మూడుసార్లు స్మరిస్తే సహస్రం ఎలా..? Rama Taraka Mantram - Sri Rama Rama Rameti

మూడుసార్లు స్మరిస్తే సహస్రం ఎలా..?

''శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే

సహస్ర నామ తత్తుల్యం రామనామ వరాననే!”

ఈ శ్లోకాన్ని మూడుసార్లు పఠిస్తే సహస్ర నామం పఠించిన దానికి సమానమని భావం.

ఈ విషయాన్ని సాక్షాత్తూ పరమ శివుడు పార్వ తీదేవికి చెబుతాడు. అంతటి పరమ పవిత్రమైన, ఉత్కృ ష్టమైన శ్లోకం ఇది. శక్తిని భక్తిని కలిమిని బలిమిని చెలిమిని ఆరోగ్యాన్ని సకల సౌభాగ్యాలను అందించే మహాద్భుత శ్లోకం. రామనామం యొక్క విశిష్టతను, ఉత్కృష్టకతను పరోక్షంగా తెలియజేసే శ్లోకం.

నారదుని ఉపదేశానుసారంగా, రామనామాన్ని జ పించిన రత్నాకరుడు వాల్మీకి మహర్షిగా అవతరించా రు. రామాయణ మహా కావ్యాన్ని మానవాళికి అందించారు. చిరస్మరణీయుడయ్యారు.

నిజానికి ఇంతటి మహోన్నత శక్తి ఈ శ్లోకానికి రావ డానికి, ‘రామ’ అనే నామానికి ఉన్న ప్రాభవమూ వైభవ మే కారణం. మూడుసార్లు పై శ్లోకాన్ని పఠిస్తే వచ్చే ఫలి తం, వేయి సార్లు పఠనం చేస్తే వచ్చే ఫలితానికి సమానమై న ఫలితాన్ని యిస్తుందని చెప్పినది సాక్షాత్తూ పరమ శివుడు. కాబట్టి అది పరమ సత్యం.

అంతేకాకుండా ‘రామ’ అనే శబ్దాన్ని మూడు సార్లు స్మరణ చేస్తే ఏమవుతుం ది? ఏ రకమైన ఫలితం వస్తుంది? అనే ప్రశ్నకు సమాధానాన్ని మహనీయులు, మహానుభావులు, గురువులు మహా వైభవోపేతంగా చెప్పిన దృష్టాంతాలు ఎన్నో ఉండనే ఉన్నాయి.

అయితే యిది ఆధునిక యుగం. కంప్యూటర్‌ యుగం. క్షిపణుల యుగం. వైజ్ఞానికంగా ఎంతో అభివృద్ధిని సాధించిన దశలో మనుగడ సాగిస్తున్నాం. కాబ ట్టి ఏదైనా సహతుకంగా, ఆధునికంగా ఆలోచన చేస్తేనే, చెప్పింది జనామోదం పొందుతుంది. చెప్పిన దానికి ఓ ఋజువునో, శాస్త్రీయతనో, సహతుకతనో చూప లేకపోతే, ఎంత గొప్ప విషయమైనా మూర్ఖత్వమని తీసిపారేసే పరిస్థితులలో మనం బ్రతుకుతున్నాం.

నిజానికి మూడుసార్లు పఠ నం చేస్తే, వేయిసార్లు పఠించిన ఫ లితం ఎలా వస్తుంది? మూడు అనే ది వేయి ఎలా అవుతుంది? అనే అ నుమానం కలగడం సహజమే.

అందుకనే మనం కాలాను గుణంగా ఆలోచనలు చేయాలి. మన సమర్ధింపు విశ్లేషణ ఆధునిక సమాజమూఆమోదించేలా ఉం డాలి.

కాబట్టి కాలానికి అనుగుణం గా, ఓ విభిన్న పద్ధతిలో, ఆధ్యాత్మి కానికి కొంచెం సహతుకతను, శాస్త్రీయతను జోడించి, మూడు సార్లు పై శ్లోకాన్ని పఠిస్తే, వేయి సార్లుకి సరిసమము ఎలా అవు తుందో పరిశీలిద్దాం.

