Drop Down Menus

స్త్రీలు గాజులు ధరించే వేళలో పాటించాల్సిన నియమాలు - ఏ రంగు గాజులు ధరిస్తే అదృష్టం | Bangles Benefits

గాజులు ధరించే విధానం

ఆడవాళ్లు గాజులు విధానంలో కొన్ని నియమాలు పాటిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. స్త్రీలు ఎల్లప్పుడూ పసుపు రంగు లేదా ఎరుపు ఆకుపచ్చ రంగులు మట్టి గాజులు ధరించాలి. బంగారు గాజులు ధరించినప్పటికీ రెండు బంగారు గాజుల మధ్య కనీసం 6 గాజులకు తక్కువ కాకుండా మట్టి గాజులు ఉండేలా చూసుకోవాలి.

కేవలం బంగారు గాజులు మాత్రమే ధరించి మట్టి గాజులు ధరించకపోతే ధనపరమైన సమస్యలు ఎదురవుతాయి. మరియు ఖర్చులు కూడా పెరుగుతాయి. నలుపు రంగు నీల రంగు గాజులు శని భగవానునికి ప్రతీక కావున ఈ రంగు గాజులు ధరించరాదు. నలుపు లేదా నీలో రంగు గాజులు ధరిస్తే పనులు ఆటంకాలు ఎదురవుతాయి. అనవసర ఖర్చులు పెరుగుతాయి.

కొత్త గాజులు ధరించాలి అనుకుంటే గురువారం నాడు మంచిది. పాత గాజులు మార్చుకోవాలి అనుకున్నప్పుడు సోమవారం లేదా బుధవారం నాడు మార్చుకోవాలి. పసుపు రంగు గాజులు గురు భగవానుడు మరియు చంద్రునికి సంకేతం పసుపు రంగు గాజులు ధరిస్తే ఏ సమయంలో ఏ నిర్ణయాలు తీసుకుంటే అనుకూలుస్తుంది అనే విషయంలో గ్రహాలు అనుకూల ఫలితాలు ఇస్తాయి.

పసుపు రంగు గాజులు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళు కంపెనీలో ఉన్నత స్థాయి ఉద్యోగంలో ఉన్నవాళ్లు ధరించడం మంచిది. ఆకుపచ్చ రంగు గాజులు బుధుడికి సంకేతం వ్యాపార రంగంలో ఉన్నవారు ధనపరమైన లావాదేవీలు జరిపేవారు ఆకుపచ్చ రంగు గాజులు ధరించడం మంచిది. చదువుకునే అమ్మాయిలు, ఉద్యోగం కోసం ప్రయత్నించేవారు పోటీ పరీక్షలు రాస్తే వారు ఎరుపు రంగు గాజులు ధరిస్తే మంచి ఫలితాలు ఇస్తాయి. సంతానం కావాలి అనుకున్న వారు బంగారు గాజులు ధరించాలి.

ఆడవాళ్లు పుట్టింటి నుండి వచ్చే సమయంలో గాజులు కొని తెచ్చుకుంటే వారికి ఆయుష్ పెరుగుతుంది.పగిలిన గాజులు ధరిస్తే అప్పులు పెరుగుతాయి. ఒకసారి ధరించిన గాజులు వేరే వాళ్ళకి ఇస్తే మానసిక సమస్యలు ఎదురవుతాయి. గుమ్మం బయట కూర్చుని కానీ లోపల కూర్చుని కానీ అనగా గడప దగ్గరలో కూర్చుని గాజులు ధరించరాదు. జుట్టు విరబోసుకుని గాజులు ధరించరాదు. గాజులు ధరించాల్సి వచ్చినప్పుడు మంగళవారం ధరించరాదు.

పూర్తిగా గాజులు తీసి కొత్తవి వేసుకోవాలనుకున్నప్పుడు చేతికి పసుపు రంగు గాని ఎరుపు రంగు గాని దారం కట్టుకుని తర్వాత గాజులు తీయాలి. గాజులు ధరించిన తర్వాత ఆ రంగు దారం తీసివేయవచ్చు. గాజులు ధరించే సమయంలో ఈ నియమాలు పాటిస్తూ ఉంటే మంచి ఫలితాలు ఉంటాయి.

Tags: Silver ladies bangles, ladies bangles gold, fancy bangles online shopping, Ladies bangles with price, Ladies bangles for wedding, bangles set for women, Gajulu, Women, Bangles

ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FAQ'S

సెప్టెంబర్ నెల వరకు తిరుమల 300/- టికెట్స్ , సేవ టికెట్స్ , రూమ్స్ , సీనియర్ సిటిజెన్ టికెట్స్ , అంగప్రదక్షిణ టికెట్స్ అన్ని బుక్ అవ్వడం జరిగింది.
తిరుమల శ్రీవారి సేవ కూడా సెప్టెంబర్ నెల వరకు బుక్ అయ్యాయి
అక్టోబర్ నెల టికెట్స్ జులై 18వ తేదీ నుంచి విడుదల చేస్తారు. 

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.