Drop Down Menus

ఇంట్లో వాస్తు దోషం ఉందని ఎలా తెలుస్తుంది? పూర్తిగా చదవండి..Vastu Tips For Ganesha Idol

ఇంట్లో వాస్తు దోషం ఉందని ఎలా తెలుస్తుంది? పూర్తిగా చదవండి.

దయచేసి పూర్తిగా చదవండి మరియు ఈ " వాస్తు అదృష్ట మహా గణపతి " చిత్రపటాన్ని మీ ఇంటి ముందు పెట్టుకోండి.

మానవుని శరీరంలో ఆయస్కాంతం లాంటి శక్తి ఉంటుంది. అందుకే మనకు సరిపడని ప్రదేశాలకు వెళ్లినప్పుడు ఆ ప్రభావం మన శరీరంపై, మనసుపై పడుతుంది. తల తిరగటం, తలనొప్పి, చికాకు మొదలయినవి బాధపెడతాయి. అదే మాదిరిగా గృహంలో కూడా దోషం ఉంటే ఆ ప్రభావం పడుతుంది.

ఇల్లు చూస్తే వాస్తు శాస్త్ర ప్రకారం ఏ దోషం కనిపించకపోవచ్చు. కానీ ఆ ఇంట్లోకి మారిన దగ్గరనుంచీ అకారణ చికాకులూ, అనారోగ్యాలూ, లేనిపోని టెన్షన్లూ, యాక్సిడెంట్లూ ఇలా ఏదో ఒకటి జరుగుతూ ఉండవచ్చు. వారి జాతకం ప్రకారం ఏ దోషం లేని సమయంలో కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటే ఆ ఇంటి వాస్తులో లోపం ఉందని చెప్పుకోవచ్చు.

అప్పులు చేయడం, చేసిన అప్పులు తీర్చలేకపోవడం, క్రుంగిపోవడాలు, ఆత్మహత్యలు, ఆత్మహత్యాప్రయత్నాలు, మానసిక క్షోభ, కుటుంబంలో కలహాలు, పిల్లలు పుట్టకపోవడం, అనేకమైన వ్యాధుల బారిన పడడం, అవమానాలు, ఇతరత్రా స్త్రీలపై విపరీతమైన కామ ప్రకోపాలు, ఇతరత్రా సంఘటనలు ఇంట్లో జరిగితే అటువంటి వారికి వాస్తుదోషం ఉందని చెప్పవచ్చు.

అలాగే పెంపుడు కుక్క అస్తమానం ఒకే దిశకి తిరిగి అరవటంకూడా ఒక సూచనే. ఇంట్లోకి పాములు, గబ్బిలాలు రావటం, కాకులు ఎక్కువగా వాలటం, ఆ ఇంటి చట్టూ మాత్రమే కాకులు ప్రదక్షణ చేయటం కూడా కనబడని వాస్తు లోపాలకి సూచనలు.

దొంగతనాలు, అగ్నిప్రమాదాలు, అకస్మాత్తుగా సంభవించే ప్రమాదాలు, చర్మవ్యాధులు, ఉద్యోగం లభించక పోవడం మొదలగునవి. అదే విధంగా ఆడపిల్లల విషయంలో ఇతరులను ప్రేమించడం, పుట్టింటికి చేరుకోవడం, మెట్టినింట కష్టాలు, భర్త బలవంతంచే పుట్టినింటి వారిని పీడించండం మొదలగునవి అన్నీ వాస్తు దోషాలలోకి వస్తాయి. అందువలన ఏ నిర్మాణమునైనా సరైన వాస్తు రీత్యా నిర్మించుకొని అందరూ ఆనందంగా ఉండాలి.

కొన్ని గృహాలు చూడటానికి కళావిహీనంగా కనబడతాయి. అలాగే కొన్నిచోట్లకి వెళ్ళగానే అకారణ భయం వేస్తుంది. కొన్ని ఇళ్ళల్లో ఆత్మహత్యలో, హత్యలో జరిగి వుండవచ్చు అలాంటి సంఘటనలు జరిగినచోట కొన్ని ఇబ్బందులు పడవలసి రావచ్చు. అంటే ఆ పిశాచాలు అక్కడ తిష్ట వేసుకు కూర్చున్నాయనికాదు, అవి లేకపోయినా కొన్ని చికాకులు ఉంటాయి. ఆ ఇంట్లో అంతకు ముందు జరిగిన సంఘటనలు మనకు తెలిసే అవకాశం ఉండదు. అయినా మనలో అంతర్లీనంగా ఉన్న శక్తులు కొన్ని మనకి సూచిస్తాయి.

అయితే వంశపారంపర్యంగా వచ్చిన ఇళ్ళని ఇలాంటి చికాకులవల్ల వదిలి వెళ్ళలేము. అందుకని వాస్తు పండితులకు చూపించి, లోపాలేమిటో తెలుసుకుని తగిన శాంతి చేయిస్తే సరిపోతుంది. కొత్త ఇల్లు కట్టుకోబోతున్నా, కొనుక్కోబోతున్నా ముందే సరైన పరీక్షలు చేయిస్తే తర్వాత ఏ ఇబ్బందీ పడక్కరలేదు.

చాలామంది ఇల్లు కట్టుకున్న తర్వాతో, ఫ్లాట్ కొనుక్కున్న తర్వాతో వాస్తు దోషాలున్నాయేమోనని వాస్తు పండితుల్ని సంప్రదిస్తారు. అది సరికాదు. అసలు వాస్తు దోషాలు ఏర్పడటానికి ముఖ్యంగా 3 కారణాలు చెప్పవచ్చు.

మొదటిది : భూమి కొనే ముందే అన్ని కోణాలలో భూమి పరీక్ష చేయించాలి. ఎందుకంటే లూజ్ సాయిల్ అయితే ఇల్లు కట్టుకోవటానికి అనువైందికాదు. కట్టడం బలంగా ఉండదు. అలాగే నేల అడుగున దేవాలయాలు, జల నాడులు, శల్యాలు, దుష్ట శక్తుల ఆవాహన ఉన్న ప్రదేశాలలో కూడా గృహం నిర్మిస్తే సుఖంగా వుండలేరు. అలాగే చుట్టుపక్కల ఎలా వుంది, ఇరుగూ, పొరుగూ కూడా చూసుకోవాల్సిందే.

రెండవది : యజమాని నామ నక్షత్రాన్ని బట్టి ఇంటికి సింహ ద్వారాలు ఎక్కడ ఉండాలి..? ఎన్ని గుమ్మాలు ఉండాలి..? ఎక్కడెక్కడ వుండాలి..? కిటికీలు ఎక్కడ ఉండాలి..? వగైరాలన్నీ ముందే వాస్తు పండితుల్ని సంప్రదించి నిర్ణయించుకోవాలి.

మూడవది : ఇవ్వన్నీ చూపించినా కొన్నిసార్లు ఆ ఇంట్లో నివసించిన తర్వాత వాస్తు బాగాలేదనుకుంటారు. దానికి కారణం మన ప్రవర్తనవల్ల వచ్చింది. ఏ ఇంట్లో అయితే స్త్రీలకు అన్యాయం జరుగుతుందో, ఏ ఇంట్లో అనర్ధాలు జరుగుతాయో, ఆక్రందనలుంటాయో ఆ ఇంటికి వాస్తు దోషం ఉంటుందంటారు.