మనం చెప్పుకునే పరిశీలన ఓ శాస్త్ర విజ్ఞాన సాధికారకత ప్రకా రం ఉందని కాదు. పూర్తి వైజ్ఞానిక సాధికారకత గల విశ్లేషణ అని చెప్పటమూ కా దు. అమూల్యమైన ఆధ్యాత్మిక తత్త్వాన్ని, సనాతన ఆర్ష సంస్కృతీ వైశిష్ట్యాన్ని, ఓ చిన్న ప్రామాణికంతో, ఓ నిర్దేశిత పద్ధతిలో, ఓ సాక్ష్యంగా చెప్పుకునే సమర్ధింపు మాత్రమే.

లోతులకు వెళ్లి అవలోకనం చేస్తే, ఓ కోణంలో దొరకిన సమర్ధింపుతో కూడిన సూత్రీకరణ మాత్రమే ఇది.

అదేంటో యిప్పుడు చూద్దాం. రామ అనే పదంలో ‘ర’, ‘మ’ అనే రెండక్ష రాలు ఉన్నాయి. అక్షరాలు అనగానే వర్ణమాల గుర్తొస్తుంది. తెలుగు వర్ణమాల, ‘అ’ అనే అక్షరంతో మొదలై ,’అం’ ‘అహ’ వరకు తిన్నగా ఒక వరుసన రాస్తాం. తర్వాత హల్లుల దగ్గరకు వచ్చేసరికి, ‘క ఖ గ ఘ జ్ఞ’ ఒక వరుసలో, ‘చ ఛ జ ఝ ఇం’ లను ఒక వరుసలో…. యిలా ‘ప ఫ బ భ మ’ వరకు అయిదేసి అక్షరాలను ఒక వరుసగా రాస్తాం. ‘య’ నుంచి బండి ర వరకు వరుసగా రాస్తాం. ఇదీ…తెలుగు వర్ణమాల ప్రత్యేకత!

వర్ణమాల ఆధారంగా మూడుసార్లు రామ నామాన్ని ఉచ్ఛారణ చేస్తే ‘వేయి’ ఎలా అవుతుందో చూద్దాం. వర్ణమాల ఆధారంగా ‘రామ’ శబ్దం యొక్క ఫలా న్ని/బలాన్ని లెక్కిద్దాం. ఆ లెక్కను ఆధారం చేసుకుని ‘మూడు’ సార్లు ”రామ” అంటే వచ్చే ఫలితాన్ని రాబడదాం.

”ర” అనే అక్షరం వర్ణమాలలో ఆఖరి వరుసలో రెండోదిగా ఉంటుంది. అంటే ‘ర’ అక్షర ఫలం రెండు. అలాగే ‘మ’ అక్షరం అంతకుముందు వరుసలో అయిదోది. అంటే ”మ” అక్షర ఫలం అయిదు.

కాబట్టి ”రామ” శబ్దాన్ని ఒక్కసారి ఉచ్చరిస్తే వచ్చే ఫలం 2 X 5 = 10 అవుతుంది. రెండుసార్లు ఉచ్చరించగానే 10 X 10 = 100 అవుతుంది. అదేవిధంగా మూడుసార్లు ఉచ్చరిస్తే 10 X 10 X 10 = 1000 అవుతుంది. అంటే సహస్రం అవుతుంది. ఇదీ ‘రామ’ శబ్దాన్ని మూడుసార్లు ఉచ్ఛరిస్తే, వేయి ఫలితం వస్తుందనేందుకు ఆధునిక నిదర్శనం.

ఇది ఆధ్యాత్మిక తత్త్వానికి సహతుకతను జోడించే చిన్న ప్రయత్నం మాత్ర మే. ఆధునిక జగత్తులో సమయాభావం వలన పై శ్లోకాన్ని కనీసం మూడుసార్లు ఉచ్ఛరిస్తే, సహస్ర నామ స్మరణ ఫలితం వస్తుందని చెప్పటమే వ్యాసం ఉద్దేశ్యం.

Tags: Rama Taraka Mantra, శ్రీరామ, Rama, Sri Rama Navami, Sri Rama Rama Ramethi, Ramayanam, Valmiki, Hanuman, Sri Rama Stotram

Comments