Sri Kukkuteswara Swamy Temple Pithapuram Kakinada District.
తూర్పు గోదావరి జిల్లాలో ప్రసిద్ధ క్షేత్రాలలో ( ప్రస్తుతం కాకినాడ జిల్లా ) పిఠాపురం లో పాదగయ క్షేత్రం మొకటి. ఈ క్షేత్రం అతి పురాతనమైనది. ఈ క్షేత్రం సామర్లకోట , మరియు కాకినాడ కు సుమారు గా 15 కి మీ దూరం లో కలదు. ఈ క్షేత్రం త్రి గయా క్షేత్రాలలో పాద గయా క్షేత్రంగా , అష్టాదశ శక్తి పీఠాలలో 10వ శక్తి పీఠంగా , పరమ శివుడు కుక్కుటం అనగా కోడి రూపాయం లో గల శివలింగం గా , దత్తాత్రేయుడు స్వయంభుగా వెలసిన గొప్ప క్షేత్రం. భక్తులు ఈ క్షేత్రాన్ని దర్శించి తరిస్తున్నారు. పాదగయ లో పిండప్రదానాలు చేయడం విశేషం. కాశీ క్షేత్రానికి దగ్గరలో గల గయా క్షేత్రం ఉంది కదా ఆ గయాసురుడి యొక్క పాదాలు పడిన ప్రదేశమే ఈ పాద గయా క్షేత్రం . ఆలయ స్థల పురాణాలు ఇప్పుడు తెలుసుకుందాం రండి.
శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయ చరిత్ర
సంక్షిప్త పీఠికాపురక్షేత్ర మహాత్యము
స్కాందపురాణము - భీమఖండము - 3వ అధ్యాయము
శ్లో॥ అధవింధ్యాచలోపార్తే త్రిలింగోత్కల దేవశయో |
సంధౌసమీపే శ్రీ భీమమండలస్య పురోత్తమమ్ ॥
నవ ఖండాన్వితాఖండ క్షోణీ మండల మండనమ్ ।
నానా సమృద్ధి సంపన్నం విఖ్యాతం క్షేత్రముత్తమమ్ ॥
కేదార కుమ్భ కోణాది పుణ్యక్షేత్ర సమంమహత్ ।
పిఠాపురం మునివరో నిజ శిష్యైస్సహావిశత్ ॥
శ్రీ వేదవ్యాసమహర్షి - దక్షిణ భారత దేశ యాత్ర చేయుచూ పిఠాపురము శిష్య సమేతముగా వచ్చి ఈ క్షేత్రమును గూర్చి అష్టాదశ పురాణములలో ఒకటైన స్కాందపురాణము భీమఖండము నందు మూడవ అధ్యాయమున ఈ విధముగా వ్రాసియున్నారు. వింధ్య చర్విత ప్రాంతమున ఒరిస్సా ఆంధ్ర రాష్ట్రముల మధ్య భాగమునందు భీమమండలమునందు గల ఈ క్షేత్రము ఉత్తర భారత దేశమున గల కేదారము దక్షిణభారత దేశమున గల కుంభకోణము సమానమైనది ఈ దివ్య క్షేత్రము అని వర్ణించినారు. పిఠాపురము పాదగయా క్షేత్రముగా ప్రసిద్ధి చెందినది.
పాదగయా క్షేత్రమహాత్య్సము
గయాసురుడను దానవేంద్రుడు కలడు. ఆయన చేసి సత్రియుల పూర్వకాలమున కృతయుగమందు పరమ భాగవతోత్తముడై వలన ఇంద్రాధిపత్యము కల్గినది. ఆ దానవేంద్రునిచే మూడు లోకములు పరిపాలింప బడుచుండెను. పదవిని కోల్పోయిన ఇంద్రుడు మరల తన పదవిని పొందుట కొరకు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను ప్రార్థించెను.
ఇంద్రుని కోరికపై బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు బ్రాహ్మణ వేషము ధరించి గయాసురుని వద్దకు వెళ్ళిరి. గయాసురుడు వారిని సత్కరించి వారు వచ్చిన కార్యము తెలుపమని కోరెను.
