Drop Down Menus

రామేశ్వర దర్శనం.. సర్వపాపహరణం! సీతమ్మ చేసిన శివలింగం.. Rameshwaram Temple in Tamil Nadu

రామేశ్వర దర్శనం.. సర్వపాపహరణం!

సీతమ్మ చేసిన శివలింగం..

త్రేతాయుగంలో సీతాదేవిని అపహరించిన రావణాసురుడిని సంహరించేందుకు..

శ్రీరామచంద్రుడు వానర సైన్యంతో కలిసి రామేశ్వరం నుంచే రామసేతును నిర్మించి శ్రీలంకకు చేరుకున్నాడట.

రావణసంహారం అనంతరం రాముడు - సీతాదేవి, లక్ష్మణుడు, హనుమంతుడు, సుగ్రీవుడితో కలిసి అయోధ్యకు ప్రయాణమవుతూ ఇక్కడ సేదతీరాడట. ఆ సమయంలో మహాజ్ఞానీ, శివభక్తుడూ అయిన రావణబ్రహ్మను సంహరించినందుకు బాధపడుతూ తనకు బ్రహ్మహత్యాపాతకం చుట్టుకోకుండా పరిష్కారం చూపమని మహర్షులను అడిగాడట. అంతా కలిసి శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించమని సలహా ఇవ్వడంతో కైలాసానికి వెళ్లి శివలింగాన్ని తీసుకురమ్మంటూ రాముడు హనుమంతుడిని ఆదేశించాడట. అయితే ముహూర్త సమయం దగ్గరపడుతున్నా హనుమంతుడు రాకపోయేసరికి సీతాదేవి సముద్రపు ఒడ్డున ఇసుకతో శివలింగాన్ని తయారుచేయడంతో రాముడు ఆ శివలింగానికే పూజలు జరిపించాడట. ఆ తరువాత శివలింగంతో వచ్చిన హనుమంతుడు విషయం తెలిసి అలగడంతో రాముడు రెండింటినీ ప్రతిష్ఠించి.. మొదట హనుమంతుడు తెచ్చిన శివలింగాన్నే దర్శించుకోవాలనే నియమాన్ని పెట్టాడట.

అందుకే ఇప్పటికీ హనుమంతుడు తెచ్చిన శివలింగానికి పూజలూ, నైవేద్యాలూ జరిపాకే.. రామలింగానికి పూజలు చేస్తారు అర్చకులు. ఇలా రెండు శివలింగాలు కలిగిన అరుదైన ఆలయంగానూ ఈ గుడి గుర్తింపు సాధించింది. అలా రాముడు ప్రతిష్ఠించిన రామనాథస్వామి జ్యోతిర్లింగంగా పూజలు అందుకుంటున్నాడు.

అగ్నితీర్థంలో స్నానమాచరించాకే..

రామేశ్వరంలో మొత్తం అరవైనాలుగు బావులు ఉంటే... వాటిల్లో ఆలయంలో ఉన్న ఇరవైరెండు అతి ప్రధానమైనవిగా చెబుతారు. రావణ సంహారం అనంతరం రాముడి అమ్ములపొదిలో మిగిలిన ఇరవైరెండు బాణాలతోనే ఇక్కడ ఇరవైరెండు బావుల్ని సృష్టించాడనీ అంటారు.

ఇక్కడకు వచ్చే భక్తులు మొదట సముద్రపు ఒడ్డునున్న అగ్నితీర్థంలో స్నానమాచరించాకే ఆలయంలోపలికి వెళ్తారు.

అలాగే ఆలయం లోపల ఉన్న ఇతర తీర్థాలన్నింట్లో కాకపోయినా ఒకటి రెండింట్లోనైనా స్నానమాచరించొచ్చు.

ఈ తీర్థాలన్నీ సముద్రపు ఒడ్డున ఉన్నా కూడా ఒక్కో బావి నీటి రుచి ఒక్కోలా ఉండటమే కాదు... కొన్ని బావుల్లోని నీరు తియ్యగానూ ఉండటం విశేషం. ప్రతి తీర్థానికీ ఆయుర్వేద సుగుణాలు ఉంటాయనీ చెబుతారు. ఈ తీర్థాలకు సావిత్రి, గాయత్రి, సరస్వతి, నల, నీల సూర్య, చంద్ర, గంగ... తదితర పేర్లు ఉంటాయి.

108 శివలింగాల్నీ చూడొచ్చు..

తీర్థాల్లో స్నానమాచరించిన భక్తులు మొదట హనుమంతుడు తెచ్చిన శివలింగాన్ని దర్శించుకున్నాకే జ్యోతి ర్లింగాన్ని పూజిస్తారు.

శివలింగాల దర్శనమయ్యాక పర్వతవర్ధినిగా పూజలు అందుకుంటున్న పార్వతీదేవి మందిరానికి వెళ్తారు. ఆ తరువాత విశ్వేశ్వరుడు, విశాలాక్షి, విష్ణుమూర్తి, మహాలక్ష్మి, సంతాన - సౌభాగ్య గణపతి, నటరాజు, నవగ్రహ మండపం, వల్లీదేవసేన సమేత కార్తికేయుడు.. తదితర దేవతా మూర్తుల్ని దర్శించుకోవచ్చు.

