తిరుపతి, 2026, ఫిబ్రవరి 07: టిటిడి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 15వ తేదీన మహాశివరాత్రి సందర్భంగా తిరుపతిలోని మహతి కళాక్షేత్రం, కపిలతీర్థం, అన్నమాచార్య కళామందిరం, రామచంద్ర పుష్కరిణిలలో మహాశివరాత్రి ఆధ్యాత్మిక వైభవమ్ ను సాయంత్రం 06 గం.ల నుండి అర్థరాత్రి 12 గం.ల వరకు నిర్విరామంగా ఆధ్యాత్మిక, సాంస్కృతిక, ధార్మిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా హెచ్ డి పి పి, ఎస్వీ సంగీత నృత్య కళాశాల, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు జరుగనున్నాయి.
పూర్వ కాలంలో మహాశివరాత్రి సందర్భంగా సనాతన హిందూ ధర్మ సంప్రదాయంలో భాగంగా భక్తులు ఆలయాలకు చేరుకుని రాత్రంతా భజనలు, హరికథలు తదితర భక్తి కార్యక్రమాలతో జాగరణ చేసేవారు. ప్రస్తుతం అదే పందాలో భక్తులను సంప్రదాయ పద్దతిలో భక్తి మార్గం వైపు నడిపించేందుకు తిరుపతిలోని సదరు కేంద్రాలలో భక్తి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. భక్తులందరూ విచ్చేసి పరమ శివుని అనుగ్రహం పొందాలని కోరడమైనది. లింగోద్భవ సమయానంతరం భక్తాదులకందరికి ప్రసాద వితరణ చేయనున్నారు.
తిరుపతి మహతి క్షేత్రంలో ఎం. సరళ బృందంచే శివస్తోత్ర పారాయణం, జి. ప్రభాకర్ శర్మచే పురాణ ప్రవచనం, సి. హరనాథ్ నేతృత్వంలో మోహినీ భస్మాసుర నృత్య రూపకం, జయంతి సావిత్రి ఆధ్వర్యంలో భక్త శిరియాళ హరికథ, సంప్రదాయ పాఠశాల విద్యార్థినులు ఆద్వర్యంలో శివ భజనామృతం చేపడుతారు.
కపిలతీర్థంలో వి. ప్రసన్న లక్ష్మీ బృందంచే శివస్తోత్ర పారాయణం, శ్రీ ఆముదాల మురళి ఆధ్వర్యంలో పురాణ ప్రవచనం, సి. హెచ్. జగదీష్ ఆద్వర్యంలో లింగోద్భవ వైభవం నృత్య రూపకం, శ్రీ వై. వేంకటేశ్వర్లుచే సతీ తులసి హరికథ, సంప్రదాయ పాఠశాల విద్యార్థినులు ఆధ్వర్యంలో శివ భజనామృతం చేపట్టనున్నారు.
అన్నమాచార్య కళామందిరంలో జి. ఇందిరారాణి బృందంచే శివస్తోత్ర పారాయణం, వి. నిర్మలా బాయ్ చే పురాణ ప్రవచనం, సి.హెచ్. అజయ్ కుమార్ బృందంచే పార్వతి పరిణయం నృత్య రూపకం, జె. కృష్ణ కుమారి చే పార్వతి పరిణయం హరికథ, సంప్రదాయ పాఠశాల విద్యార్థినులుచే శివ భజనామృతం కార్యక్రమాలను చేపడుతారు.
రామచంద్ర పుష్కరిణిలో జె. రాజకుమారి బృందంచే శివస్తోత్ర పోరాయణం, కె. నారాయణ రావు చే పురాణ ప్రవచనం, సి. సాయి కిషోరి బోస్ ఆధ్వర్యంలో శివ లీలలు నృత్య రూపకం, ఎం. రాముడు ఆధ్వర్యంలో భక్త కన్నప్ప హరికథ, సంప్రదాయ పాఠశాల విద్యార్థినులచే శివ భజనామృతం నిర్వహిస్తారు.
టిటిడి ప్రధాన ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
keywords :- Tirumala update tirumala update mahashivaratri special tirumala news tirumala mahashivaratri special tirumala update
