ఈ రాశులు కలిసిన జంటల మధ్య విడతీయలేని నిజమైన ప్రేమ ఉంటుందట - Best Rashi Matching for Marriage

ఈ రాశులు కలిసిన జంటల మధ్య*

*విడతీయలేని నిజమైన*

*ప్రేమ ఉంటుందట*

హిందూ సాంప్రదాయప్రకారం పెళ్ళికి ముందు జాతకాలు చూసి, ఒకరి రాశి తో మరొకరి రాశి మ్యాచ్ అయితేనే పెళ్ళిళ్ళు చేస్తారు. వారి జాతక రీత్యా అన్ని బాగున్నాయో లేదో ఒకటికి రెండు సార్లు పరికించి చూస్తారు.

కుల గోత్రాలు, కట్న కానుకలు, ఇతరత్రా అన్నింటిలోనూ ఇరు కుటుంబాల వారికీ సమ్మతి అయినా… జాతకాలు కలవడం లేదని ఆగిపోయిన పెళ్లిళ్లు ఎన్నో.

అయితే కొన్ని రాశులు జంటలు చాలా బాగుంటాయని అంటున్నారు జ్యోతిష్య నిపుణులు. ఇంతకూ ఆయా రాశులు.

అవేమిటో కింద చూద్దాం..

తులారాశి - సింహరాశి :-

ఈ రెండు రాశులవారు అగ్ని తత్వం కలిగి ఉంటారు. ఇద్దరికీ కోపం ఎక్కువ. చాలా వరకు ఇద్దరి అలవాట్లూ, అభిరుచులు ఒకేలా ఉంటాయి. సమాజంలో పేరు పొందటం అందరినీ ఆకర్షించుకోవడం ఈ రెండు రాశుల వారికి ఎంతో ఇష్టమట. వీరిద్దరూ ఒకరికొకరు మద్దతు ఇచ్చుకుంటూ ముందుకు సాగుతారు.

మిథునరాశి – తులారాశి :-

ఈ రెండు రాశులవారికి శారీరక ఆకర్షణ ఉంటుంది. అందుకే ఒకరినొకరు వదిలి ఉండలేరట. ఎప్పుడు కలిసే ఉంటారట.

మేషరాశి - కుంబరాశి :-

ఈ రెండు రాశులవారు ఎప్పుడూ ఒకరికొకరు బోర్ కొట్టరట. ఒకరితో ఒకరు ఆనందంగా ఉంటారని జ్యోతిష్య పండితులు అంటున్నారు. అందుకే వీరి కలియిక ఎంతో సంపూర్ణంగా ఉంటుందట.

మేషరాశి – కర్కాటకరాశి :-

మేష రాశి వారి నడవడిక, వ్యక్తిత్వాన్ని కర్కాటక రాశివారు ఎంతగానో ఇష్టపడతారట. అందువల్ల ఒకరినొకరు వదిలి ఉండలేరట.

మేషరాశి - మీనరాశి :-

మీనరాశి వారు పూర్తిగా మేషరాశి వారిపై ఆధారపడే తత్వం ఉన్నవారు. అందుకే ఈ జంట పరిపూర్ణంగా ఉంటుంది.

కర్కాటక - మీనరాశి :-

ఈ రాశుల వారు శాంతంగా ఉంటారు. గొడవలు జరిగినా కూర్చుని పరిష్కరించుకుంటారు. అందుకే వీరిద్దరూ ఎప్పుడు ఆనందంగా ఉంటారు.

వృషభం - కర్కాటం :-

వీరిద్దరూ చాలా ప్రేమగా ఉంటారు. ఎంతో తెలివైన జంటగా వ్యవహరిస్తారు.

వీరి జంట పరిపూర్ణమని నిపుణుల మాట.

Tags: Rashi, Rashi Phalalu, Love, Marriage, Horoscope, Prema, Vivaham, jatakam pelli, kundali matching marriage, best kundali

Post a Comment

Previous Post Next Post
CLOSE ADS
CLOSE ADS