త్రిమూర్తులు మేము ఒక యజ్ఞము చేయ తలపెట్టినాము నీవు యజ్ఞ వేదికగా దివ్యస్థలము ఈయవలెను అని కోరిరి. గయాసురుడు యజ్ఞ వేదికగా తన శరీరమును సమర్పించెను. గయాసురుని దేహముపై త్రిమూర్తులు యజ్ఞము చేసిరి. యజ్ఞము ఒక కోడికూత జామునన ప్రారంభించబడెను. యజ్ఞము భగ్నము చేయుటకై ఇంద్రుని కోరికపై శివుడు కోడి రూపము ధరించి నిర్ణీత " సమయమునకు ముందుగానే కుక్కుట ధ్వని చేసెను. ఆ కోడి ' కూతవిని గయాసురుడు యజ్ఞము పూర్తి అయినది అనుకొని తన శరీరము కదిలించెను. యజ్ఞభంగము కావించినందుకు గయాసురుని సంహరించెదమని త్రిమూర్తులు పల్కిరి. గయాసురుడు అందుకు అంగీకరించెను. మరణసమయమందు నీ ఆఖరు కోర్కె "ఏమి అని త్రిమూర్తులు అడిగిరి. అందుకు గయాసురుడు ఈ విధముగా పల్కెను. తన శరీరభాగములలో ముఖ్యమైన మూడు భాగములు మూడు దివ్యక్షేత్రములుగా విరాజిల్లునట్లు అందు శిరస్సు యందు విష్ణువు - నాభియందు బ్రహ్మ - పాదముల యందు కోడి రూపమును ధరించిన శివుడు ఉండునట్లు త్రిమూర్తులు అనుగ్రహించిరి. ఈ మూడు క్షేత్రములలో ఎవరైన తమ పితరును ఉద్దేశించి చేయు పిండ ప్రదాన - తర్పణముల వలన వారి పితరులు నూరు తరములు వారు తరించునట్లు త్రిమూర్తులు వరమును అనుగ్రహించిరి. పిఠాపురము త్రిగయలలో మూడవ గయ పాదగయా క్షేత్రముగా ప్రఖ్యాతి గాంచినది.
1) శిరోగయ - గయ - బీహార్
2) నాభిగయ - జాజిపూర్ రైల్వే జంక్షన్ సమీపము - ఒరిస్సా
3) పాదగయ - పిఠాపురం తూర్పుగోదావరి జిల్లా ఆంధ్ర
పిఠాపురము - శివక్షేత్రము
గయాసుర సింహారార్ధము శివుడు స్వయంభుగా కోడి రూపముగా వెలసిన దివ్య లింగమూర్తి శ్రీ కుక్కుటేశ్వర స్వామి భక్తుల పాలిట కల్ప తరువు.
పిఠాపురము గయా క్షేత్రము
త్రిమూర్తులు గయాసురుడిని సంహరించగా అతని యొక్క పాదములు ఈ క్షేత్రమునందు (పుష్కరిణిలో) పడ్డ కారణంగా "పాదగయ" గా ప్రసిద్ధి గాంచినది. ఈ క్షేత్రం అతి ప్రాచీనమైన దివ్యక్షేత్రం. శంకరుడు స్వయంభూ శ్రీ కుక్కుటేశ్వరుడిగా కొలువై ఉండగా, శ్రీ పురుహూతికా అమ్మవారు అష్టాదశ పీఠములలో 10వ శక్తి పీఠముగా కొలువై ఉన్నారు. ఈ క్షేత్రమునందలి శ్రీ దత్తాత్రేయ స్వామివారు త్రిముఖ విగ్రహ రూపంలో స్వయంభూమూర్తిగా వెలసియున్నారు.
బీహార్ నందలి గయలో గయాసురుని శిరస్సు పడినందున "శిరోగయ"గా ప్రసిద్ధి చెందినది. ఇక్కడ మాంగల్యగౌరి శక్తిపీఠం కలదు. జాజ్పూర్ వద్ద గయాసురుని యొక్క నాభి భాగం పడినందున 'నాభిగయ' గా ప్రసిద్ధి చెందినది. ఈ క్షేత్రంలో బ్రహ్మదేవుడు కొలువై ఉండగా గిరిజాదేవి శక్తి పీఠము కలదు. ఈ విధముగా పైన తెలిపిన మూడు క్షేత్రాలు. త్రిగయా క్షేత్రములుగా ప్రసిద్ధిగాంచి త్రిమూర్తులు, శక్తి రూపంలో అమ్మవారు కొలువైయున్నారు. ఈ క్షేత్రం విశిష్టతను వాయు పురాణము నందలి గయా మహత్యంలోను, స్కాంద పురాణము నందలి భీమ ఖండములోను తెలుపడమైనది.
కేదార కుంభకోణాది పుణ్యక్షేత్ర సమం మహత్!
పిఠాపురం మునివరో నిజశిష్యైస్సవహావిశత్!!
స్కాంధపురాణం (ఉత్తర భారతంలో కేదారం, దక్షిణాన కుంభకోణంలతో సమానమైన క్షేత్రం పిఠాపురం శ్రీ కుక్కుటేశ్వర స్వామిని గూర్చి వ్యాసమహార్షి ఈ క్రింది విధముగా వర్ణించియున్నారు.
"అధాభజతమౌనీతో దేవేశం భకత్వత్సలమ్ ॥
విశ్వాత్మమకం మహాభాగం శాశ్వతం కుక్కుటేశ్వరమ్ ||
దేవదేవుడైన శంకరుడు సర్వ ప్రపంచమును తనయందు కలవాడు, మహానుభావుడు అయిన స్వామిని నేను స్వయంగా సేవించుచున్నాను.
పిఠాపురము దత్త క్షేత్రము
శ్రీ దత్తాత్రేయ స్వామి సుమతీ రాజశర్మ పుణ్య దంపతులకు శ్రీ పాద శ్రీ వల్లభులుగా పాదగయా క్షేత్రములో జన్మించి స్వయంభుగా వెలసియున్నారు. (గురు చరిత్ర 5వ అధ్యాయము)
దత్తక్షేత్రములు
(1) పిఠాపురం - పాదగయా క్షేత్రము - శ్రీ పాద శ్రీ వల్లభస్వామి
(2) కరంజా - నృసింహసరస్వతీ జన్మస్థానము.
(3) సహ్యాద్రి - (మారచారఘడ్) దత్తాత్రేయ జన్మస్థానము.
దత్తాత్రేయ మూలస్థానము పాదగయా క్షేత్రము, భారతదేశములో గల దత్తపుణ్య క్షేత్రములలో ఈ క్షేత్రములో మాత్రమే స్వామి విగ్రహరూపములో నున్న స్వయంభు మూర్తి.
పిఠాపురము - శక్తి క్షేత్రము :
దక్ష యజ్ఞమందు తనువు చాలించిన సతీదేవి యొక్క మృత కళేబరము శ్రీ మహావిష్ణు యొక్క సుదర్శన చక్రముచే ఖండితమై 18 భాగములుగా విభజించబడి ధరణీతలముపై పడగా అందు ప్రధానమైన పీఠ భాగము ఈ క్షేత్రము నందు పడి దివ్య క్షేత్రము పిఠాపురముగా ప్రఖ్యాతి గాంచినది.
అష్టాదశ శక్తి పీఠములు
| 1) శ్రీలంక - శాంకరీదేవి 2) కంచి - కామాక్షీదేవి 3) ప్రద్యుమ్నం- ( శృంఖలాదేవి 4) మైసూరు - చాముండాదేవి 5) అలంపూర్ - జోగులాంబ 6) శ్రీ శైలం - భ్రమరాంబాదేవి 7) కొల్హాపూర్- మహాలక్ష్మీదేవి 8) మహూర్ - ఏకవీర దేవి 9) ఉజ్జయినీ - మహాకాళీదేవి 10) పిఠాపురం పురుహూతికాదేవి 11) జాజిపూర్ - గిరిజాదేవి 12) ద్రాక్షారామం మాణిక్యాంబాదేవి, 13) హరిద్వార్ -మానసాదేవి 14) అలహాబాద్ - మాధవేశ్వరి దేవి. (15) జ్వాల వైష్ణవి దేవి 16) గయ - మాంగల్యగౌరి 17) కాశీ -విశాలక్ష్మి 18) కాశ్మీర్ - సరస్వతీ దేవి.
ఈ క్షేత్రము అష్టాదశ శక్తి పీఠములలో పదవ పీఠము. దేవీ మూలస్థానము.
శ్రీ పురుహూతికా అమ్మవారు (10వ శక్తి పీఠం)
అష్టాదశ శక్తి పీఠములలో 10వ శక్తిపీఠమైన శ్రీ పురుహూతికా శక్తిపీఠం. దక్షయజ్ఞంనందు ప్రాణాలు విడిచిన సతీదేవి మృతదేహాన్ని శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో ఖండించగా 18 ముఖ్యాతి ముఖ్యమైన అవయవ భాగాలు పడిన ప్రదేశాలు నేడు అష్టాదశ శక్తి పీఠములుగా వర్ధిల్లుతున్నాయి. వాటిలో పీఠభాగము పడినందున అమ్మవారు ఈ క్షేత్రములో పీఠాంబిక అమ్మవారుగా వెలసినారు. పురుహుతుడు (ఇంద్రుడు) సేవించినందున అమ్మవారు శ్రీ పురుహూతికాదేవిగా ఇక్కడ పిలవబడుతున్నారు.