జీవ హింస జరిగే ఇంట్లో, తల్లిదండ్రులు, వృద్దులు, బాధపడే గృహం వాస్తు దోషం ఉన్నట్లే. అంటే ఆ ఇంట్లో నివసించే వారికి సుఖశాంతులు ఉండవు. సర్ప, దేవతా, ఋషి శాపాలు ఉన్న ఇంట, పసిపిల్లలకు అన్యాయం జరిగే ఇంట వాస్తు దోషం ఉన్నట్లే. ఇవ్వన్నీ భూమి ఎంచుకునేటప్పుడు, ఇల్లు కట్టుకునేటప్పుడు వచ్చిన దోషాలు కాదు. మన ప్రవర్తనవల్ల వచ్చిన దోషాలు. వాస్తుతో పాటు ప్రవర్తన కూడా బాగుంటేనే సుఖ సంతోషాలతో ఉంటారు.

కొన్ని సార్లు మన సొంత ఇల్లు కాకపోయినా అద్దె ఇంట్లో కూడా అనేక బాధలు పడుతుంటాము. వాటిలోనూ వాస్తు దోషాలు ఉండవచ్చు, వేరే ఇంటికి మారిపోదాం అనుకుంటే ఉన్న పళంగా మరొక అద్దె ఇల్లు దొరకకపోవచ్చు, అద్దె ఎక్కువ కావచ్చు, ఉన్న ప్రదేశంలో దొరకపోవచ్చు, ఇలాంటి సందర్భాలలో అదే అద్దె ఇంట్లో కొనసాగుతూ ఉండాలి. అలాంటి ఆపద సమయాలలో మనల్ని రక్షించేది కేవలం దైవ బలమే. ముఖ్యంగా వినాయకుడిని పూజిస్తే శుభ ఫలితాలు ఉంటాయి.

పైన చెప్పినట్లు ఈ " వాస్తు అదృష్ట మహా గణపతి " చిత్రపటాన్ని మీ ఇంటి ముందు పెట్టుకొని, పూజా మందిరంలో కానీ పెట్టుకుని దారిద్ర్య దహన గణపతి స్తోత్రం, సంకట నాశన గణేశ స్తోత్రం ప్రతీ రోజూ పారాయణ చేస్తూ, ప్రతీ మాసంలోనూ కృష్ణ పక్ష చతుర్థి నాడు " సంకష్ట హర చతుర్థి " వ్రతం వినాయకుని ఆలయాలలో జరుతుంటుంది కదా, ఆలయానికి వెళ్ళి వ్రతం చేసుకుని వస్తు ఉంటే వాస్తు దోషాల ప్రభావం ఉండదు. మీకోసం " దారిద్ర్య దహన గణపతి స్తోత్రం " మరియూ " సంకట నాశన గణేశ స్తోత్రం " పెడుతున్నాము. సద్వినియోగాపరచుకోండి.

మహా మహిమాన్వితమైన ఈ దారిద్ర్య దహన గణపతి స్తోత్రం ప్రతీ రోజూ పటిస్తే మహా గణపతి అనుగ్రహం వలన దారిద్ర్యం దహింపబడి అదృష్టం చేకూరుతుంది.

