Drop Down Menus

తమిళనాడు టూర్ ఏవిధంగా ప్లాన్ చేసుకోవాలి ? | Tamil Nadu Tour Planning Famous Temples Arunachalam Madurai

హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం, టూర్ ప్లానింగ్ సమాచారం మీకు వరసగా అదివ్వబోతున్నాము. మీరు home పేజీ లో ఆలయాలు పై క్లిక్ చేస్తే మీకు టూర్ ప్లానింగ్ అని కనిపిస్తుంది అక్కడ వరసగా ఏమేమి రాసామో అన్ని కనిపిస్తాయి. ఎందుకు చెబుతున్న అంటే ఇప్పుడు చదివిన మీరు మరల చూద్దాం అంటే ఎక్కడ చూడాలో తెలియదు కదా . మీరు మన యాప్ డౌన్లోడ్ చేసారా ?5 స్టార్ రేటింగ్ ఇచ్చి రివ్యూ రాసి ప్రోత్సహించగలరు.

తమిళనాడు టూర్ ఏవిధంగా ప్లాన్ చేసుకోవాలి ? ఏ వరసలో చూస్తే ప్రసిద్ధ క్షేత్రాలైన కంచి అరుణాచలం మదురై శ్రీరంగం రామేశ్వరం లాంటి క్షేత్రాలు అన్ని కవర్ అయ్యేలా ఎలా ప్లాన్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. తమిళనాడు టూర్ ప్లానింగ్ ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తుంటారు. కొందరు శ్రీశైలం మహానంది చూసుకుంటూ మొదలు పెడితే మరికొంత మంది కాణిపాకం దర్శించి అక్కడ నుంచి వస్తారు, ఇంకొందరు చెన్నై వెళ్లి అక్కడ బీచ్ , లోకల్ టెంపుల్స్ చూసి అక్కడ నుంచి మొదలు పెడతారు. 

తమిళనాడు టూర్ దేశం లో అన్ని రాష్ట్రాల కంటే కూడా తమిళనాడు లో ఎక్కడిక్కడ ఎత్తైన గోపురాలతో ఆలయాలు స్వాగతం పలుకుతాయి , ఆ క్షేత్రాల చరిత్ర తెలుసుకోవాలనే కుతూహలం మనకు కలుగుతుంది. ఇప్పుడు మనం తమిళనాడు ఆలయాల వరస చూద్దాం , ఆ తరువాత తమిళనాడు 3 రోజులు యాత్ర , 5 రోజుల యాత్ర , 9 రోజుల యాత్ర లో ఏవేవి చూడవచ్చో వేరే ఆర్టికల్ లో తెలుసుకుందాం. 

తిరుపతి దర్శనం చేసుకుని చాలామంది చుట్టుప్రక్కల ఆలయాలు చూస్తుంటారు, మీ సమయాన్ని బట్టి మీరు కేటాయించిన రోజులను బట్టి యాత్ర పొడిగించవచ్చు తగ్గించవచ్చు తిరుపతి నుంచి కాణిపాకం వెళ్లి అక్కడ నుంచి యాత్ర ప్రారంభిస్తే

కాణిపాకం / Kanipakam( శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయం )

అరుణాచలం / Arunachalam ( పంచభూత లింగ క్షేత్రాలలో అగ్ని లింగం )

శ్రీపురం గోల్డెన్ టెంపుల్ /Sripuram( బంగారు లక్ష్మి దేవి గుడి , తమిళనాడు లో అడుగుపెట్టాము )

పళని / Palani ( సుబ్రహ్మణ్య స్వామి ఆలయం , ఆరుపడైవీడు క్షేత్రాలలో ఒకటి )

ఇషా / Isha ( కోయంబత్తూర్  ఆదియోగి)

మదురై / Madurai ( మీనాక్షి అమ్మవారి ఆలయం )

తిరుప్పరంకుండ్రం / Tirupparakumdram ( సుబ్రహ్మణ్య స్వామి ఆరుపడైవీడు క్షేత్రాలలో ఒకటి మదురై కు 9 కిమీ దూరం లో ఉంది )

