Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

Varanasi Local Temples Guide | Kashi Temple Information in Telugu | Varanasi Tour Planing Phone Numbers

Varanasi Local Temples Information in Telugu


మనం కాశిలో అడుగుపెట్టిన తరువాత ముందుగా ఒక రూం కావాలి :) నేను ఇంతకముందే ఒక పోస్ట్ చేశాను . క్రింద ఆ లింక్ కూడా ఇస్తాను మీరు చూడండి . రూమ్స్ కోసం ఇబ్బంది పడనావసరం లేదు . 
hindu temples guide varanasi


వారణాసి లో ఆశ్రమాలు సత్రాలు మఠాలు హోటల్స్ నెంబర్ ల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. 

వారణాసిలో తమిళనాడు లో ఉన్నట్టు ఆకాశాన్ని తాకేలా గోపురాలు ఉండవు .ఆది భిక్షువు అని కాబోలు ఆయనే చిన్న గుడిలో ఉన్నాడు . తంజావూరు లో ఉన్నట్టు పెద్ద శివలింగము ఉండదు ఇక్కడ . మనం గుడిలోపలకి అడుగుపెడుతున్నాం అనగా సెక్యురిటి వారు చెక్ చేసి లోపాలకి పంపుతూ ఉండగానే మన గుండెలు బరువైతాయి . ఎప్పుడు ఎరుగని ఆఅనుభూతి ఎవరికీ చెప్పలేము .. కాళ్ళు వనుకుతున్నాట్టు .. కళ్ళు రెండు ఎక్కడ నా స్వామి ఎక్కడ నిజామా నేనే నా విశ్వనాధున్ని చూస్తున్నానా అని కళ్ళు వెతుకుతుంటే  .. నిజమే ఇది నిజమే . స్వామి దగ్గరకు వెళ్లి మనం ఆశ్చర్యకంగా కళ్ళు రెండు పెద్దవి చేస్తూ చూస్తూ ... మనం తెచ్చుకున్న పాలను గంగను స్వామి వారికి అభిషేకం చేస్తుంటే .. స్వామి ఇక చాలు ఈ జన్మకి ఇక చాలు . ఇంతకన్నా నాకేమి కావాలి . నీ దర్శనం చెయ్యగలిగాను .. నేను చెయ్యడం ఏమిటి ఆ భాగ్యం కలిగించావు అనుకుంటూ స్వామి దర్శనం చేస్కుంటూ బయటకొచ్చకా ..

పార్వతి అమ్మవారు కాశి అన్నపూర్ణ దేవి దర్శనం ఇస్తారు . ఐతే కాశి విశాలాక్షి అమ్మవారికి, అన్నపూర్ణాదేవికి  వేరేగా గుళ్ళూన్నాయి . అన్నపూర్ణాదేవి కి వేరుగా స్వామి వారి ఆలయం కంటే ముందుగా ఆలయం ఉంది ( గేట్ ఒకటి నుంచి వచ్చేవాళ్ళకి ) , అవును స్వామి వారి దర్శనానికి 4 గేట్లు ( దారులు ) ఉంటాయి . మొదటి సారి వెళ్ళేవారు ఎన్నో నెంబర్ గెట్ దగ్గర నుంచి వచ్చారో గుర్తుపెట్టుకోండి . నిజానికి స్వామి వారి ఆలయ ప్రవేశానికి టికెట్స్ ఏమి లేవు . మనం దర్శనానికి లైన్ లో నిలబడతాం కదా .. 
అక్కడ వీధులు చాల ఇరుకైనవి ముగ్గురు పక్కపక్కన నిలబడితే మరో మనిషి వెళ్ళడానికి దారి ఉండదు . ఆలయం లోపాలకి చెప్పులు , కొబ్బరికాయలు , పెన్నులు , సెల్ ఫోన్ లు , కెమెరాలు తీస్కుని వెళ్ళనివ్వరు. దర్శనానికి లైన్ లో నిలబడి ఉండగా ..పక్కనున్న షాప్ ల వాళ్ళు మీ సామాన్లు మా దగ్గర ఫ్రీ గా బద్రపరుచుకోండి అని సామన్లకు ఫ్రీ కాని మీ చేతిలో ఒక స్వీట్ బాక్స్, పాలు, రెండు దండలు పెట్టి వేల్లమంటారు .. నాకొద్దు అంటే మీ సామాన్లు తీస్కుని వెళ్ళమని చెప్తారు .. ఇంతకీ మీ చేతిలో పెట్టిన వాటి ఖరీదు 170/- . హా అంతే . సరే అని తీస్కుని వెళ్ళాలి తక్కువలో ఇవ్వమంటే ఓ 70 - 90 /- మద్యలో చేతిలో పెడతారు .సామాన్లు భద్రంగానే ఉంటాయి .. లేకపోయినా మన గోడు పట్టించుకునే వాడే ఉండడు . 

