తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ కీలక నిర్ణయాలు | Tirumala Latest Updates Brahmotsavam

tirumala brahmotsavalu
కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని టిటిడి అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి అధికారులను ఆదేశించారు.

నూతనంగా 8 ప్రధమ చికిత్స కేంద్రాలు 

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4 నుండి 12వ తేదీ వరకు జరగనున్న నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా టీటీడీ వైద్య విభాగం ఆధ్వర్యంలో నూతనంగా 8 ప్రధమ చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.

అక్టోబర్ 3వ తేదీ సాయంత్రం అంకురార్పణతో

తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబర్ 4 నుండి 12వ తేదీ వరకు నవహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. అక్టోబర్ 3వ తేదీ సాయంత్రం అంకురార్పణతో ఈ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి.

దర్శనాలు రద్దు

అక్టోబరు 3 (అంకురార్పణం) నుండి 12వ తేదీ (చక్రస్నానం) వరకు ప్రతి రోజు వయో వృద్దులు, దివ్యాంగులు, సం|| లోపు చిన్న పిల్లల తల్లిదండ్రులకు టిటిడి రద్దు చేసింది. విఐపి బ్రేక్‌ దర్శనాలను ప్రోటోకాల్‌ ప్రముఖులకు మాత్రమే టిటిడి పరిమితం చేసింది. భక్తులు ఈ విషయాన్ని గమనించి టిటిడికి సహకరించాలని కోరుతున్నది.

సేవల వివరాలు

బ్రహ్మోత్సవాల్లో ప్రతి రోజు ఉదయం 8 నుండి 10 గంటల వరకు మరియు సాయంత్రం 7 గంటల నుండి 9 గంటల వాహన సేవలు ఉంటాయి.

వాహన సేవల వివరాలు :

04/10/2024 – సాయంత్రం 05:45 నుండి 6 గంటల వరకు ధ్వజారోహణం, రాత్రి 9 గంటలకు పెద్ద శేష వాహనం.

05/10/2024 – ఉదయం 8 గంటలకు చిన్న శేష వాహనం, మధ్యాహ్నం 1 నుండి 3 గంటల వరకు స్నపనం, రాత్రి 7 గంటలకు హంస వాహనం.

06/10/2024 – ఉదయం 8 గంటలకు సింహ వాహనం, మధ్యాహ్నం 1 గంటకు స్నపనం, రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరి వాహనం,

07/10/2024 -ఉదయం 8 గంటలకు కల్పవృక్షం వాహనం,

మధ్యాహ్నం 1 గంటకు స్నపనం, రాత్రి 7 గంటలకు సర్వ భూపాల వాహనం,

08/10/2024 – ఉదయం 8 గంటలకు మోహినీ అవతారం, సాయంత్రం 6:30 నుండి రాత్రి 11:30 గంటల వరకు గరుడ వాహనం

09/10/2024 ఉదయం 8 గంటలకు హనుమంత వాహనం, సాయంత్రం 4 గంటలకు స్వర్ణ రథం, రాత్రి 7 గంటలకు గజ వాహనం,

10/10/2024 ఉదయం 8 గంటలకు సూర్యప్రభ వాహనం,

రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనం,

11/10/2024 ఉదయం 7 గంటలకు రథోత్సవం, రాత్రి 7 గంటలకు అశ్వ వాహనం,

12/10/2024- ఉదయం 6 నుండి 9 వరకు చక్రస్నానం, రాత్రి 8:30 నుండి 10:30 వరకు ద్వాజావరోహణం.

దాతలకు గదుల కేటాయింపు రద్దు :

శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో అక్టోబ‌రు 4 నుండి 12వ తేదీ వరకు భక్తుల సౌకర్యార్థం టిటిడిలోని వివిధ‌ ట్రస్టులకు, ప‌థ‌కాల‌కు విరాళాలు అందించిన దాతలకు కేటాయించే గదులను టిటిడి రద్దు చేసింది. అదేవిధంగా అక్టోబరు 4న ధ్వజారోహణం, అక్టోబర్ 12న చక్రస్నానం జరిగే రోజుల్లో మినహా మిగతా రోజులలో దాతలను దర్శనానికి అనుమతిస్తారు.

keywords : tirumala updates, tirumala brahmotsavam updates, ttd news, tirumala information.

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS