శ్రీ తులసి ఉపయోగములు..
తులసిని ఉదయము ఏమియు తినకుండా స్వీకరించుట చాలా ఉత్తమము. చిన్నవారు 7 ఆకులవరకును తినవచ్చును. పెద్దవారు 50 ఆకుల వరకును తిన వచ్చును.
చలికాలములో ఎక్కువగను, వేసవిలో తక్కువగాను తీసుకొన వలయును. తులసి అందమును, ఆరోగ్యమును పెంపొందించును. తులసిని మూడు, నాలుగుసార్లు మించి తీసుకొనుట మంచిది కాదు. కుష్ఠు వ్యాధి ఉన్నచోట తులసి తోట ఉండవలెను.
1. ఉదయమున తులసి రసము మంచినీటితో తీసుకొన్న జ్ఞాపకశక్తి, బలము, ఆకలి పెరుగును.
2. నిమ్మపండ్లు, ఉల్లి, వెల్లులి, మజ్జిగ తులసి వీనిని కలరావ్యాధి యందు ఉపయోగించిన చక్కని గుణము కలుగును.
3. నల్లులు దోమలు 3 మున్నగు వానిని చంపుటకు ఉపయోగించు కిరసనాయిలు మున్నగువానియందు తులసిని కలిపినచో ఉత్తమ ఫలితముండును.
4. అడవి తులసి రెమ్మలు మంచమునకు కట్టినచో దోమలు నల్లులు దరిజేరవు.
5. తులసి రసమును పుక్కిట పట్టినచో నోటిలోని పుండ్లు మానును.
6. వేప రసమును, తులసి రసమును కలిపి తీసికొన్నచో అంటువ్యాధులు అంటవు.
7. కరంట్గాకుతో పడిపోయినవారికి తులసిరసముతో కాళ్లు, చేతులు, ముఖము మర్దనా చేసినచో త్వరగా తేరుకొనును.
8. గుండెజబ్బులకు తులసిరసము, అర్జునవృక్షముబెరడు కలిపి తీసుకున్న విశేష ఫలితము ఉండును.
9. తులసి దళములు వేసినచో నీరు కూడా పరిశుద్ధములై సువాసనగా ఉండును. మట్టిపాత్రలోని నీరు త్రాగుట మిక్కిలి ఆరోగ్యకరము.
10. పది తులసి ఆకులు, అయిదు మిరియాలు, నాలుగు బాదములు వీటి చూర్ణమును ఉదయమున సేవించినచో ఆరోగ్యము, జ్ఞాపకశక్తి పెరుగును.
11. ఎండిన తులసి ఆకులను మెత్తగా చేసి ముఖమునకు రుద్దుకొన్నచో మచ్చలు పోయి కాంతి పెరుగును.
12. మానసికముగా బలహీనమైన పిల్లలకు తేనె, తులసిరసము యిచ్చినచో వెంటనే గుణమిచ్చును.
13. అలసట పోయి ఉత్సాహము కలుగుటకు తులసీదళములను తినుట మంచిది.
14. తులసి ఆకులు, యాలకులు, శొంఠిపొడి, బాదముపొడి ఉడికించి పాలు వగైరాలు కలిపి త్రాగినచో ఆరోగ్యము పెరుగును, కాఫీ, టీల అలవాటును పోగొట్టు కొనవచ్చును.
15. తులసిమొక్కలను కుండీలలో పెట్టి యింటిలో అన్ని భాగముల యందు పగటియందు ఉంచుకొన్నచో వాతావరణము శుద్ధి అగును.
16. తులసిరసమును, అల్లపు రసమును, తేనెను కలపి పుచ్చుకున్నచో జీర్ణశక్తి పెరుగును.
17. తులసి పంచాంగములు (బెరడు, ఆకులు, పువ్వు, పండ్లు. వేళ్ళు) వీటిని ఎండబెట్టి మిరియాలతో కలిపి వేడినీటితో తీసుకున్న జీర్ణకోశము బాగుపడి ఆరోగ్యము కలుగును. వీటిని తెనేతోకూడా కలపి తీసుకొనవచ్చును.
18. తులసి, పుదీనా, యాలకులు కలిపి తీసుకొన్నచో అతిసారవ్యాధి తగ్గును.
19. తులసి దళములలో కర్పూరమును జేర్చి కుంకుడుగింజంత మాత్రలను చేసి పూటకు ఒకటి చొప్పున వాడినచో కలరా వ్యాధి వెంటనే తగ్గును.
20. తులసి చూర్ణమును 10 గ్రాములు చొప్పున ఉదయము సాయం కాలము వాడినచో మూలవ్యాధి నశించును. దీనిని మజ్జిగతో కూడా కలిపి తీసుకొనవచ్చును..
21. తులసి విత్తనములను నీటిలో ఎక్కువసేపు నానబెట్టి సేవించినచో మూలవ్యాధి నశించును.
22. తులసి ఆకులను తినుట/త్రాగుట మూలవ్యాధిని పోగొట్టును.
23. తెల్లతులసి ఆకురసము, తేనె కలిపి తీసుకొన్నచో దగ్గు, ఉబ్బసానికి మంచిది.
