తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఆగస్టు నెలకు సంబంధించిన మొదటి గడప దర్శనాలు అనగా సేవ ఎలక్ట్రానిక్ డిప్ ఆర్జిత సేవలను విడుదల చేస్తున్నారు. వీటికి సంబందించిన ప్రశ్న జవాబులను ఇప్పుడు చూద్దాం
ఇవి లక్కీ డ్రా టికెట్స్ , అందరు పాల్గొనడానికి వీలుగా రెండు రోజలు అనగా 18వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 20 వ తేదీ 10 గంటల వరకు సమయం ఇచ్చారు .
మొదటి గడప దర్శనాలు అనగా ఏమి ఉంటాయి ?
వీటిని ఆర్జిత సేవ లు అని పిలుస్తారు , వాడుక భాష లో మొదటి గడప దర్శనాలు అయ్యాయి . ఈ సేవ లు వరుసగా సుప్రభాతం , తోమాల , అర్చన , అష్టదళ పాదపద్మారాధన .
డ్రా లో పాల్గొనడానికి డబ్బులు ఏమైనా కట్టాలా ?
అవసరం లేదు , సెలెక్ట్ అయినవారు మాత్రమే డబ్బులు కట్టి టికెట్ కన్ఫర్మ్ చేసుకోవాలి.
ఏ సేవకు ఎంత టికెట్ ధర ఉంటుంది ?
సుప్రభాతం - 120 రూపాయలు , తోమాల అర్చన - 220/- రూపాయలు , అష్టదళ పాదపదమారాధన -1250 రూపాయలు .
అన్ని సేవలకు డ్రా వేసుకోవచ్చా ?
మీరు అన్ని సేవలకు డ్రా వేసుకోవచ్చు .
మనకు ఒకేసారి రెండు సేవ లు తగిలే అవకాశం ఉంటుందా ?
ఆలా ఉండదు ఏదోక సేవ మాత్రమే వస్తుంది .
ఆగష్టు నెలలో సేవ వస్తే మరల సెప్టెంబర్ నెలలో డ్రా లో పాల్గొనవచ్చా ?
సేవ వచ్చిన వారు సేవ డేట్ నుంచి 6 నెలల వరకు డ్రా లో పాల్గొనడానికి అవకాశం ఉండదు కానీ ఈ నాలుగు సేవ లు కాకుండా మిగిలిన దర్శనాలు సేవ లు అన్ని చేసుకోవచ్చు .
చాల సార్లు డ్రా వేసాము మాకు రావడం లేదు కారణం ఏమిటి ?
ప్రతి నెల డ్రా లో పాల్గొనేవారి సంఖ్య పెరుగుతుంది , గత నెల 2 లక్షల 90 వేల మంది డ్రా లో పాల్గొన్నారు , మనకు డ్రా మొత్తం టికెట్స్ 8000 సుమారు ఉంటాయి అందువలనే డ్రా లో తగలడం లేదు .
డ్రా లో ఒకేసారి ఎంతమందికి టికెట్ బుక్ చేయవచ్చు ?
ఇద్దరికీ మాత్రమే ఒక మొబైల్ నెంబర్ పై బుక్ చేయగలము . 12 సంవత్సరాల లోపు పిల్లలకు అవసరం లేదు .
కొండపైన ఎక్కడైనా టికెట్స్ ఇస్తారా ?
ప్రతి రోజు cro ఆఫీస్ దగ్గర 11-5 గంటల వరకు సేవ లకు డ్రా వేసుకోవచ్చు .
ఏ వెబ్ సైట్ లో బుక్ చెయ్యాలి ?
టీటీడీ వెబ్ సైట్ : https://ttdevasthanams.ap.gov.in/ లో బుక్ చెయ్యాలి .
ఏ విధంగా బుక్ చెయ్యాలి వీడియో ఏమైనా ఉందా ?
ఈ వీడియో చూసి మీరు టికెట్ బుక్ చేయండి
tirumala latest information, tirumala modati gadapa darshanam.
10000 rs darsanam tickets ekaka dorukutayi kond pyina
ReplyDeleteJeo office gokulam
Delete