ఓం నమో వేంకటేశాయ హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం. తిరుమల శ్రీవారి సేవకులకు శుభవార్త సేవ టికెట్స్ విడుదల. శ్రీవారి సేవ అనగా వారం రోజుల శ్రీవారి సేవ ప్రస్తుతం ఆన్ లైన్ లో విడుదల చేస్తున్న విషయం తెలిసినదే.
సెప్టెంబరు 27న శ్రీవారి సేవ కోటా విడుదల
డిసెంబర్-2024 నెలలో తిరుమల మరియు తిరుపతికి జనరల్ శ్రీవారి సేవ కోటా ఉదయం 11 గంటలకు,
నవనీత సేవ మధ్యాహ్నం 12 గంటలకు,
పరకామణి సేవ మధ్యాహ్నం 1 గంటకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు.
శ్రీవారి సేవ గురించి తరచుగా అడిగే కొన్ని ప్రశ్నలు వాటికి సమాధానాలు ఇప్పుడు చూద్దాం.
శ్రీవారి సేవ సింగల్ గా బుక్ చేసుకోవచ్చా ?
సింగిల్ గా చేసుకోవచ్చు
శ్రీవారి ఇద్దరు లేదా ముగ్గురు బుక్ చేసుకోవచ్చా ?
ఆ విధంగా చేసుకోవడానికి లేదు, ఇద్దరు లేదా ముగ్గురు ఉన్నప్పుడు ఎవరి మొబైల్ లో వారు చేసుకుని , కొండపైన రిపోర్టింగ్ చేసే సమయం లో అందరూ ఒకేసారి వెళ్తే ఒకే చోట డ్యూటీ వేసే అవకాశం ఉంది.
తిరుపతి లో బుక్ చేసాము మాకు కొండపైన డ్యూటీ వేస్తారా ?
మనం బుక్ చేసుకునే సమయం లో తిరుమల , తిరుపతి అనగా కొండక్రింద బుక్ చేస్తే మీరు 3 రోజులు కొండ క్రింద 4 రోజులు కొండపైన డ్యూటీ వేస్తారు.
మేము ఆన్ లైన్ లో బుక్ చేసిన వారిలో ఇద్దరు రావడం లేదు వారికి బదులు వేరేవారిని తీసుకుని వెళ్లవచ్చా ?
ఆలా తీసుకుని వెళ్ళడానికి వీలులేదు.
శ్రీవారి సేవ బుకింగ్ వెబ్సైటు ఏది ?
https://srivariseva.tirumala.org/
keywords :
tirumala srivari seva updates, srivari seva, tirumala, seva tickets