సుబ్రహ్మణ్య స్వామి ఆలయాల్లో తప్పక దర్శించాల్సిన 6 దివ్య క్షేత్రాలు - Arupadaiveedu - The Six Abodes of Lord Murugan Temples

సుబ్రహ్మణ్యేశ్వరుడి ఆలయాలు

సుబ్రహ్మణ్య స్వామి ఆలయాల్లో తప్పక దర్శించాల్సిన 6 దివ్య క్షేత్రాలను ఇక్కడ తెలుసుకోండి. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం కుజదోషము, కాలసర్ప దోషముతో బాధపడేవారికి, జాతకములో రాహు కేతువు సమస్యలు ఉన్నవారికి సుబ్రహ్మణ్యేశ్వరుడిని పూజించడం మేలు చేస్తుంది.

ముఖ్యంగా వివాహము కాని వారికి, వివాహము ఆలస్యం అయ్యే వారికి, వైవాహిక జీవితంలో సమస్యలు, సంతానపరమైనటువంటి సమస్యలు ఉన్నటువంటివారికి సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించడం, ఆరాధించడం మరియు సుబ్రహ్మణ్యుని యొక్క ఆలయాలను దర్శించడం వలన వారికి ఉన్నటువంటి జాతక దోషాలు తొలగుతాయని తెలిపారు.

సుబ్రమణ్యేశ్వరునికి తమిళనాడులో అనేక దేవాలయాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో శైవ, వైష్ణవ క్షేత్రాలు అధికంగా ఉన్నట్లే, తమిళనాడులో సుబ్రహ్మణ్యేశ్వరాలయాలు అధిక సంఖ్యలో ఉన్నాయి. ఆరు ముఖాల స్వామిగా తమిళులకు ప్రీతిపాత్రమైన సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరు దివ్య ఆలయాలు కూడా తమిళనాడులో ఉన్నాయి. సుబ్రహ్మణ్యేశ్వరుని దివ్య రూపాలను చూడాలనుకునే వారు ఈ ఆరు ఆలయాలను దర్శించుకుంటే చాలని చిలకమర్తి తెలిపారు.

తిరుచందూర్‌: సముద్రం పక్ష్మనే ఉన్న అతి పురాతనమైన సుబ్రహ్మణ్యేశ్వరాలయం తిరుచందూరులో ఉంది. శరణ్‌ అనే రాక్షస రాజును సంహరించడానికి స్వామి తిరుచందూర్‌లో స్తంభంగా నిలిచాడు. తిరుచందూర్‌లోని సుబ్రహ్మణ్యస్వామి విగ్రహం కూర్చోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.

స్వామిమలైజి: స్వామి మలై అనే ఈ క్షేత్రానికి గొప్ప విశిష్టత ఉంది. సుబ్రహ్మణ్యస్వామి తన తండ్రి పరమశివునికి జ్ఞానోదయం చేసిన ప్రదేశంగా ఈ స్వామిమలై పేర్కొనబడింది.

పలని: తమిళనాడులోని పలని క్షేత్రం ఆంధ్రప్రదేశ్‌లో తిరుమల క్షేత్రం అంత ప్రసిద్ది చెందింది. తిరుమల తరహాలో పలనిలో భక్తులు నృత్యాలు చేస్తారు. కొండపైకి ఎక్కి స్వామిని దర్శించుకోవాలంటే దాదాపు వెయ్యి మెట్లు ఎక్కాలి.

తిరుత్తణిజి: తిరుపతికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతంలో కూడా ప్రత్యేక రోజుల్లో భక్తులు రద్దీగా ఉంటారు. అతని భార్యలలో ఒకరైన వల్లిని సుబ్రహ్మణ్యస్వామి తిరుత్తణిలో వివాహం చేసుకున్నారని పురాణాలు చెబుతున్నాయి.

పరిముదిర్‌ చోలై: దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న ఈ ఆలయం సుబ్రహ్మణ్యస్వామి దివ్య క్షేత్రాలలో ఒకటిగా కూడా విరాజిల్లుతోంది.

తిరువారన్‌ కున్రం: ఈ తిరుపరన్‌ కునం ఆలయం తమిళనాడులోని ప్రసిద్ధ కామాక్షి అమ్మవారు మదురై సమీపంలో కూడా ఉంది. తిరుపరన్‌ కున్రం సుబ్రహ్మణ్యస్వామి తన భార్యలలో ఒకరైన దేవసేనను వివాహం చేసుకున్న ప్రదేశం అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

Tags: సుబ్రహ్మణ్య స్వామి, Six Abodes of Murugan, Aru Padai Veedugal, Aarupadai Veedu, 6 Abodes of Lord Murugan, Subrahmanya swamy Temples, Tamilnadu, Murugan Temples, Palani, Tirruppakundram

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS