Drop Down Menus

పుట్టిన రోజు ఎలా జరుపుకోవాలి? తిధుల ప్రకారం జరుపుకోవాలా? ఇంగ్లీష్ తేదీ ప్రకారం జరుపుకోవాలా? How to celebrate a birthday?

పుట్టినరోజు అనేది మనం తిధుల ప్రకారం జరుపుకోవాలా లేక ఇంగ్లీష్ తేదీల ప్రకారం జరుపుకోవాలా అనే విషయంలో కొందరికి సందేహం వస్తూ ఉంటుంది. ప్రస్తుతకాలంలో చాలా మంది విదేశీ సాంప్రాదాయ మొజులోపడి ఆ పద్ధతులనే అలవాటు చేసుకుని స్వదేశీ సంప్రాదాయం సంస్కృతిని ముఖ్యంగా శాస్త్రాన్ని మరిచిపోతున్నారు.

వాస్తవానికి పుట్టిన రోజు అనేది తిధుల ప్రకారం చేసుకోవడమే సర్వత్ర శుభకరం.మన భారతీయ హిందు సాంప్రాదాయ ప్రకరం దీపాన్ని వెలిగించే సంస్కృతి మనది.దీపాన్ని ఆర్పే సంస్కృతి కాదు మనది.పద్దతిగా అంటే మనం తెలుగు నెలల ప్రకారం ఏనెలలో ఏపక్షంలో ఏ తిధి రోజున పుట్టమో గుర్తుపెట్టుకుని ఆరోజే పుట్టిన రోజు జరుపు కోవడమే నిజమైన పుట్టిన రోజు అవుతుంది.అందుకే అవతార పురుషులైన శ్రీకృష్ణుని,శ్రీరాముని పుట్టిన రోజులు మనం తిధుల ప్రకారమే జరుపుకుంటాము.

ప్రయోగాత్మకంగా కూడా చూస్తే మనకు తెలుస్తుంది.ఉదా 03-09-2016 దుర్ముఖి నామ సంవత్సర భాద్రపద శుద్ధ విదియ శనివారం ఉదయం 9:32 నిముషాలకు బాలుని జననం జరిగింది.అదే సమయమునకు ఆరు బయట ఒక అద్దమునకు మసిరాసి దాని మీద సూర్యుని కాంతి పడునట్లుగా చేసి అక్కడ సుద్దతో గీతను గీసి,తరువాత అద్దమును అక్కడ పదిలముగా ఉంచి, మళ్ళీ తిరిగి మరుసటి సంవత్సరము తెలుగు నెలల ప్రకారం అదే తిధి రోజు 23-08-2017 హేమలంబ నామ సంవత్సర భాద్రపద శుద్ధ విదియ బుధవారం ఉదయం పరిశీలిస్తే ఆశ్చర్యం కిరణములు గీత ఉన్న చోటనే ఉన్నాయి ఇది ప్రయోగాత్మకంగా నిర్ధారణ జరిగినది.తారీఖుల ప్రకారం కూడా చూడగా దరిదాపులలో కూడా లేదు.అద్దానికి ఐదు అడుగుల దూరములో పడటం గమనించడం జరిగినది.చూసారా మనం పుట్టిన రోజు అనేది సంవత్సరం ఎప్పుడు పూర్తవుతుందో ఖగోళశాస్త్ర ఆధారంగా తెలియవస్తున్నది.

భారతదేశ హిందు ధర్మము,సంస్కృతి,సాంప్రాదాయం ఎంత గొప్పదో గమనించ వచ్చు. తిథులను సూర్యుని గమనానికి ఎంత పక్కాగా సరిపోతున్నాయో గమనించవచ్చు.కాని తేదీల సంస్కృతిని ప్రకృతి సైతం తిరస్కరించడం గమనించాము.కాబట్టి పుట్టిన రోజులు అనేవి సూర్యుడు సైతం ఆమోదించిన తిథుల ప్రకారం జరుపుకోవాలి.

పుట్టిన రోజు నాడు ఏం చేయవచ్చు?

1) గోసేవ చేయడం

2) గోపూజ చేయడం

3) అనాథ ఆశ్రమంలో ఒక పూట అన్నదానం చేయడం

4) ఒక చెట్టు నాటడం

5) పేద బ్రాహ్మణులకు ఇంటి సరుకులు /బియ్యం (స్వయం పాకం) దానం ఇవ్వడం

6) నిరుపేదలకు - ఇంటి సరుకులు /బియ్యం/అన్నదానం చేయడం

7) ఆవుపాలు + నల్ల నూగులు + బెళ్లం కలిపి చిరంజీవుల పేర్లు స్మరిస్తూ తీసుకోవడం 

8) శివుడికి అభిషేకం చేయడం

9) తల్లితండ్రులకు నమస్కారం చేయడం

10) శ్రీరామకోటి/సుందరకాండ/భగవద్గీత పుస్తకాలు దానం ఇవ్వడం

ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలంటే-

1) ఇంట్లో బ్రాహ్మణ సేవ జరుగుతూ ఉండాలి

2) ఇంట్లో తులసి చెట్టు ఎండిపోవద్దు

3) ఇంట్లో మధ్యాహ్నం పూట అదే పనిగా నిద్ర పోకూడదు

Tags: పుట్టిన తేదీ, పుట్టిన రోజు, Puttina Roju, Happy Birthday, Birthday celebration, How to Celebrate Birthday, Birthday Celebration Telugu, Puttina Roju ela Chesukovali

ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments