సమస్యలకు సమాధానం శ్రీ వారాహి నవరాత్రి దీక్ష విధానం -Varahi Navaratri Deksha Vidhanam

అత్యంత శుభ ఫలితాలను మనో అభీష్టాలను నెరవేర్చే శ్రీ వారాహి అమ్మవారి గుప్త నవరాత్రులు.

గుప్త నవరాత్రులు: ఆషాఢ శుద్ధ పాడ్యమి నుండి ఆషాడ శుద్ధ నవమి వరకు గల సమయం ఇవి ఎక్కువగా ప్రచారంలో లేవు చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు మన సాంప్రదాయంలో ఉన్న నాలుగు నవరాత్రుల్లో అత్యంత మహిమాన్వితమైనవి శక్తివంతమైనవి శ్రేష్ఠమైనవి ఈ ఆషాడ మాస గుప్త నవరాత్రులు.

సమస్యలను సులభంగా పరిష్కరించే వరాలిచ్చే తల్లి వారాహి

ఎవరైతే ఈ నవరాత్రులు శ్రద్ధగా ఆచరిస్తారో వారి యొక్క అన్ని సమస్యలు అమ్మవారి అనుగ్రహం తో తప్పకుండా పరిష్కారం అవుతాయి.

శ్రీ వారాహి అమ్మవారి విశిష్టత: సప్త మాతృకల లో ఒక్కరు శ్రీ వారాహి పర దేవత లలితా పరమేశ్వరి సర్వ సైన్య అధ్యక్షురాలు శ్రీ వారాహి అమ్మవారు మహావిష్ణు మరో రూపం మహాలక్ష్మి ప్రతిరూపం సర్వ మంగళ స్వరూపం దుష్ట శిక్షణ శిష్ట సంరక్షణ గావించుటకు పాశమును దండమును ధరించిన దండ నాథ వారాహి అమ్మవారు

ఉగ్ర రూపంలో కనిపించే అపార కరుణామయి పరమ కృపా మయి వారాహి దేవత వారాహి ఆరాధన అందరూ చేయకూడదు అని కొన్ని అపోహల వలన అమ్మవారి ఆరాధన తక్కువ మందికి మాత్రమే తెలుసు అలాగే ఎవరికి తెలియకుండా గుప్తంగానే మిగిలిపోయాయి ఇది పూర్తిగా సత్యదూరం ప్రస్తుత కాలంలో అమ్మవారి ఆరాధన ప్రతి ఒక్కరికి అవసరం అమ్మవారి ఆరాధనతో అరిషడ్వర్గాలు  ఆధీనంలో ఉంటాయి కామ క్రోధ మద మోహ మద మాత్సర్యాల నుండి అమ్మవారు మనల్ని సంరక్షిస్తుంది మన మనసును నియంత్రిస్తుంది అమ్మవారు సమయ సమయ సంకేత ఏది ఎప్పుడు ఎలా చేయాలో ఎలా సాధించాలో తెలియజేస్తూ ఉంది అమ్మవారు సాక్షాత్ వసుంధర భూదేవి నాగలిని రోకలిని ధరించిన ధాన్య దేవత

పంటలు సరిగా పండాలన్న వ్యవసాయం అనుకూలించాలన్నా ప్రతి ఒక్క రైతు తప్పక వారాహి ఆరాధన చేయాలి శ్రీకరి శుభకరీ సర్వమంగళ కారిణి కళ్యాణ స్వరూపిణీ అమంగళం నాశిని సుమంగళి కారిని సౌభాగ్య ప్రదాయిని విశుక్ర ప్రాణ హరిని వారాహి అమ్మవారు వారాహి అమ్మవారి ఆరాధన అత్యంత శుభప్రదం సౌభాగ్య ప్రదం.

ఎటువంటి తీవ్ర సమస్యలైన అమ్మవారి ఆరాధన పరిష్కారం లభిస్తుంది అమ్మవారి ప్రీతిగా ఈ నవరాత్రులు శ్రద్ధగా నిష్ఠతో ఆచరిస్తే మన యొక్క మనో అభీష్టాలు తప్పకుండా తీరుతాయి భూమి పరమైన సమస్యలు ఉన్న భూ తగాదాలు ఉన్న కోర్టు కేసులు ఉన్న శత్రు సమస్యలు ఉన్న తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉన్నా జీవితంలో స్థిరత్వం లేకపోయినా మనకంటూ రక్షణ లేకపోయినా ఇంట్లో తరచుగా అరిష్టాలు జరుగుతున్న ఆర్థిక స్థిరత్వం లేకపోయినా ఆర్థిక ఇబ్బందులు అప్పుల బాధలు ఎక్కువైనా అమ్మవారి నవరాత్రి దీక్ష చేస్తే ఈ సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి అమ్మవారి ఆరాధనతో ఫలానా సమస్య అంటూ ఉండదు ఎటువంటి సమస్య అయినా పరిష్కారం అవుతుంది కాబట్టి మిత్రులారా మహిమాన్విత నవరాత్రి దీక్ష అందరూ చేపట్టండి దీక్ష విధానం తెలియజేస్తాను.

నవరాత్రి దీక్ష విధానం

నవరాత్రి ప్రారంభం  ముందు రోజు అనగా  మీ గృహాన్ని శుభ్రం చేసుకోండి పూజ కి కావాల్సిన ద్రవ్యాలు తెచ్చి పెట్టుకోండి.

పూజా ద్రవ్యాలు అనగా ప్రతి అమ్మవారి పూజలో ఉపయోగించే పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు నూనె సామ్రాణి

అవకాశం ఉన్నవారు మీ పూజ గదిలో ఒక పీటను పెట్టి దాని మీద ఎర్రని వస్త్రం పరిచి వారాహి అమ్మవారి చిత్ర పటం కానీ విగ్రహం కానీ ఉంటే పెట్టండి ఒకవేళ ఇవి రెండు లేకపోతే లలిత అమ్మవారి చిత్రపటం కానీ దుర్గ అమ్మవారి చిత్ర పటం కానీ విగ్రహం కానీ పెట్టండి ఇది ఒక రోజు ముందుగా సిద్ధం చేసుకుని పెట్టండి .నవరాత్రి దీక్ష ప్రారంభం అయ్యే  రోజు  ఉదయాన్నే లేచి తలస్నానం చేసి అవకాశం ఉన్నవారు దీక్ష వస్త్రాలు ధరించండి దీక్ష వస్త్రాలు ధరించడం వీలు కాని వ్యక్తులు మెడలో దీక్షగా ఒక కండువా తొమ్మిది రోజులు ధరించాలి.

ముందుగా సిద్ధం చేసుకున్న అమ్మవారి పీఠం దగ్గర దీపారాధన చేసి మీరు ఏ సంకల్పంతో నవరాత్రి దీక్ష చేస్తున్నారో ఆ సంకల్పాన్ని అమ్మవారికి మనస్ఫూర్తిగా తెలియజేయాలి పిమ్మట గణపతి ప్రార్థన చేసి పూజ ప్రారంభించాలి అవకాశం ఉన్నవారు అమ్మవారి విగ్రహానికి అభిషేకం చేయండి అభిషేకం అనునది తప్పనిసరికాదు అమ్మవారికి  స్త్రీ మూర్తులు ఎర్రటి చీర ఎర్రని గాజులు 9రోజులు పీఠం దగ్గర ఉంచండి అవకాశం ఉన్న మహిళలు ఆచరించండి వారాహి అష్టోత్తర నామాలు కానీ సహస్రనామాలు కానీ మీకు లభ్యమైతే వీటిని పఠిస్తూ అమ్మవారి ముందు కుంకుమార్చన చేయండి ఎర్రటి పుష్పాలతో అమ్మవారిని అర్చించండి దానిమ్మ గింజలను అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి ఈ తొమ్మిది రోజులు పాదరక్షలు ధరించకూడదు మాంసానికి మద్యానికి దూరంగా ఉండండి బ్రహ్మచర్యం పాటించండి మంచం మీద పడుకోవద్దు నేల పైన చాప వేసి పడుకోండి.

ఈ తొమ్మిది రోజులు ఉదయం మరియు రాత్రి రెండు పూటలా స్నానం చేసి అమ్మవారికి దీపం ధూపం నైవేద్యం పెట్టాలి.

వారాహి అమ్మవారి సంబంధిత స్తోత్ర పఠనం ఈ తొమ్మిది రోజులు విశేషంగా చేయాలి.

ఇది ఆచరించడం కొంతమందికి ఇబ్బందికరంగా అయినప్పటికీ అమ్మవారి అనుగ్రహం పొందడానికి సులభ పరిష్కార మార్గం ఇది.

ఇది ఆచరించడం సాధ్యం కాని వారికి సులభంగా నవరాత్రి దీక్ష చేసే విధానం.

దీక్ష వస్త్రాలు లేకున్నా ఇబ్బంది లేదు కానీ మెడలో దీక్ష కండువా తొమ్మిది రోజులు ధరించాలి పీఠం పెట్టి అమ్మవారిని పూజించడం ఇబ్బందికరంగా ఉంటే మీ పూజ గదిలో అమ్మవారి చిత్రపటానికి ఉదయం సాయంత్రం రెండు పూటలా స్నానం చేసి దీపారాధన చేసి పూలు పండ్లు నైవేద్యంగా పెడితే సరిపోతుంది తొమ్మిది రోజులు చెప్పులు వేసుకో కూడదు మద్యానికి మాంసానికి దూరంగా ఉండాలి బ్రహ్మచర్యం పాటించాలి నేలమీద పడుకోవాలి స్తోత్ర పారాయణం చేయడం కుంకుమార్చన చేయడం ఇబ్బందికరంగా ఉన్న వ్యక్తులు వారాహి అమ్మవారి ద్వాదశనామాలు ఉదయం సాయంత్రం చదివితే సరిపోతుంది అత్యంత సులభంగా మీ వృత్తులు చేసుకుంటూ అమ్మవారి నవరాత్రి దీక్ష చేసే విధానాన్ని సులభంగా మీకు తెలియజేశాను అవకాశం ఉన్నవారు అమ్మ వారి దీక్ష చేయండి సకలశుభాలు అష్ట ఐశ్వర్యాలు సర్వ సుఖాలు పొందండి.

