టిటిడి గోశాలలో ఇటీవల గోవులు మృతి చెందాయంటూ కొద్దిమంది సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం వాస్తవం కాదు.
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయానికి ఏడున్నర మైళ్ల దూరంలో వెలసివున్న శ్రీ తుంబురు తీర్థ ముక్కోటి ఉత్సవం ఏప్రిల్ 12న జరుగనుంది.
మార్చి 24 నుండి అమలులోకి తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై శ్రీవారి దర్శనం
బ్రేక్ దర్శనం : సోమవారం , మంగళవారం
300 టికెట్స్ : బుధవారం , గురువారం
నోట్ : బ్రేక్ దర్శనాలకు ఒక రోజు ముందు JEO ఆఫీస్ లో ఇవ్వాలి, 300 టికెట్స్ కు అదే రోజు ఇస్తే సరిపోతుంది.
ఆదివారం ఆంధ్ర ప్రజా ప్రతినిధుల నుండి స్వీకరిస్తున్న సిఫార్సు లేఖలు ఇకపై శనివారం నాడు (ఆదివారం దర్శనం కొరకు) స్వీకరించబడతాయి.
సర్వదర్శనం టికెట్స్ ప్రస్తుతం రాత్రి 9 గంటల నుంచి శ్రీనివాసం , విష్ణు నివాసం వద్ద ఇస్తున్నారు.
అలిపిరి మెట్ల మార్గం లో వెళ్లేవారికి భూదేవి కాంప్లెక్స్ లో టికెట్స్ ఇస్తున్నారు.
శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లేవారికి శ్రీవారి మెట్టు దగ్గరే 6 AM నుంచి టికెట్స్ ఇస్తున్నారు.
జూన్ నెలకు శ్రీవారి సేవ ఏప్రిల్ నెలలో విడుదల చేస్తారు, ఎప్పడు విడుదల చేసేది ఇంకా తెలియలేదు.
తిరుమల సర్వ దర్శనం, శ్రీవాణి టికెట్స్ యొక్క లైవ్ స్టేటస్ తెలుసుకోవడానికి 9552300009 నెంబర్ కు వాట్స్ యాప్ లో మెసేజ్ చేయాలి.
తిరుమల వయో వృద్ధులు ( 65 సంవత్సరాలు నిండి ఉండాలి ) , వికలాంగుల దర్శనాలు ప్రస్తుతం ఆన్ లైన్ టికెట్ బుకింగ్ ద్వారా మాత్రమే జరుగుతున్నాయి.
కొండపైన అంగ ప్రదక్షిణ టికెట్స్ ఇవ్వడం లేదు ఆన్ లైన్ ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలి.
శ్రీవాణి టికెట్స్ కొండపైన జీవో ఆఫీస్ దగ్గర మరియు తిరుపతి విమానాశ్రయం దగ్గర ఇస్తున్నారు.
ప్రస్తుతం APSRTC ద్వారా దర్శనం టికెట్స్ ఇవ్వడం లేదు.
12 సంవత్సరాల లోపు పిల్లలకు ఎటువంటి టికెట్స్ తీయనవసరం లేదు.
1 సంవత్సరం లోపు పిల్లలకు మాత్రమే సుపథం దర్శనం ఉంటుంది. పిల్లలతో పాటు తల్లి దండ్రులకు మాత్రమే దర్శనం ఇస్తారు. ప్రతి రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి 6 గంటల వరకు టికెట్ లేకుండా నేరుగా వెళ్ళవచ్చు. ఆధార్ కార్డు లు తీసుకుని వెళ్ళాలి .
తిరుమల సమాచారం వాట్స్ యాప్ లో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి ..
Ok. Bro
ReplyDeleteధన్యవాదములు బాగుంది మీ ప్రచారం
ReplyDeleteతెలంగాణ MLA లు మంత్రులు పంపిన300₹సిఫారసు లేఖలు ఇంకను accept cheyatledu.. అంట నిజమేనా సార్...!?
ReplyDelete