ఫిబ్రవరి 8న ధ్వజారోహణం
తిరుపతి, 2026 ఫిబ్రవరి 05: తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఫిబ్రవరి 7న సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 8 నుండి మార్చి 17వ తేదీ వరకు ఆలయంలో బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి.
అంకురార్పణం సందర్భంగా సాయంత్రం 4.30 నుండి 6.30 గంటల వరకు మూషిక వాహనంపై శ్రీ వినాయకస్వామివారు పురవీధుల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఆ తరువాత సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంటల వరకు శాస్త్రోక్తంగా అంకురార్పణం నిర్వహిస్తారు.
ఫిబ్రవరి 8న ధ్వజారోహణం :
ఫిబ్రవరి 8న ఉదయం 6.05 గంటలకు మకర లగ్నంలో ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. అనంతరం ఉదయం 7 నుంచి 9 గంటల వరకు పల్లకీ ఉత్సవం, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు హంస వాహన సేవ జరుగనున్నాయి.
ఈ సందర్భంగా ప్రతి రోజు ఉదయం 7 నుండి 9 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు పురవీధుల్లో వాహన సేవలు నిర్వహిస్తారు.
టిటిడి ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
keywords :- tirumala update tirumala update sri kapileswara swamy brahmotsavam tirumala news sri kapileswara swamy brahmotsavam tiruma update
