Drop Down Menus

తిరుమల ఆర్జిత సేవ కళ్యాణం టికెట్స్ విడుదల | Tirumala Arjitha Seva Tickets for July Month

Tirumala Arjitha Seva

ఓం నమో వేంకటేశాయ హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం. తిరుమల ఆర్జిత సేవ టికెట్స్ అనగా కళ్యాణం, ఉంజల్ సేవ , ఆర్జిత బ్రహ్మోత్సవం , సహస్ర దీపాలంకర సేవ టికెట్స్ జులై నెలకు గాను ఏప్రిల్ 22వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తున్నారు. ఈ టికెట్స్ లక్కీ డ్రా టికెట్స్ కాదు ఎవరు ముందు బుక్ చేసుకుంటే వారికి బుక్ అవుతాయి. కళ్యాణం టికెట్స్ దంపతులు బుక్ చేసుకోవాలి మిగిలిన సేవలకు సింగల్ గా కూడా కూడా బుక్ చేసుకోవచ్చు.  కళ్యాణం టికెట్ తో టికెట్ బుక్ చేసుకున్న వారు పిల్లలను తీసుకుని వెళ్లవచ్చా లేదా అనే సందేహం చాలామందిలో ఉంది. అన్నీ సేవలకు కూడా మీరు 12 సంవత్సరాల లోపు పిల్లలను తీసుకుని వెళ్ళవచ్చు , 12 దాటిన ఆడపిల్లలకు కళ్యాణం టికెట్ లేకపోయినా పంపిస్తారు , ఆర్జిత సేవలకు బుక్ చేసుకున్న వారికి సుపథం నుంచి దర్శనం ఇస్తారు , మీకు కళ్యాణం టికెట్ ఉండి మీ పిల్లలను తీసుకుని వెళ్ళాలి అనుకుంటే వారి ఆధార్ కార్డు కూడా తీసుకుని వెళ్ళండి సుపథం చెకింగ్ పాయింట్ దగ్గర ఆడపిల్లలకు 300/- టికెట్ ఇచ్చి పంపిస్తారు. గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే మగపిల్లలకు టికెట్స్ ఇవ్వడం లేదు. మన హిందూ టెంపుల్స్ గైడ్ కు వాట్స్ యాప్ గ్రూప్ లు కూడా ఉన్నాయి. మీరు 8247325819 కు తిరుమల అని మెసేజ్ చేయండి లేదా ఫ్రీ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి ఈ పోస్ట్ క్రింద న వాట్స్ యాప్ ఫోటో కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేసిన మీరు జాయిన్ అవుతారు. 

టికెట్స్ బుక్ చేయడానికి తిరుమల వెబ్సైటు : https://ttdevasthanams.ap.gov.in/

#tirumala arjitha seva tickets latest information, july month arjitha seva tickets release updates

ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FAQ'S

సెప్టెంబర్ నెల వరకు తిరుమల 300/- టికెట్స్ , సేవ టికెట్స్ , రూమ్స్ , సీనియర్ సిటిజెన్ టికెట్స్ , అంగప్రదక్షిణ టికెట్స్ అన్ని బుక్ అవ్వడం జరిగింది.
తిరుమల శ్రీవారి సేవ కూడా సెప్టెంబర్ నెల వరకు బుక్ అయ్యాయి
అక్టోబర్ నెల టికెట్స్ జులై 18వ తేదీ నుంచి విడుదల చేస్తారు. 

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.