"హాటకపాన పాత్రయు నాగరబండి నమాతులుగమున్ !
ఖేటములోహ దండము నొగిన్ ధరియించి పురోపకంఠ!
శృంగట భూమి భాగమున కాపురముండెడి పీఠాంబకున్!
కైటభవైరి దైత్య ప్రియకాంతకు నమస్కరించేనాతండు భక్తితోన్॥ - భీమఖండం
పిఠాపురం వాసిని శ్రీ పురుహూతికా దేవి ఎడమ క్రింది చేతి యందు బంగారు పానపాత్రను, కుడిక్రింది చేతియందు 'మాధిపలము, ఎడమ చేతియందు డోలు, కుడిచేతి యందు లోహదండము ధరించి శ్రీ చక్రపీఠముపై నుండి భక్తకోటికి సకల సౌభాగ్య సమస్త సంపదలను, ఆయురారోగ్యాలను, ప్రసాదించు| భక్తుల పాలిట కల్పవల్లి అని పైన తెలిపిన భీమఖండమునందలి శ్లోకంలో శ్రీనాధ కవి సార్వభౌముడు అమ్మవారిని వర్ణించినారు.
అదేవిధంగా శ్రీ గురుదత్తాత్రేయ స్వామివారు శ్రీపాద శ్రీ వల్లభునిగా ఈ క్షేత్రమునందు జన్మించినందున మరియు ఈశ్వరుడు కుక్కుటేశ్వర స్వామిగా స్వయంభుగా వెలిసినందున ఈ క్షేత్రములో వ్రతముగాని, పూజగాని, దానముగాని చేసిన యెడల కోటిరెట్లు ఫలితము వచ్చునని పురాణముల ద్వారా తెలియుచున్నది.
పరమ పవిత్రమైన ఈ క్షేత్రములో శరన్నవరాత్రి మహోత్సవములు అత్యంత వైభవంగా జరుపబడును. ఈ రోజులలో శ్రీ రాజరాజేశ్వరి మరియు శ్రీ పురుహూతిక అమ్మవార్లకు కుంకుమార్చనలు. ఈ నవరాత్రి ఉత్సవములలో జరుగు పూజా కార్యక్రమములలో పాల్గొన్న భక్తులు నవగ్రహ దోషనివారణ, ఆరోగ్య సౌభాగ్యములు, విద్యా ఉద్యోగ వ్యాపార విజయములు శ్రీ అమ్మవారి కృపా కటాక్షములతో పొందుదురు.
ఆలయ సమయాలు :
ఉదయం : 5- 12:30
సాయంత్రం : 4:30 - 8:30
దేవస్థానంలో జరుగు కార్యక్రమముల యొక్క పూజా రుసుముల
వివరములు (టిక్కెట్లు)
1. ప్రత్యేక దర్శనం 20/-
2. మహాన్యాస పూర్వక అభిషేకం 70/-
3. కుంకుమార్చన 50/-
4. హోమం 150/-
5. ఏకాదశ రుద్రాభిషేకం 150/-
6. మాలాధారణ 20/-
7. లక్ష పత్రి పూజ 500/-
8. లక్ష కుంకుమార్చన 500/-
9. బారసాల 558/-
10. జపం 200/-
11. ఉపనయనం 1116/-
12. వీడియో షూటింగ్ 558/-
13. పిండ ప్రధానం 100/-
14. తైలాభిషేకం 70/-
15. చండీ హోమం (గోత్రనామములు) 200/-
17. గోపూజ
16. చండీ హోమం (పౌర్ణమి రోజు)
పూజలు చేయించుకునే వారు కౌంటర్ నందు తగు టిక్కెట్ తీసుకుని బ్రాహ్మణులను వారే ఏర్పాటు చేసుకొని వారికి సంభావన వారే ఇచ్చుకొనవలయును.
శాశ్వత పూజా పథకముల వివరములు
1. శాశ్వత పూజా పధకములు సం॥లో భక్తులు కోరిన ఒక రోజున శ్రీ కుక్కుటేశ్వరస్వామి / శ్రీ దత్తాత్రేయ స్వామివారికి అభిషేకం రూ. 500-00.
2. శ్రీ రాజరాజేశ్వరి / శ్రీ పురుహూతికా అమ్మవారికి కుంకుమార్చన రూ. 500-00.