పజముదిర్చోళై / pazhamudircholai ( సుబ్రహ్మణ్య స్వామి ఆరుపడైవీడు క్షేత్రాలలో ఒకటి మదురై కు 25 కిమీ దూరం లో ఉంది )

త్రివేండ్రం / Trivendram

నాగర్ కోయిల్ / Nagar Koil

కన్యాకుమారి / Kanyakumari ( దక్షిణ భారతదేశం చివరి స్థానం, కన్యాకుమారి ఆలయం )

సూచింద్రం / Suchimdram

తిరుచెందూర్ / Tiruchendur ( సముద్రపు ఒడ్డున కలదు సుబ్రహ్మణ్య స్వామి ఆలయం , ఆరుపడైవీడు క్షేత్రాలలో ఒకటి )

రామేశ్వరం / Rameswaram( జ్యోతిర్లింగ క్షేత్రం , రామసేతు ఇక్కడే ఉంది, 22 బావుల్లో స్నానం చెయ్యాలి)

నవపాషణం / Navapashanam ( నవగ్రహాల ఆలయం )

దర్భశయనం / Darbhasayanam

శ్రీరంగం / Srirangam ( భారదేశం లో అతి పెద్ద ఆలయం)

జంబుకేశ్వరం Thiruvanaikovil ( పంచభూత లింగ క్షేత్రాలలో జల లింగం , శ్రీరంగం నుంచి 2 కిమీ దూరం )

సమయపురం / Samayapuram ( మరియమ్మ ఆలయం / ఆది పరాశక్తి )

తంజావూరు బృహదీశ్వర ఆలయం / Thanjavur  ( 1000 సంవత్సరాల పురాతన ఆలయం )

తిరువయ్యారు / Tiruvaiyaru ( త్యాగరాజ స్వామి సమాధి ఇక్కడే ఉంది )

స్వామిమలై / Swamymalai ( సుబ్రహ్మణ్య స్వామి ఆలయం , ఆరుపడైవీడు క్షేత్రాలలో ఒకటి )

వైదీశ్వరం / Vaideeswaram ( శివుని ఆలయం, నాడి జ్యోతిష్యానికి ప్రసిద్ధి )

కుంభకోణం / Kumbakonam ( ఆది కుంభేశ్వర ఆలయం , సారంగంపాని ఆలయం , ఐరావతేశ్వర ఆలయం )

చిదంబరం / Chidambaram ( పంచభూత లింగ క్షేత్రాలలో ఆకాశ లింగం )

కాంచీపురం / Kanchipuram ( కామాక్షి ఆలయం , బంగారు బల్లి వరదరాజ పెరుమాళ్ , ఏకాంబరేశ్వర ఆలయం పంచభూత లింగ క్షేత్రాలలో పృద్వి లింగం )

తిరుత్తణి / tiruttani ( సుబ్రహ్మణ్య స్వామి ఆలయం , ఆరుపడైవీడు క్షేత్రాలలో ఒకటి )

శ్రీకాళహస్తి / Srikalahasti ( పంచభూతలింగ క్షేత్రాలలో వాయు లింగ క్షేత్రం , రాహుకేతు పూజలకు ప్రసిద్ధి )

ఈ విధంగా ప్లాన్ చేస్తే తమిళనాడు లోని క్షేత్రాలు ఒక వరసలో చూసి రావచ్చు , మరొక పోస్ట్ లో 3 రోజులు , 5 రోజులు ఎలా ప్లాన్ చెయ్యాలో చెబుతాను .

TamilNadu Famous Temples

Keywords:

ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

  1. హిందూ టెంపుల్స్ గైడ్ చాలా బాగుంది

    ReplyDelete
    Replies
    1. Excellent information

      Delete
    2. Very Good you are giving good information and temple tours planning is also vegood

      Delete
  2. Good information, useful for everyone thankyou

    ReplyDelete
  3. Very good very useful information sir . Thankyou.

    ReplyDelete
  4. Good Info, best time to visit all these temples ? How much it cost for entire trip ?

    ReplyDelete
  5. Very nice good information

    ReplyDelete
  6. Very nice good information

    ReplyDelete

Post a Comment

ఎక్కువమంది చదివినవి

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.