శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ప్రవచనం చేసిన సంపూర్ణ రామాయణం ఆడియో మీరు ఇప్పుడు వినవచ్చు మరియు డౌన్లోడ్ చేసుకోవచ్చు , ఇప్పటివరకు బాలకాండ అయోధ్య కాండ అరణ్యకాండ విన్నారు ఇప్పుడు కిష్కింధ కాండ వినబోతున్నారు. సంపూర్ణ రామాయణం ఆడియో లు క్రింద ఇవ్వడం జరిగింది మీరు ఒకసారి చూడండి మీకు కావాల్సినవి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
కిష్కింధ కాండ (67 సర్గలు): రాముని దుఃఖము, హనుమంతుడు రామునకు సుగ్రీవునకు స్నేహము గూర్చుట, వాలి వధ, సీతాన్వేషణ ఆరంభము
రామాయణములోని పాత్రలు, సంఘటనలు, భావములు, తత్త్వాలు అంతర్గతంగా నున్న పురాణాలు, కథలు, కావ్యాలు, పాటలు అన్ని భారతీయ భాషలలోను లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి. కాని వాల్మీకి రామాయణమే ప్రధాన ప్రమాణముగా సర్వత్రా అంగీకరింప బడుతున్నది. ఆదికవి వాల్మీకి ప్రార్థన సంప్రదాయంగా చాలామంది కవులు స్మరిస్తారు.
కూజంతమ్ రామరామేతి మధురమ్ మధురాక్షరమ్
ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలమ్
కావ్యం రామాయణం సీతాయాశ్చరితమ్ మహత్
పౌలస్త్య వధమిత్యేవ, చకార చరిత వ్రత:
రామాయణము ప్రధానముగా సీతా రాముల పుణ్యచరితము. ఆంజనేయ భక్తి భరితము. వీరిని గూర్చిన ప్రార్థనలు ఎన్నో ప్రచారములో నున్నవి. మచ్చుకు కొన్ని.
ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం.
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం.
దక్షిణే లక్ష్మణో యస్య వామేచ జనకాత్మజా
పురతో మారుతిర్యస్య తం వందే రఘు నందనమ్
గోష్పదీకృత వారాసిం మశకీకృత రాక్షసమ్
రామాయణ మహా మాలా రత్నం వందే అనిలాత్మజమ్
రామ నామము సకల పాప హరమనీ, మోక్షప్రథమనీ పలువురి నమ్మిక. రమంతే సర్వేజనాః గుణైతి ఇతి రామః (తన సద్గుణముల చేత అందరినీ సంతోషింపజేసేవాడు రాముడు) అని రామ శబ్దానికి వ్యుత్పత్తి చెప్పబడింది."రామ" నామములో పంచాక్షరీ మంత్రము "ఓం నమశ్శివాయ" నుండి 'మ' బీజాక్షరము, అష్టాక్షరీ మంత్రము "ఓం నమో నారాయణాయ" నుండి 'ర' బీజాక్షరము పొందుపరచబడియున్నవని ఆధ్యాత్మిక వేత్తల వివరణ. మూడు మార్లు "రామ" నామమును స్మరించినంతనే శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రము చేసిన ఫలము లభించునని శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రము-ఉత్తర పీఠికలో చెప్పబడింది.
Sri Chaganti Sampurna Ramayana Pravachanam KishkindaKaanda 1st Audio
Sri Chaganti Sampurna Ramayana Pravachanam KishkindaKaanda 2nd Audio
Sri Chaganti Sampurna Ramayana Pravachanam KishkindaKaanda 3rd Audio
Sri Chaganti Sampurna Ramayana Pravachanam KishkindaKaanda 4th Audio
Sri Chaganti Sampurna Ramayana Pravachanam KishkindaKaanda 5th Audio
Sri Chaganti Sampurna Ramayana Pravachanam KishkindaKaanda 6th Audio
Sri Chaganti Sampurna Ramayana Pravachanam KishkindaKaanda 7th Audio
Sri Chaganti Sampurna Ramayana Pravachanam KishkindaKaanda 8th Audio
సంపూర్ణ రామాయణం లో అన్నీ కాండలు ఇక్కడ ఇవ్వడం జరిగింది వాటిపై క్లిక్ చేస్తే అవి ఓపెన్ అవుతాయి
సుందర కాండ
యుద్ధ కాండ
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Comments
Post a Comment