దారిద్ర్య దహన గణపతి స్తోత్రం

సువర్ణ వర్ణ సుందరం సితైక దంత బంధురం

గృహీత పాశ మంకుశం వరప్రదా భయప్రధం

చతుర్భుజం త్రిలోచనం భుజంగ మోపవీతినం

ప్రపుల్ల వారిజాసనం భజామి సింధురాననః

కిరీట హార కుండలం ప్రదీప్త బాహు భూషణం

ప్రచండ రత్న కంకణం ప్రశోభితాంఘ్రి యష్టికం

ప్రభాత సూర్య సుందరాంబర ద్వయ ప్రధారిణం

సరత్న హేమనూపుర ప్రశోభి తాంఘ్రి పంకజం


సువర్ణ దండ మండిత ప్రచండ చారు చామరం

గృహ ప్రదేందు సుందరం యుగక్షణ ప్రమోదితం

కవీంద్ర చిత్తరంజకం మహా విపత్తి భంజకం

షడక్షర స్వరూపిణం భజే గజేంద్ర రూపిణం


విరించి విష్ణు వందితం విరుపలోచన స్తుతం

గిరీశ దర్శనేచ్చయా సమార్పితం పరాంబయా

నిరంతరం సురాసురైః సుపుత్ర వామలోచనైః

మహామఖేష్ట కర్మను స్మృతం భజామి తుందిలం

మదౌహ లుబ్ధ చంచలాళీ మంజు గుంజితా రవం

ప్రబుద్ధ చిత్తరంజకం ప్రమోద కర్ణచాలకం

అనన్య భక్తి మాననం ప్రచండ ముక్తిదాయకం

నమామి నిత్య మాదరేణ వక్రతుండ నాయకం


దారిద్ర్య విద్రావణ మాశు కామదం

స్తోత్రం పఠెదేత దజస్ర మాదరాత్

పుత్రీ కళత్ర స్వజనేషు మైత్రీ

పుమాన్ భవే దేకదంత వరప్రాసాదాత్

ఇతి శ్రీ దారిద్ర్య దహన గణపతి స్తోత్రం సంపూర్ణం

సంకటనాశన గణేశస్తోత్రమ్

నారద ఉవాచ :

ప్రణమ్య శిరసా దేవం , గౌరీపుత్రం వినాయకమ్,

భక్తావాసం స్మరేన్నిత్యం, ఆయుఃకామార్థసిద్ధయే.


ప్రథమం వక్రతుండం చ, ఏకదంతం ద్వితీయకమ్,

తృతీయం కృష్ణపింగాక్షం, గజవక్త్రం చతుర్థకమ్.


లంబోదరం పంచమం చ, షష్ఠం వికటమేవ చ,

సప్తమం విఘ్నరాజం చ, ధూమ్రవర్ణం తథాష్టమమ్.


నవమం ఫాలచంద్రం చ, దశమం తు వినాయకమ్,

ఏకాదశం గణపతిం, ద్వాదశం తు గజాననమ్.

ద్వాదశ ఈతాని నామాని, త్రిసంధ్యం యః పఠేన్నరః,

న చ విఘ్నభయం తస్య, సర్వసిద్ధికారకం ప్రభో !


విద్యార్థీ లభతే విద్యాం, దనార్థీ లభతే ధనమ్,

పుత్రార్థీ లభతే పుత్రాన్, మోక్షార్థీ లభతే గతిమ్.


జపేత్ గణపతిస్తోత్రం, షడ్భిర్మాసైః ఫలం లభేత్,

సంవత్సరేణ సిద్ధిం చ, లభతే నాత్ర సంశయః.

అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ, లిఖిత్వా యః సమర్పయేత్,

తస్య విద్యా భవేత్ సర్వా, గణేశస్య ప్రసాదతః

ఇతి శ్రీ నారదపురాణే సంకటనాశన గణేశస్తోత్రం సంపూర్ణమ్

అందరం భక్తితో " ఓం గం గణపతయే నమః " అని వ్రాసి స్వామి వారి అనుగ్రహం పొందుదాం .. ఎంత ఆర్తితో స్మరిస్తే అంత త్వరగా అనుగ్రహిస్తాడు ఆ భగవంతుడు..

Tags: vastu, vastu home, home, vastu ganapathi, ganapathi images, vastu in home, 

ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FAQ'S

సెప్టెంబర్ నెల వరకు తిరుమల 300/- టికెట్స్ , సేవ టికెట్స్ , రూమ్స్ , సీనియర్ సిటిజెన్ టికెట్స్ , అంగప్రదక్షిణ టికెట్స్ అన్ని బుక్ అవ్వడం జరిగింది.
తిరుమల శ్రీవారి సేవ కూడా సెప్టెంబర్ నెల వరకు బుక్ అయ్యాయి
అక్టోబర్ నెల టికెట్స్ జులై 18వ తేదీ నుంచి విడుదల చేస్తారు. 

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.