24. తులసి పువ్వులను అల్లపురసములో మర్దించి శనగగింజంత మాత్రలను వాడినచో దగ్గు తగ్గును.
25. తులసిఆకుల రసమును అల్లపురసమును, తేనెతో కలిపి వాడినచో మట్టి తినుట వలన వచ్చు జబ్బులు పోవును.
26. కృష్ణతులసి రసమును రాత్రియందు రెండు చుక్కలు చొప్పున మూడు రాత్రులు లేచినచో రేచీకటి పోవును.
27. తులసిరసము, తేనె కలిపి కంటియందు కంటిరోగములు నశించును. చుక్కలుగా వేసినచో 'అన్నిరకముల
28. తులసి దళమును ఆవువెన్నతో వెచ్చబెట్టి కంటిపై కట్టు కట్టినచో రెప్పలమీద లేచు కురుపులు, కంటినీరు కారుట మున్నగు రోగములు పోవును.
29. రామతులసి రసమును చిరకాలము సేవించినచో కుష్ఠురోగము తగ్గిపోవును.
30. తులసి నిమ్మరసముతో మర్దించి రాసినచో దద్దుర్లు పోవును.
31. తులసీదళములు, ఎర్ర మన్ను మర్ధించి రాసినచో దురదలు దగ్గును.
32. తులసిరసమును అల్లపు రసముతో వెచ్చబెట్టి రెండుపూటలా సేవించినచో
కడుపులోని పురుగులు పోవును. 33. ప్రతిదినము కనీసము 20 తులసి ఆకులు తిన్నచో కడుపునొప్పి తగ్గును.
34. తులసి ఆకులచూర్ణము పావుతులము, పావుసేరు ఆవుపాలు (పచ్చివి) కలిపి త్రాగిన కడుపుమంట తగ్గును.
35. తులసి, వేపపట్టా, పిప్పళ్లు సమభాగములుగా పొడిచేసి ప్రతిదినము 5 గ్రాముల పొడిని నీటితో పరగడుపున తీసుకున్నచో ఆమ్లపిత్తము తగ్గును.
36. తులసిరసము, శొంఠిచూర్ణము కలిపి పుచ్చుకున్నచో కడుపునొప్పి తగ్గును.
37. తులసిరసము, అల్లపురసము, పుష్కర మూలచూర్ణము కలిపి వెచ్చ బెట్టి రాసినచో పార్శ్వశూల తగ్గును.
38. సోనాముఖి, తులసిగింజలు, కషాయము కాచి త్రాగిన కడుపు ఉబ్బరము తగ్గును.
39. తులసీ ఆకులను మూడుపూటలా నములుచూ తులసి రసమును ఒంటికి రాసుకొన్నచో కఫమువలన, వాతమువలన వచ్చిన ఉన్మాదములు తగ్గును.
40. తులసి ఆకులు, దేవదారు ఆకులు నూరి రాసినచో అరికాలు, అరిచేయి మంటలు తగ్గును. 41. తులసి రసమును రెండుపూటలా త్రాగుచున్నచో సన్ననికాళ్ళు చేతులు పెద్ద పొట్ట తగ్గును. 42. తులసి అల్లపురసము, తేనెతో 40రోజులు వాడినచో “బల్ల” తగ్గును.
43. బహిష్టు అయిన దినమునుండి 3 దినముల వరకు తులసి కషాయమును ఒక కప్పు చొప్పున త్రాగినచో సంతానము కలుగదు.
44. ఏడు మిరియాలు తులసి ఆకులు 7 నమిలి మ్రింగినచో మలేరియా మూడు దినములలో తగ్గును.
45. తులసి ఆకులు, మిరియాలు ఉడికించిన కషాయములో నిమ్మరసము, బెల్లము కలిపిన గోరువెచ్చనిదానిని త్రాగి కప్పుకొని పడుకొనవలయును. ప్రతి 3 గంటలకు ఈ విధముగ చేసిన అన్నివిధముల జ్వరములు తగ్గును.
46. మిరియాలు, వేపచిగుళ్ళు, తులసిఆకులు కలిపి తిన్నచో చలి జర్వరములు తగ్గును.
47. తులసిరసము సగము అల్లపురసము కలిపి త్రాగినచో చలిజ్వరములు తగ్గును.
48. తులసి, పుదీనా, అల్లము వీని రసములను కలిపి త్రాగినచో చలి జ్వరములు తగ్గును.
49. తులసిరసము, నిమ్మరసము వీటికి కలబందను చేర్చి పానీయముగా చేసి త్రాగినచో దప్పిక తగ్గును. వీనిలో కలబంద బదులు చక్కెర కలిపి త్రాగినచో అతి దాహము కట్టును, తులసి అనేక విధములుగా మనకు ఆరోగ్యమును కలిగించుచున్నది.
శ్రీ తులసీ గాయత్రి ఓం "శ్రీ తులస్యై విద్మహే విష్ణుప్రియాయై ధీమహి తన్నోబృందా ప్రచోదయాత్."॥
Tags: తులసి, Tulasi, Health, Health tips, Tulasi kota, Tulasi use, Tulsi leaves
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Comments
Post a Comment