన ధైర్య సాహసములు వృద్దియగును. ముతైదువలకు సువాసినీపూజ చేసిన అప్టెశ్వర్య భోగభాగ్యములు వృద్దియగును.

శూద్ర ముతైదువలకు సువాసినీ పూజ చేసిన సత్సంతానప్రాప్తి కలుగును. మన యొక్క కామ్యమునుబట్టి సువాసినులను ఎంచుకొని , ఆహ్వానించి , ఆరాధించి , ఆశీస్సులు పొందవలయును.

కుమారీపూజ ఏవిధంగా చేయాలి ?

అమ్మవారికి ప్రియమైన అర్చనలలో కుమారీ అర్చన విశేషమైనది. శ్రీదేవీ నవరాత్రులలో 

మొదటిరోజు ఒక సంవత్సరం కలిగిన కన్యను బాలగా ,

రెండవ రోజు రెండు సంవత్సరాలు కలిగిన కన్యను కుమారిగా

మూడవరోజు మూడు సంవత్సరాలు కలిగిన కన్యను త్రిమూర్తిగా ,

నాల్గవరోజు నాలుగు సంవత్సరాలు కలిగిన కన్యను కళ్యాణిగా,

ఐదవరోజు ఐదు సంవత్సరాలు కలిగిన కన్యను రోహిణిగా ,

ఆరవరోజు ఆరు సంవత్సరాలు కలిగిన కన్యను కాళికగా ,

ఏడవరోజు ఏడు సంవత్సరాలు కలిగిన కన్యకను చండికగా ,

ఎనిమిదవరోజు ఎనిమిది సంవత్సరాలు కలిగిన కన్యకను శాంభవిగా ,

తొమ్మిదవరోజు తొమ్మిది సంవత్సరాలు కలిగిన కన్యకను దుర్గగా ,

పదవరోజు పది సంవత్సరాలు కలిగిన కన్యకను సుభద్రగాభావించి షోడశఉపచారాలతో శ్రీసూక్త విధానంగా సహస్ర , త్రిశతీనామ , అష్ణోత్తర శతనామ , దేవీఖడ్గమాలా నామాదులతో , హరిద్ర ,

కుంకుమ పుష్పాదులతో అర్చించి , మంగళహారతులిచ్చి , ఆభరణ , పుష్ప , చందనాదులతో సత్కరించి వారియొక్క ఆశీర్వచనము తీసుకొనిన సకలశుభములు కలుగును..

Tags: Kumari Pooja, కుమారి పూజ, Kumari Puja, kumari puja benefits, kumari puja age limit, Kumari puja Vidhanam

ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.