నవంబర్ నెల మాస ఫలితాలు ఈ నెలలో జరగబోయే మంచి చెడు సంఘటనలు
1) నవంబర్ నెల పర్వాలేదు ఎక్కువగా మంచి ఫలితాలు తక్కువగా చెడు ఫలితాలు ఉన్నాయి.
2) ఈ నెలలో భారీ వర్షాలు పడతాయి తుఫాను రాబోతుంది.
3) రెండవ వారం నుండి ఉష్ణోగ్రతలు పూర్తిగా పడిపోతాయి చలి తీవ్రత విపరీతంగా ఉంటుంది పిల్లలు వృద్దులు జాగ్రత్తగా ఉండాలి.
4) పగటిపుట ఉక్క పోత రాత్రిపూట విపరీతమైనటువంటి చలి వీటి మధ్యలో వర్షాలు వింత వాతావరణం.
5) ఈ నెలలో కూడా వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతాయి.
*ముఖ్యంగా నిత్యవసర సరకుల ధరలు కూరగాయలు పప్పు దినుసులు అలాగే ద్రవపదార్థాలు
6) ఈ నెలలో వ్యాపారం బాగుంటుంది.
7) ద్రవ రూపంలో ఉండే పాలు మద్యం వ్యాపారం విపరీతంగా అనుకూలంగా ఉండబోతుంది.
8) ప్రముఖులు అరెస్ట్ కాబోతున్నారు.
9) ఈ నెలలో ప్రజలు వివిధ రోగాలతో ఇబ్బంది పడతారు.
10) ముఖ్యమంత్రిలకు ఈనెల పూర్తిగా అరిష్టం.
ముఖ్యమంత్రుల మీద కేసులు అవినీతి నిరోధశాఖ దాడులు అలాగే ముఖ్యమంత్రులు వివిధ మంత్రులు అరెస్ట్ అయ్యే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది.
11) ప్రఖ్యాతిగాంచిన ప్రముఖ స్త్రీలు మరణిస్తారు.
12) ప్రముఖ మహిళా మణులు జైలుకు వెళ్లే అవకాశం గోచరిస్తుంది.
*ముఖ్యంగా రాజకీయ, వ్యాపార రంగానికి సంబంధించిన స్త్రీలు*
13) ఈ నెలలో భారీ భూకంపం సంభవించే అనేకమంది మరణించే అవకాశం గోచరిస్తున్నది.
14) జల ప్రమాదాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి పడవ మునగటాలు నీటిలో పడి అనేకమంది మరణించడం కనిపిస్తుంది.
15) బంగారం ధర పెరిగి తగ్గడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి.
16) సినిమా రంగానికి సినిమా కళాకారులకు అరిష్టం.
17) కల్తీ మద్యం వలన వ్యక్తులు మరణించే అవకాశం కనిపిస్తోంది అలాగే కల్తీ పదార్థాల మూలకంగా ప్రజలు ఇబ్బంది పడతారు మరణిస్తారు.
18) అధికారంలో ఉన్న నాయకుల చుట్టూ ముఖ్యమంత్రుల చుట్టూ కొత్త కొత్త కేసులు కొత్త కొత్త వివాదాలు తగాదాలు ఈ నెల మొత్తం ఉంటుంది.
19) ఈ నెలలో విద్యారంగానికి అంత అనుకూలమైన పరిస్థితులు లేవు.
20) భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువ ఉంటాయి.
21) మన దేశానికి సంబంధించిన కొన్ని వస్తువుల ఎగుమతులు దిగుమతులు అనుకూలంగా ఉంటాయి.
22) ప్రస్తుతం జరుగుతున్న ఇజ్రాయిల్ పాలిస్తిన యుద్ధం తీవ్రంగా మారి ఈ నెలలో ముగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
23) తెలుగు రాష్ట్రాల రాజకీయాలు తలక్రిందులు కాబోతున్నాయి.
24) తెలంగాణ రాష్ట్రంలో అనూహ్యంగా పుంజుకోబోతున్న ఒక పార్టీ.
25) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ నెల ప్రతికూలం వారి విషయంలో కొన్ని ప్రతికూల వార్తలు.
26) ఈ నెలలో మరొక బస్సు ప్రమాదం రైలు ప్రమాదం జరిగి ప్రజలు మరణించే అవకాశం కనిపిస్తుంది ప్రయాణాలలో జాగ్రత్త అవసరం.
27) ఈ నెలలో ముఖ్యంగా శ్వాస సంబంధ వ్యాధులు దగ్గు జలుబు జ్వరం ముఖ్యంగా రక్తకణాలు తక్కుట రక్తానికి సంబంధించినటువంటి వ్యాధులు ప్రజలకు వచ్చే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండుట మంచిది.
28) ప్రముఖుల మీద దాడులు హత్యాయత్నం కనిపిస్తున్నాయి జాగ్రత్త అవసరం.
29) సంగీత నృత్య కళాకారులకు అరిష్టం.
30) ఢిల్లీ రాష్ట్రానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కి సమయం ప్రతికూలంగా కనిపిస్తూ ఉంది. ఢిల్లీ ప్రాంతానికి ప్రజలకు ఇబ్బందికర సమయం.
31) రక్షణ వ్యవస్థకు సంబంధించినటువంటి వ్యక్తులకు రక్షణ శాఖ అధికారులకు రక్షణ శాఖకు సంబంధించినటువంటి ఉద్యోగులకు సమయం అనుకూలంగా లేదు.
32) కొన్ని రహస్య విషయాలు బయటపడే అవకాశం ఉంది. కొన్ని కొత్త కుంభకోణాలు మోసాలు స్కాములు బయటపడే అవకాశం కనిపిస్తుంది.
33) అనూహ్యంగా ఒక వ్యక్తిని తన యొక్క పదవి నుండి తప్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి పదవీభంగం ఒక వ్యక్తికి ఏర్పడబోతోంది.
34) కొందరు దొంగ స్వామీజీలు బయటపడే అవకాశం కనిపిస్తుంది.
35) తీర ప్రాంత ప్రజలకు నదీ తీర సముద్ర తీర ప్రాంత ప్రజలకు సమయం ప్రతికూలం జాగ్రత్త అవసరం.
36) ఈ నెలలో ప్రజలకు ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉండడానికి అవకాశం కనిపిస్తుంది.
37) ఈ నెలలో ప్రజలకు కోపం ఆవేశం తొందరపాటు నిర్ణయాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
38) స్టాక్ మార్కెట్లు బోల్తా పడతాయి.
39) ఈ నెలలో పైరసీ ఎక్కువగా ఉంటుంది.
సుబ్రమణ్య ఆరాధన చేస్తే ఈ నెలలో అందరికీ మంచి ఫలితాలు వస్తాయి.
సుబ్రహ్మణ్య అష్టకం సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం సుబ్రమణ్య స్వామి అభిషేకం హనుమాన్ చాలీసా పారాయణం అందరికీ మంచి ఫలితాలను ఇస్తుంది.
అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త శ్రీ సద్గురు మాణిక్ ప్రభు మహారాజ్ కీ జై
శుభాశీస్సులతో
శ్రీ బగలాముఖి సర్వ మంగళ సిద్ధ దత్త పీఠం
Tags: November, November horoscope, November 2023, Horoscope, November month good things