Drop Down Menus

ఇలా సులభంగా తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు పొందొచ్చు.. ప్రాసెస్‌ ఇదే - Tirupati 300 rs Ticket online booking Telegu | TTD special Darshan Ticket Booking

ఇలా సులభంగా తిరుమల శ్రీవారి దర్శనం టికెట్లు పొందొచ్చు.. ప్రాసెస్‌ ఇదే

భక్తులు రుసుము చెల్లించి వేంకటేశ్వర స్వామిని దర్శించుకునే దర్శనమే సీగ్ర దర్శనం .  ఉచిత దర్శనంతో పోలిస్తే దర్శన సమయం చాలా తక్కువ కాబట్టి దీనిని ప్రత్యేక దర్శనం లేదా 300rs దర్శనం అని కూడా పిలుస్తారు.

నిర్ణీత సమయ స్లాట్‌లో దర్శనం యొక్క ముందస్తు బుకింగ్‌ను అందించడం దీని లక్ష్యం, ఇది రెండు గంటల్లో అవాంతరాలు లేని దర్శనాన్ని అనుమతిస్తుంది. టిటిడి అధికారిక వెబ్‌సైట్, ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ యాప్ నుండి దర్శన టిక్కెట్‌లను బుక్ చేసుకోవచ్చు.

ప్రత్యేక దర్శనం టికెట్ ధర: రూ.300

12 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు గల టికెట్ అవసరం.

12 ఏళ్ల లోపు టికెట్ అవసరం లేదు. వారికి ప్రవేశం ఉచితం.

తిరుమల రూ.300 దర్శన్ టిక్కెట్లను ఆన్‌లైన్‌లో ఇలా బుక్‌ చేసుకోవచ్చు:

మొదట టీటీడీ అధికారిక వెబ్‌సైట్ https://ttdevasthanams.ap.gov.in/ ఓపెన్ చేయాలి.

తర్వాత హోమ్ పేజీలోని స్పెషల్ ఎంట్రీ దర్శనం మీద క్లిక్ చేయాలి.

ఆన్‌లైన్ టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి మీరు మీ ఫోన్ నెంబర్ కలిగి ఉండాలి.

మీ ఫోన్ నెంబర్ ఎంట్రీ చేసి ఓకే చేయాలి.

మీ నెంబర్ కి ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ మీరు ఎంట్రీ చేయాలి.

లాగిన్ అయిన తరువాత ఈ-ఎంట్రీ దర్శన్ ఎంపికను ఎంచుకోవాలి.

తర్వాత ఎంత మంది దర్శనానికి వెళుతున్న వ్యక్తుల వివరాలను నమోదు చేయాలి. అలాగే మీకు అవసరమైతే అదనపు లడ్డూస్‌ కూడా ఎంచుకోవచ్చు.

తేదీని ఎంపిక చేసుకుని అందుబాటులో ఉన్న టైమ్‌ స్లాట్‌లను ఎంచుకోని ముందుకు కొనసాగడానికి 'కంటిన్యూ' ఎంపిక మీద క్లిక్‌ చేయాలి ఇప్పుడు యాత్రికులుగా మీతో పాటు వచ్చే ఇతర వ్యక్తుల వివరాలను నమోదు చేయాలి.

చెల్లుబాటు అయ్యే ID లను నమోదు చేయాలి.

ఇది పూర్తయిన తర్వాత పేమెంట్ ఎంపికపై క్లిక్ చేసి మీకు అనుకూలమైన మోడ్ ప్రకారం ఆన్‌లైన్‌లో డబ్బును చెల్లించాలి.

పేమెంట్స్ విజయవంతమైన తర్వాత మీరు మీ టిక్కెట్లను PDF రూపంలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Tags: Tirumala Tirupati, Special Entry Darshan, TTD Special Entry Darshan, TTD Online Ticket Booking , ttd 300 rs darshan online booking availability, ttd darshan online booking availability, ttd online booking for darshan 500 rupees ticket, tirumala darshan tickets, ttd special darshan tickets, ttd online tickets, ttd login, tirupati darshan online booking

ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FAQ'S

సెప్టెంబర్ నెల వరకు తిరుమల 300/- టికెట్స్ , సేవ టికెట్స్ , రూమ్స్ , సీనియర్ సిటిజెన్ టికెట్స్ , అంగప్రదక్షిణ టికెట్స్ అన్ని బుక్ అవ్వడం జరిగింది.
తిరుమల శ్రీవారి సేవ కూడా సెప్టెంబర్ నెల వరకు బుక్ అయ్యాయి
అక్టోబర్ నెల టికెట్స్ జులై 18వ తేదీ నుంచి విడుదల చేస్తారు. 

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.