మానవ ధర్మములు
1) వస్త్రమును నాలుగు మడతలుగా ఎడమచేతియందు వుంచి దానిపై కుడిచేతినుంచి, పవిత్రమైన తీర్థమును మూడు సార్లు, ఒక్క చుక్కనైనా క్రింద పడనీయకుండా పుచ్చుకొన వలయును. తీర్థము బ్రహ్మహత్యాది పాతకములను నశింప జేయును. ఒక్క చుక్క క్రిందపడిన అంతకు ఎనిమిదిరెట్లు పాపం వచ్చును.
2) తీర్థము తాను ముందుగా పుచ్చుకుని, తర్వాత మిగతా వారికి ముమ్మారు ఇవ్వవలయును.
3) తీర్థము మూడుసార్లుగా తీసుకొనుటకు కారణము
1) ఆధ్యాత్మికము
2) అధిభౌతికము
3) అధి దైవికము
4) ఆలయములో నిలబడి, ఇంట్లో కూర్చుని తీర్ధము తీసికొనవలయును.
5) తీర్థము తాగిన తర్వాత ఆ చేతిని శిరస్సుమీద రాచుకొనరాదు, బట్టను తుడువవలెను.
6) పూజా సమయము దీపారాధన లౌకికాగ్నితో అగ్గిపుల్లలతో చేయరాదు. ఇంకొక జ్యోతినికాని, అగరవత్తిని గాని వెలిగించి, దానితో దీపారాధన చేయవలెను.
7) దీపారాధన చేయగానే అక్షతలుగాని, కుంకుమ గాని, పువ్వులుగాని దీపం కుంది మొదట్లొ వుంచవలెను.
8) ఒకదీపం కుందిలో రెండు జ్యోతులు (దీపములు) కు తక్కువ కాకుండా వుంచవలెను. ఒక్కదీపం అశుభము.
9) దీపారాధన ఆవునేతితో ఈశ్వర ప్రీతి, నూనెతో విష్ణుప్రీతి, స్త్రీ దేవతలకు కూడా పనికి వచ్చును.
10) దీపారాధన శివునికి ఎడమవైపు, విష్ణువునకు కుడి వైపు చేయవలెను. మిగిలినవారికి ఎటైనా చేయవచ్చును. ఎదురుగా మాత్రం చేయరాదు. (స్వామిదృష్టికి అడ్డు కనుక)
11) ఉదయం దీపారాధన ఎంత పుణ్యమో, సాయంకాలము దీపారాధన అంతకన్నా పుణ్యం కావున రెండు సమయములలోనూ దీపారాధన చేయవలెను.
12) ఇంట్లో ఎరికైనా ఎక్కువ జబ్బుగా వున్నపుడు మూడు కులాల (రంగుల) దారం ఏడు పేటల వత్తిగా చేసి, మట్టిప్రమిదలో వేసి, నెయ్యి, నూనె ఆముదము కలిపిపోసి దీపారాధన చేసిన అపమృత్యు దోషము పోవును.
13) ఆవునేతి దీపారాధన జ్ఞానసిద్ధి, అంతమందు 'మోక్షము, నువ్వుల నూనె దీపారాధన సంపదవృద్ధి, కీర్తియు గలుగచేయును.
14) ఆముదము, వేపనూనె, ఆవనూనె, అవిసెనూనె, మొదలగు తైలములతో శివుని పూజించు సమయమున దీపారాధన చేయకూడదు.
15) అఖండ దీపారాధన:
7 అం॥ ఎత్తున పెట్టడం ఉత్తమము.
3 అం॥ ఎత్తున పెట్టడం మధ్యమము.
1 అం॥ ఎత్తున పెట్టడం అధమము.
Tags: మానవ ధర్మములు, Dharma Sandehalu, Dharma Sandehalu Telugu, Devotional News, Devotional, Bhakthi Samacharam, Deepam, Temples, Thirdhtam
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Comments
Post a Comment