Drop Down Menus

శ్రీరామనవమి రోజున రామయ్య ఆశీస్సులు పొందాలంటే ఇలా చేయండి - Sri Rama Navami

భారతీయ ప్రజలందరూ ఆచార సాంప్రదాయాలను పాటిస్తూ ఉంటారు. అంతేకాకుండా భారతీయ సంస్కృతిలో పండుగలకు కూడా చాలా విశిష్టత ఉంది. ప్రతి పండుగని ప్రజలందరూ ఎంతో ఘనంగా జరుపుకుంటారు.ఇంతటి పవిత్రమైన శ్రీరామనవమి రోజున కొన్ని పనులు పొరపాటున కూడా చేయకూడదు. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.

భక్తిశ్రద్ధలతో శ్రీరాముడిని కొలిచే ఈ పవిత్రమైన పర్వదినాన పొరపాటున కూడా మాంసం మద్యం సేవించరాదు. అలాగే పండగ రోజు తయారు చేసే వంటలలో అల్లం వెల్లుల్లి ఉపయోగించరాదు. అలాగే వాటిని ఆహారంలో కలిపి తీసుకోకూడదు. అలాగే శ్రీరామనవమి పండుగ రోజున జుట్టు కత్తిరించుకోవడం ఆ శుభమని పండితులు చెబుతున్నారు. అందువల్ల పండుగ రోజున జుట్టు కత్తిరించకూడదు. భక్తిశ్రద్ధలతో శ్రీరాముడిని కొలిచే ఈ శ్రీరామనవమి రోజున ఇతరులను దూషించకూడదు.అబద్దాలు ఆడకూడదు.

ఓం శ్రీ రామయ: నమ:..శ్రీ రామ జయ రామ జయ జయ రామ..ఓం దశరథ తనయాయ విద్మహే .. సీతావల్లభయ ధిమాహీ తనో రామ ప్రచోదాయత్ అనే మంత్రాన్ని జపిస్తూ శ్రీ రామ నవమి రోజున శ్రీ రాముడిని పూజించటం వల్ల ఆయన అనుగ్రహం లభిస్తుంది. అలాగే ఈ రోజున ఉపవాసం ఆచరించడం వల్ల మీకు సుఖం, శ్రేయస్సు కలిగి పాపాలు నశిస్తాయి. శ్రీ రాముడు మధ్యాహ్న సమయంలో జన్మించాడు కాబట్టి, ఈ సమయంలో రామ నవమి పూజ చేయడం మంచిది. అలాగే ఈ రోజున అర్చనలు, నిర్దిష్ట పూజలు చేయవచ్చు. వీటన్నింటిని ఏకకాలంలో నామ జపం, మంత్రాలు, శ్లోక పఠనంతో అనుసరించాలి. స్వామివారికి తలంబ్రాలు పడిన తరువాతనే మధ్యాహ్న భోజనం చేయాలి. అవకాశం చేసుకొని దగ్గరలోని దేవాలయానికి వెళ్లి శ్రీరాముని కళ్యాణాన్ని తిలకించండి.

శ్రీరామ నవమి రోజున రామయ్య ఆశీస్సులు పొందాలంటే ఇలా చేయండి :

  • ఈ రోజున ఇంట్లోని ప్రతి ఒక్కరూ సూర్యోదయానికంటే ముందుగానే నిద్ర లేచి ఇంటిని శుభ్రం చేసుకుని తలస్నానం చేయాలి.
  • అలాగే కొత్త బట్టలను ధరించి, ఇంటిని మామిడి ఆకుల తోరణాలతో అలంకరించాలి.
  • ఇంట్లో శ్రీరాముడు, సీతాదేవి, హనుమంతుడు, లక్ష్మణుడి విగ్రహాలను ప్రతిష్ఠ చేయాలి.
  • తర్వాత ఆ శ్రీరాముడికి శ్రీ రామ అష్టోత్తరం, శ్రీ రామరక్షా స్తోత్రం, శ్రీ రామాష్టకం, శ్రీ రామ సహస్రం, శ్రీమద్రామాయణం లాంటి స్త్రోత్రాలతో పూజలు చేయాలి.
  • అలాగే రామచంద్రమూర్తికి ఇష్టమైన వడపప్పు, పానకాన్ని నైవేద్యంగా పెట్టి పూజ అనంతరం దాన్ని భక్తి శ్రద్ధలతో ఇంట్లోని కుటుంబ సభ్యులందరూ స్వీకరించాలి.
  • ఈ రోజున ఉపవాసం చేయడం వల్ల విష్ణలోక ప్రాప్తికలుగుతుందని పండితులు చెబుతున్నారు.
  • అలాగే ఈ రోజున ఆ రాముడి ఆశీస్సులు పొందడానికి రామనామస్మరణం చేయాలని, రామకోటి రాయాలని చెబుతున్నారు.
  • దివ్యమైన ఈ రోజున ఏ వ్రతం చేసినా ఫలించదని, కేవలం శ్రీరామవ్రతం మాత్రమే ఫలిస్తుందని, ఈ వ్రతానికి మించినది లేదని పండితులు చెబుతున్నారు.
  • శ్రీరామ నవమి రోజున రామనామస్మరణ చేయడం, రామనామ ధ్యానం చేయడం వల్ల పాపాలు తొలగి, జయాలు సిద్ధిస్తాయని అంటున్నారు.
  • ఇంట్లో పూజలు చేయని వారు దగ్గరలో ఉన్న రామాలయానికి వెళ్లి ఉదయాన్నే శ్రీరాముడిని దర్శించుకోవాలి. అలాగే ఆలయాల్లో జరిగే పంచామృతంతో అభిషేకం, శ్రీరామ ధ్యాన శ్లోకములు, శ్రీ రామ అష్టోత్తర పూజ, సీతారామకల్యాణం వంటి కార్యక్రమాలలో పాల్గొంటే కూడా పుణ్యఫలం దక్కుతుందని పండితులు చెబుతున్నారు.

Tags: శ్రీరామనవమి, Sri rama navami 2024, Sriramanavami, Srirama, Rama Mantram Telugu, Srirama Taraka Mantram, Srirama Stotram, Rama, Sriramanavami date, bhadrachalam, talambralu

ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

ఎక్కువమంది చదివినవి

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.