అమ్మవారి పీఠం ముందు సమర్పించే చీర గాజులు అనారోగ్య వ్యక్తులను ఆరోగ్యవంతులుగా చేస్తుంది కల్యాణం కానీ స్త్రీలకు శీఘ్రంగా కళ్యాణాన్ని చేస్తుంది సంతానానికి దూరంగా ఉన్న వ్యక్తులకు సంతానాన్ని సౌభాగ్యాన్ని ఏర్పరుస్తుంది.

అమ్మవారి ముందు చేసే కుంకుమార్చన ఆ యొక్క కుంకుమ ఎంతో మహిమాన్వితమైనది ఈ కుంకుమను భద్రంగా దాచుకోండి ప్రతిరోజు ఈ కుంకుమను ధరించడం వల్ల జయము విజయము వెంటే ఉంటాయి.

అవకాశం ఉన్నవారు తొమ్మిది రోజులు అమ్మవారి ముందు అఖండ దీపారాధన చేయండి ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్నటువంటి వాస్తు దోషాలు విపరీత ప్రభావాలు తొలగిపోతాయి.

దీక్ష చేయడం సాధ్యం కాని వ్యక్తులు కనీసం తొమ్మిది రోజులు చెప్పులు వేసుకోకుండా ఉండండి.

ఈ తొమ్మిది రోజులు అమ్మవారి ముందు పీచు తీయని కొబ్బరికాయ ఉంచండి నవరాత్రి దీక్ష పూర్తయిన తర్వాత ఈ పీచు తీయని కొబ్బరికాయను మీ ఇంట్లో లేదా వ్యాపార కార్యాలయంలో ఒక ఎర్రని బట్టలో కట్టి ఉంచండి తొమ్మిది రోజులు అమ్మవారి పూజలో కొబ్బరికాయ ఉండటంవల్ల శక్తివంతంగా మారుతుంది.

అవకాశం ఉన్నవారు అమ్మ వారి ముందు ఈ తొమ్మిది రోజులు కొన్ని రక్షా కంకణాలు పెట్టుకోండి నవరాత్రి దీక్ష అయిన తర్వాత ఈ రక్ష కంకణాలు చేతికి కట్టుకోండి.

ఈ తొమ్మిది రోజుల్లో మెడలో ధరించే కండువాను భద్రంగా ఉంచుకోండి ఏవైనా ముఖ్యమైన పనుల మీద బయటకు వెళ్లినప్పుడు లేదా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పుడు ఈ కండువాను ధరిస్తే మంచి శుభ ఫలితాలు వస్తాయి.

నవరాత్రి ముగింపు:  ఉదయం అమ్మవారికి నైవేద్యం మంగళహారతి ఒక కొబ్బరికాయను కొట్టి దీక్షను ముగించాలి కండువా తీసి పక్కకు పెట్టాలి మనం ఏ సమస్యతో ఇబ్బంది పడుతున్నాము ఆ సమస్యను అమ్మవారికి చెప్పి ఆ సమస్యకు పరిష్కార మార్గం ఇవ్వమని అమ్మవారిని వేడుకోవాలి.

వారాహి అమ్మవారి ఆరాధన అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది దీంట్లో ఎటువంటి సందేహం లేదు భక్తి శ్రద్ధలతో అమ్మవారి నవరాత్రి దీక్ష ఆచరించండి మీ కుటుంబ సభ్యులతో మిత్రులతో స్నేహితులతో ఆచరింపజేయండి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి చేర వేయండి ఈ పోస్ట్ ను ఎక్కువమంది షేర్ చేసే ప్రయత్నం చేయండి.

పోస్టులో పెట్టిన అమ్మవారి ద్వాదశ నామాలు ఉదయం సాయంత్రం చదివే ప్రయత్నం చేయండి.

జయ జయ వారాహి జయ విజయ వారాహి మహా వారాహి లఘు వారాహి స్వప్న వారాహి కిరాత వారాహి ధూమ్ర వారాహి.

Tags: Varahi Navaratrulu, Varahi, Gupta Navaratrulu, Ashada Navaratrulu, Devi Navaratrulu, Varahi Mantram, Varahi Pooja Telugu, Varahi 9Days Pooja, Navaratri Deksha Vidhanam

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS