Drop Down Menus

Amalaki Ekadashi 2024 అమలకీ ఏకాదశి 2024: తేదీ, సమయం, అమలిక ఏకాదశి పూజ ఇంట్లో ఇలా చేసుకోండి మీ జాతకమే మారిపోతుంది.

అమలకి ఏకాదశి రోజు ఇలా చేస్తే.. మీ ఇంట్లో కాసులు వర్షమే..

హిందూమతంలో ఏకాదశికి చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రతి నెలా శుక్లపక్ష, కృష్ణపక్ష అనే రెండు ఏకాదశులు వస్తాయి. ఇవి లక్ష్మీదేవి, శ్రీహరికి అంకితం చేయబడ్డాయి.

ఈరోజున వీరిని పూజించి ఏది కోరుకుంటే అది జరుగుతుందని భక్తుల నమ్మకం. ఫాల్గుణ మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని అమలకీ ఏకాదశి లేదా ఉసిరి ఏకాదశి అంటారు. ఈరోజున విష్ణువుతోపాటు ఉసిరి చెట్టును పూజిస్తారు. ఇలా చేయడం వల్ల మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి సుఖసంతోషాలు అష్టఐశ్వర్యాలు సిద్దిస్తాయి. ఈ సంవత్సరం ఈ అమలకీ ఏకాదశి ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాం.

అమలిక ఏకాదశి శుభ ముహూర్త సమయం

ఈ ఏడాది అమలకీ ఏకాదశి మార్చి 20 అర్ధరాత్రి 12:21 గంటలకు ప్రారంభమై.. అంటే మార్చి 21 తెల్లవారుజామున 2:22 గంటలకు వరకు ఉంటుంది. ఉదయతిథి ఆధారంగా, మార్చి 20న అమలకి ఏకాదశి జరుపుకుంటారు. పారణ సమయం మార్చి 21 మధ్యాహ్నం 1:07 నుండి 3:32 వరకు ఉంటుంది.

అమలకి ఏకాదశి రోజున ఈ పని చేయండి

అమలకీ ఏకాదశి రోజున బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి స్నానం చేసి మంచి బట్టలు ధరించాలి. ఆ తర్వాత రోజంతా ఉపవాసం ఉంటూ శ్రీమహావిష్ణువును పూజించాలి. ఈరోజున మీ ఇంట్లోని పూజ గదిలో విష్ణువు ఫోటోను పెట్టి.. దానికి ముందుగా పసుపు, కుంకమ పెట్టాలి. ఆ తర్వాత పూజలో ఉసిరి కాయను ఉంచాలి. పండ్లు, స్వీట్లును నైవేద్యంగా పెట్టాలి. ఆ తర్వాత పసుపు కలిపిన అక్షతలను దేవుడు ముంచు ఉంచాలి. విష్ణుసహస్త్రనామం పఠిస్తూ దైవారాధన చేయాలి. చివరిగా హారతి ఇచ్చి ప్రసాదాన్ని అందరికి పంచిపెట్టాలి. ఈరోజున దానం చేయడం శుభప్రదంగా భావిస్తారు.

Tags: అమలకి ఏకాదశి, Amalaki Ekadashi 2024, Amalaki Ekadashi, ekadashi in 2024 list, ekadashi 2024 date and time, ekadashi march 2024 timings, amalaki ekadashi timings, amalaki ekadashi date and time 2024

ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.