ఆలయం ప్రాకారాల్లో నడిచే భక్తులు - మహర్షులు ప్రతిష్ఠించిన 108 శివలింగాలనూ చూసి మంత్రముగ్ధులవుతారు.

రామలింగ ప్రతిష్ఠను తెలియజేసే మందిరమూ ఉందిక్కడ. నంది మండపంలోని నంది విగ్రహం దాదాపు పదిహేడు అడుగుల ఎత్తు ఉంటుంది. హనుమంతుడి విగ్రహం శ్రీలంకవైపు చూస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఇక్కడున్న లక్ష్మణతీర్థంలో పితృతర్పణ కార్యక్రమాలనూ నిర్వహించొచ్చు.

కల్యాణం కమనీయం..

ఆలయ ప్రాంగణంలో ఏడాది మొత్తం జరిపే పూజలు ఒకెత్తయితే  ప్రత్యేక పర్వదినాల్లో నిర్వహించే ఉత్సవాలు మరొకెత్తు. ముఖ్యంగా మహాశివరాత్రి సందర్భంగా పదిరోజులపాటు ప్రత్యేక పూజలు నిర్వహించి దేవతామూర్తుల్ని పురవీధుల్లో ఊరేగించడం, అభిషేకాలూ, దీపాల అలంకరణలు చూసేందుకు రెండు కళ్లూ సరిపోవు. అలాగే జులై, ఆగస్టు నెలల్లో తిరుకల్యాణం పేరుతో పదిహేడు రోజులపాటు ప్రత్యేక ఉత్సవాలు జరుగుతాయి.

ఆ సమయంలో జరిగే రామనాథస్వామి-పర్వతవర్ధిని కల్యాణాన్నీ ఇతర సాంస్కృతిక కార్యక్రమాలనూ చూసి తరించాల్సిందే. దేవీశరన్నవరాత్రులు, నటరాజ నిజరూప దర్శనం, రామలింగ ప్రతిష్ఠను పురస్కరించుకుని ప్రత్యేక ఉత్సవం, ఆరుద్ర దర్శనం పేరుతో విశేషమైన కార్యక్రమాలు, శ్రీరామనవమి.. ఇలా ఏడాది మొత్తం ఎన్నో వేడుకలు జరుగుతాయిక్కడ.

సముద్రం శాంతంగా..

రామేశ్వరానికి వచ్చే భక్తులు కేవలం స్వామి దర్శనంతోనే వెనుతిరిగి వచ్చేయరు. ఇక్కడున్న ధనుష్కోడి, పాంబన్‌ వంతెన, తేలే ఇటుకలు, గంధమాదన పర్వతాన్నీ సందర్శిస్తారు. రాముడి పాదుకలు ఉండే గంధమాదన పర్వతం పైకి ఎక్కితే రామేశ్వరం మొత్తం కనిపిస్తుందట.

రామేశ్వరంలోని సముద్రానికి శాంత సముద్రమని పేరు. అలల ఉధృతిలేని సముద్రాన్ని ఇక్కడ మాత్రమే చూడొచ్చు.

సంపూర్ణయాత్ర చేసినట్లే..

రామేశ్వర యాత్రను ఓ పద్ధతి ప్రకారం చేస్తే పుణ్యక్షేత్రాలన్నింటినీ  దర్శించిన ఫలితం దక్కుతుందట. భక్తులు మొదట వారణాసికి వెళ్లి కాశీవిశ్వనాథుడిని పూజించి అక్కడి నుంచి గంగాజలాన్ని తీసుకొచ్చి రామేశ్వరంలోని శివుడికి అభిషేకించాలి. మళ్లీ ఇక్కడున్న ఇసుకను తీసుకెళ్లి కాశీలోని గంగలో కలపాలని అంటారు. పైగా భారతదేశంలో ఉన్న నదులన్నీ ఇక్కడున్న బావుల అంతర్భాగం నుంచే ప్రవహిస్తాయని చెబుతారు. అందుకే రామనాథస్వామిని దర్శించుకుంటే సమస్త యాత్రాఫలితం కలుగుతుందని ప్రతీతి.

Tags: Rameswaram Temple, Ramanathaswamy temple, Rameshwaram, rameshwaram temple wallpaper, rameshwaram temple jyotirlinga, rameshwaram temple timings, rameshwaram temple photos, rameshwaram temple history, rameshwaram temple distance, rameshwaram temple open, rameshwaram temple state

ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FAQ'S

సెప్టెంబర్ నెల వరకు తిరుమల 300/- టికెట్స్ , సేవ టికెట్స్ , రూమ్స్ , సీనియర్ సిటిజెన్ టికెట్స్ , అంగప్రదక్షిణ టికెట్స్ అన్ని బుక్ అవ్వడం జరిగింది.
తిరుమల శ్రీవారి సేవ కూడా సెప్టెంబర్ నెల వరకు బుక్ అయ్యాయి
అక్టోబర్ నెల టికెట్స్ జులై 18వ తేదీ నుంచి విడుదల చేస్తారు. 

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.