నక్త వ్రతం అంటే ఏమిటి? కార్తీక సోమవారం నాడు ఉపవాసం ఎలా చేయాలి? Shiva Naktha Vratham on Monday in karthika Masam
నక్త వ్రతం అంటే ఏమిటి?
'నక్తము' అంటే రాత్రి. 'నక్త వ్రతం' అంటే ఉదయం నుంచి ఏదీ తినకుండా ఉపవాసాన్ని పాటించి, రాత్రి స్నానాదులు ఆచరించి, 'నక్షత్రాన్ని దర్శించిన తరువాత ఆహారాన్ని తీసుకొనే నియమం. దీనినే క్లుప్తంగా 'నక్తాలు' అని కూడా అంటారు.
ప్రధానంగా కార్తీక మాసంలో నక్తాలను ఆచరిస్తూ ఉంటారు. రాత్రి నక్షత్ర దర్శనం చేసి, దీపం వెలిగించిన తరువాత భుజిస్తారు. నెల మొత్తం ఇలా చెయ్యడానికి సహకరించనివారూ, ఇతర కారణాలు ఉన్నవారు కార్తీక సోమవారాల్లో నక్తాలు చేస్తారు. అది కూడా వీలుకాకపోతే చవితి, ఏకాదశి, పౌర్ణమి తిథుల్లో ఆచరిస్తారు..
కార్తీకమాసం ప్రాధాన్యత మరి ఈ మాసంలో సోమవారానికి చాలా ప్రాధాన్యత ఉంది.. అందరూ కూడా సోమవార ఉపవాసం చేస్తాం అంటారు.. మరి అది ఉపవాసమా?? పూజా?? నక్తమా?? అనేది ఇపుడు చూద్దాము..
కార్తీక సోమవారాన్ని 6 విధాలుగా చేయొచ్చు.
1. ఉపవాసం
2. ఏకభక్తము
3. నక్తము
4. అయాచితము
5. స్నానము
6. తిలదానము
1. ఉపవాసము:
ఇందులో వీళ్లు పగలంతా ఉపవసించి(ఏమి తినకుండా) సూర్యాస్తమయము తర్వాత శివుడినీ పూజించి నక్షత్ర దర్శనం చేసుకుని కేవలం తులసి తీర్థం మాత్రమే సేవిస్తారు..
2. ఏకభక్తము:
రోజంతా ఉపవాసం చేయలేనివారు ఉదయం స్నాన దాన జపాలను యథావిధిగా చేసుకొని మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి.. రాత్రి పూట భోజనం బదులు తులసి తీర్థం సేవిస్తారు..
3. నక్తము:
పగలంతా ఉపవాసం ఉండి.. రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత భోజనం కానీ ఉపాహారం(టిఫిన్) కానీ సేవిస్తారు..
4. అయాచితము:
రోజంతా ఉపవాసం ఉండి తమ భోజనం తాము వండుకోకుండా.. ఎవరైనా పిలిచి భోజనం పెడితే దానిని అయాచితము అని అంటారు..
5. స్నానము:
పైన చెప్పిన నాలుగు విధాలు చేయలేనివారు స్నాన జపాదులు మాత్రమే చేస్తారు..
6. తిలదానము:
మంత్ర జప విధులు తెలియని వాళ్లు కార్తీక సోమవారం రోజున నువ్వులు దానం చేసిన చాలు..
పై ఆరు విధాలలో ఏదైనా చేసిన కానీ విశేషమైన ఫలితం వస్తుంది అని కార్తీక పురాణంలో చెప్పబడి ఉన్నది..
కాబట్టి ఈ కార్తీక మాసాన్ని ఎవ్వరు కూడా వృధా చేసుకోవద్దు.. ఏడాదికి ఒక్కసారి మాత్రమే వస్తుంది ఇలాంటి అరుదైన మాసము..
నా ఉద్దేశం ప్రకారం.. నక్తము చేయడం అనేది చాలా చాలా మంచిది.. కార్తీక సోమవారం రోజున ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం తర్వాత భోజనం చేయండి..
మనకి కార్తీక పురాణంలో కార్తీక సోమవార విశిష్ఠత అనే దాని మీద ఒక కథ కూడా ఉంటుంది.. ఒక కుక్క ఆ ప్రసాదం తినడం వలన దాని పాపాలు అన్ని కూడా పటాపంచలు అయిపోయాయి అని ఉంటుంది.
మీ మీ శక్తిమేర సోమవారం రోజున పైన చెప్పిన 6 లో ఏదైనా చేయండి..
Tags: Karthika Masam, Karthika Somavaram, Upavasam, Deepam, Karthika Purnima, నక్త వ్రతం, Nakta vrataṁ
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Comments
Post a Comment