Drop Down Menus

అయ్యప్ప దీక్ష యొక్క ప్రాముఖ్యత | Significance of Ayyappa Deeksha

అయ్యప్ప దీక్ష ఆధ్యాత్మికత

సృష్టికి మూలమైన బ్రహ్మతత్త్వం వివిధ రూపాల్లో ఉంటుంది. జీవుని లక్ష్యం ఆ పరబ్రహ్మాన్ని పొందడానికి క్రమశిక్షణతో కూడిన నియమాలు పాటించాలి. సాధకులు పరమాత్మ పాత్రులు కావడానికి చేసే సాధనలే దీక్షలు..

అనేక దీక్షలలో ఒకటైన అయ్యప్పస్వామి దీక్ష, శబరిమలై యాత్ర  నేటి సమాజానికి వరప్రసాదం. కార్తీక మార్గశిర మాసాల్లో గురుస్వామి ద్వారా మాలను ధరించినప్పటి నుండి 41 రోజులు దీక్షావిధులను సక్రమంగా పాటింది. ఇరుముడిని తలపై ధరించి మనసంతా స్వామి పైనే లగ్నం చేసి శరనాలు చెబుతూ శబరిమలై యాత్ర చేయాలి. దీనివల్ల స్వామివారి సందర్శన భాగ్యం, కృపాకటాక్షాలు పొందుతారు.

అసలు బ్రహ్మాస్మి తత్వమసి సిద్ధాంతం అయ్యప్ప భక్తుల ప్రాణ సిద్ధాంతం. తనలో అయ్యప్పస్వామిని చూసుకుని, ఎదుటివారిలో కూడా స్వామివారిని దర్శిస్తూ మానవ సేవయే మాధవసేవగా ఎంచి సర్వమానవ సౌభ్రాతృత్వానికి పునాది వేస్తున్నారు.

మాలాధారణ:

అయ్యప్ప దీక్ష చేపట్టేవారు తులసి, రుద్రాక్ష మాలలను గురుస్వామి ద్వారా ధరించాలి. ఈ మాలలు అయ్యప్ప భక్తులకు రక్షణ కవచం లాగా ఉపయోగపడతాయి. తులసి పూతలలో ఉన్న వాయువు అయ్యప్ప భక్తులు ఆరోగ్యవంతులుగా ఉండడానికి తోడ్పడుతుంది. తులసి, రుద్రాక్షమాలలకు రోగనిరోధక గుణం ఉంది. రుద్రాక్షమాల అధిపోటు, మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది.

చన్నీటి స్నానం:

సాధారణంగా ఏ దీక్షకైన చన్నీటి స్నానం మనసుకు ప్రశాంతంగా ఉంచి భగవంతుని ధ్యానానికి తోడ్పడుతుంది. ఒంటి పూట  భోజనం భూశయనం ఉంటుంది. ఒక పూట భోజన శరీర బరుపు తగ్గడమే కాకుండా శరీరాన్ని ఆరోగ్యంగా, కోరికలు దూరంగా ఉంచి మనస్సు స్వామిపై లగ్నం చేయబడుతుంది. భూశయనం బ్రహ్మచర్యానికి దోహదపడడమేకాక వెన్నుపూస గట్టిపడి పర్వతారోహణకు, అడవి (నడక) ప్రయాణానికి తోడ్పడుతుంది.

నలుపు దుస్తులు:

అయ్యప్ప భక్తులు దీక్షా సమయంలో నలుపురంగు వస్త్రాలు ధరిస్తారు. నలుపురంగు తమోగుణాన్ని సూచిస్తుంది. బట్టలపై మమకారం ఉండకూడదని చెప్పడానికే నలుపు దుస్తులు ధరిస్తారు.

విభూతి ధారణ:

విభూతి ధారణ వలన చక్కని కాంతి. ధైర్యం, బలం కలుగుతుంది. 

పంపాతీరంలో స్వాములు వంట చేసిన 108 బియ్యము నుండి భస్మాన్ని సేకరించి, స్వామివారికి అభిషేకించిన దానికి ఎనలేని శక్తి కలిగి సర్వరోగ నివారిణిగా తయారై, ప్రాణహితగా ఉపయోగపడుతుంది. అందుకే అయ్యప్పస్వామివారి విభూతి అన్నింటిని మించిన దివ్య ఔషధం. అంతేగాక వాత, పిత్త, కఫో వల్ల వచ్చే రోగాలు రావు. విభూతిని మూడు గీతలుగా పెట్టుకోవడం అంటే సత్వరజనమోగుణాలకు అతీతులు కావాలని అర్ధం.

Tags: అయ్యప్ప దీక్ష, Ayyappa Deeksha, Ayyappa Vratham, Ayyappa Swamy

ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.