3. శాశ్వత పిండప్రదానము స్కీము రూ. 6,000-00 పైబడి, దానిపై వచ్చిన వడ్డీతో మీరు కోరిన తిథి / తారీఖున పిండప్రదానము
జరుపబడును. (కాలపరిమితి 10 సం||లు)
4. ప్రతి పౌర్ణమికి శ్రీ పురుహూతికా అమ్మవారికి చండీ హోమం జరుగును. స్వయముగా పాల్గొను వారికి రుసము రూ.1116/- పాల్గొనలేని వారికి గోత్రనామములలో చేయించుకొనువారికి రూ. 200/- లు
5. ప్రతీ పౌర్ణమికి రాత్రి శ్రీ స్వామి, అమ్మవార్లకు శాంతి కళ్యాణము జరుగును. రుసుము రూ.558/- లు
6. గోసేవలో భాగముగా గ్రాసము కొరకు విరాళములు యిచ్చువారు స్వయంగా గాని ఆన్లైన్ ద్వారా ఇవ్వవచ్చును.
7. భక్తులు కోరిన రోజున స్వయంగా పాల్గొనలేని వారు అభిషేకమునకు రూ. 150/-, కుంకుమార్చనకు రూ. 100/-లు చెల్లించినయెడల మీ గోత్ర నామములతో పూజలు జరుపబడును.
పైన తెలిపిన పూజాకార్యక్రమములకు ఈ క్రింది బ్యాంక్ అకౌంట్ ఉపయోగించుకొనగలరు.
i.O.B.
Online A/c. No 055401000001702
IFSC-IOBA 0000554
S.B.I. Online
A/c. No. 36568056495
IFSC-SBIN 0001003
శాశ్వత అన్నదాన పథకము :
నిత్య అన్నదాన పథకానికి ఇచ్చు విరాళములకు ఆదాయ పన్నుపై సెక్షన్ 80జి. క్రింద మినమాయింపు కలదు. సామాన్య భక్తులను కూడా అన్నదాన కార్యక్రమం లో భాగస్వామ్యులను చేయుటకు గాను 11 మందికి అన్నదానం చేయుటకు 550/- రూపాయలుగా నిర్ణయించడమైనది. అన్నదాన కార్యక్రమం లో పాల్గొను భక్తులు సంప్రదించాల్సిన నెంబర్ 9346703345
అన్నదానం ఆన్ లైన్ అకౌంట్ వివరాలు :
IOB A/c No. 0554010000015079
IFSC-IOBA 0000554
SBI A/c. No.11003309978
IFSC-SBIN 0001003
వసతి సౌకర్యం
దేవస్థానము నందు యాత్రీకుల కొరకు వసతి సౌకర్యం కలదు.
A/c Rs. 999/- Non A/c. Rs. 600/- డార్మెటరీ A/c. లాకర్ రూ. 100/-
శ్రీ కుక్కుటేశ్వర స్వామి వారి దేవస్థాన పాదగయ క్షేత్రం - పిఠాపురం దేవస్థాన ప్రాంగణంలో దర్శనము చేసుకోను విధానము
గయాసురుడు మరియు విష్ణుపాదములు
శ్రీ చింతామణి గణపతి వారు
స్వయంభూ శ్రీ దత్తాత్రేయ స్వామి వారు
శ్రీ సీతారామాంజనేయ స్వామి వారు
శ్రీ ఆదిశంకరాచార్యులు వారు.
శ్రీ అయ్యప్ప స్వామి వారు
శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారు
శ్రీ అన్నపూర్ణమ్మ అమ్మవారు
శ్రీ నవగ్రహములు
శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి
శ్రీ నాగేంద్ర స్వామి
శ్రీ కనక దుర్గమ్మ వారు
అష్టాదశ శక్తి పీఠాలలో 10వ శక్తి పీఠం శ్రీ పురుహూతికా అమ్మవారు
శ్రీ కుక్కుటేశ్వర స్వామి వారు
క్షేత్ర పాలకుడు శ్రీ కాలభైరవ స్వామివారు
ప్రస్తుతం పాదగయ క్షేత్రం ఈఓ గా శ్రీ కాట్నం జగన్ మోహన్ శ్రీనివాస్ గారు భాద్యతలు నిర్వహిస్తున్నారు.
ఆలయ చిరునామా :
కార్యనిర్వాహణాధికారి
శ్రీ కుక్కుటేశ్వర స్వామి వారి
దేవస్థానం
దేవదాయ ధర్మాదాయ శాఖ, పాదగయా క్షేత్రం,
పిఠాపురం - 533450, తూ॥ గో॥ జిల్లా,
పిఠాపురం దగ్గర్లో ఇతర క్షేత్రాలు :
Hindu Temples Guide : 7382679767