Drop Down Menus

అక్షయ తృతీయ 2024 ఎప్పుడు? తేదీ, పూజ ముహూర్తం మరియు ప్రాముఖ్యత - Akshaya Tritiya 2024? Date, Puja Muhurat and Significance

2024లో అక్షయ తృతీయ జైనులు మరియు హిందువులు ఇద్దరూ ఆచరించే అక్షయ తృతీయ, భారతదేశంలో ముఖ్యమైన వసంత పండుగను సూచిస్తుంది. హిందూ పంచాంగ్‌లోని వసంత లేదా వైశాఖ మాసం యొక్క మూడవ చంద్ర రోజు నుండి దీనికి పేరు వచ్చింది. అయితే ఈ సంవత్సరం, గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం, ఈ పండుగ 10 మే 2024 న జరుగుతుంది.

అక్షయ తృతీయ ముహూర్తం

అక్షయ తృతీయ - శుక్రవారం, మే 10, 2024 

అక్షయ తృతీయ పూజ ముహూర్తం - 05:48 AM నుండి 12:23 PM వరకు

వ్యవధి – 06 గంటలు 35 ని..

తృతీయ తిథి ప్రారంభం - మే 10, 2024న ఉదయం 04:17

తృతీయ తిథి ముగుస్తుంది - మే 11, 2024 - 02:50 AM

అక్షయ తృతీయ విధి

అక్షయ తృతీయ నాడు మీరు ఏ పుణ్యమైతే చేసారో ఆ పుణ్యాన్ని క్షయం చేయరు.

అంటే ఈ పుణ్యం చేసావు కాబట్టి ఇదిగో ఈ సుఖం ఇచ్చాం అని రద్దు చేయరు. ఆ పుణ్యాన్ని

అలాగే ఉంచుతారు, ఉంచి జీవుడి ఖాతాలో దాని వలన రావలసిన ఫలితాన్ని నిరంతరంగా

ఇస్తారు. అందుకే అక్షయ తృతీయనాడేం చేస్తారు అంటే ఉదక కుంభ దానము అని విధించింది

ధర్మ సింధువు. రెండు మూడు రోజుల ముందే కొన్న కొత్త కుండని పచ్చి

మట్టి వాసన పోయేటట్లుగా నీళ్ళు పోసి కడిగి, ఆ రోజున చక్కగా త్రాగటానికి

వీలైన నీళ్ళు పోసి అందులో ఓ నాలుగు ఏలక్కాయలు చితక్కొట్టి ఆ గుండ

వేసి ఆ ఉదక కుంభ దానం చేస్తారు తీసుకెళ్ళి. అలా చేసినట్లైతే క్షయము

కాదు అని. నువ్వు ఒక కుంభం ఇచ్చావు కాబట్టి నీకు కూడా ఒక కుండ

ఇస్తాం అనరు. ఆ ఇచ్చిన నీళ్ళు జీవుడి ఖాతాలో జీవుడు ఎంత కాలం ఎన్ని

జన్మలెత్తినా నీటికి లోటులేకుండా ఆయనకి ఎప్పుడు దాహమేసినా నీరు లభ్యమౌతుంది.

నీటితో విరోధం రాదు. అంటే నాకీ నీళ్ళుపడలేదండీ అని బాధపడవలసిన అవసరం ఉండదు.

అలా జల దేవతలు అనుగ్రహిస్తారు అని. అందుకని మిగిలిన దానాలన్నీ పక్కన పెట్టి జలదానం చేస్తారు, ఉదక కుంభదానం చేస్తారు. రెండు, తండుల దానం అని, కలియుగంలో అన్నాన్ని ఆశ్రయించి ప్రాణులు నిలబడతాయి. అన్నాద్భవంతి భూతాని అని..! అందుకని ఆ అన్నం పెట్టడానికి ప్రత్యామ్నాయంగా బియ్యం ఇస్తారు..

Tags: అక్షయ తృతీయ, akshaya tritiya 2024 telugu calendar, akshaya tritiya 2024 nakshatra, akshaya tritiya 2024, akshay tritiya muhurat, akshaya tritiya 2024 date and time, akshaya tritiya today, akshay tritiya telugu

ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.