ఇక్కడ కూడా దర్శనానికి చాల పెద్ద లైన్ ఉంది నాతో రండి 20 నిమిషాల్లో దర్శనం చేయిస్తాను 150 ఒక్కో తలకి అని బేరమడేవాళ్ళు ఉంటారు . అదేమిటో దేవాలయం లోపల కూడా వ్యాపారాలు చేస్తున్నారు అక్కడ ( పాలు , పువ్వులు అమ్మడం ) మనకి కొత్తగా కనిపిస్తాయి . ఇవన్ని ఎందుకు చెప్తున్నాను అంటే .. మీకు అన్ని తెలియాలి గనుక .. ఇవన్ని అందరు రాయరుగా .
దర్శనాలతో పాటు హారతి టికెట్స్ ఆన్ లైన్ లో బుక్ చేసుకోవచ్చు . ప్రధానం గా నాలుగురకాల హారతులు ఉంటాయి. 
> తెల్లవారు జామున ఇచ్చే మంగళ హారతి :
ఈ హారతి ప్రతి రోజు 3-4 మధ్యలో ఇస్తారు. టికెట్ తీసుకున్న వారిని ఆలయం లోకి 2:30-3 మధ్యలో పంపిస్తారు. టికెట్ ధర 500/-. 
> మధ్యాహ్నం ఇచ్చే భోగ హారతి :
ఈ హారతి ప్రతి రోజు ఉంటుంది. 11:15 AM -12:20 మధ్యలో ఇస్తారు టికెట్ తీసుకున్న వారు 10:45 కు లైన్ లో ఉండాలి. టికెట్ ధర 300/-. 
> సప్తఋషి హారతి :
ఈ హారతి ప్రతి రోజు 7-8:15 మధ్యలో ఇస్తారు. టికెట్ తీసుకున్నవారు 6:30 కు లైన్ లో ఉండాలి. టికెట్ ధర 300/-. 
> శృంగార హారతి 
ఈ హారతి ప్రతి రోజు 9 -10 మధ్యలో ఇస్తారు. టికెట్ తీసుకున్నవారు 8:30 కు లైన్ లో ఉండాలి. టికెట్ ధర 300. 
>> 12 సంవత్సరాల లోపు వారికి టికెట్ అవసరం లేదు. 
తిరుమలలో 300/- స్పెషల్ దర్శనం ల ఇక్కడ కూడా ఉన్నాయి ఆన్ లైన్ లో బుక్ చేసుకోవాలి. పర్వదినాల్లో తప్పించి మిగిలిన రోజుల్లో దర్శనం 3 గంటల లోపే అవుతుంది. 
టికెట్ బుకింగ్ వెబ్సైటు : https://shrikashivishwanath.org/
కాశి లో నడిచి వెళ్లి చూడవలసినవి : 
విశ్వనాధ గుడి , అన్నపూర్ణ దేవి గుడి ,విశాలాక్షి అమ్మవారి గుడి, కోటి లింగం ( జంగంవాడి ),సాక్షి వినాయక, దండపాణి గుడి, కేదారేశ్వర గుడి, హరిశ్చంద్ర ఘాట్ ,దశాశ్వమేద ఘాట్ , మణికర్ణిక ఘాట్ 
అక్కడ తెలుగు తెల్సిన బ్రాహ్మణులు ఉన్నారు. మాక్కూడా ఒక తెలుగు బ్రాహ్మణుడు మమల్ని పలకరించారు..  అప్పుడు మేము అన్నపూర్ణాదేవి ఆలయం లో ఉన్నాం. మీకు చుట్టుప్రక్కల దేవాలయాలు చూపిస్తాం ఒక్కొక్కరికి 50/- అవుతుంది అన్నారు. మేము సరే అన్నాం.. "ఇంతకుముందే తెల్సిన పెద్దలు చెప్పారు అక్కడ మిమ్మల్ని ధానం చెయ్యండనో.. మీ పేరున పూజలు చేస్తాం అనో .. లేదా రెండు నాణేలు ఇచ్చి ఇంటికి తీస్కుని వెళ్లండనో డబ్బులు కాజేస్తారు అని జాగ్రత్తలు చెప్పారు. "
మేము ఆ బ్రాహ్మణుని అనుసరించాం ఆయన ఒక్కోక్క ఆలయానికి తీస్కుని వెళ్తున్నారు.. అవన్నీ పక్కపక్కనే ఉన్నాయి... ఆయన మాతో పాటు వచ్చి ప్రతిచోటా ఆయా దేవుళ్లకు సంబందించిన మంత్రాలు చెప్పించారు. నిజానికి ఆయన లేకపోతే దగ్గరే ఉన్న అన్ని చూడకపోదుమేమో. ఇంతక ముందు పెద్దాయన చెప్పినట్టు ఈయన కూడా మమ్మల్ని పైన చెప్పిన విధంగా ప్రతిదేవాలయం లోను అది తీస్కోండి.. ఇది తీస్కోండి అంటూనే ఉండేవారు. మాకు అన్ని దేవాలయాలు చూపించి కాశి అన్నపూర్ణాదేవి సత్రం దగ్గర వదిలిపెట్టడంతో అన్నపూర్ణ దేవి సత్రం లో భోజనం చేయగలిగాము.. నిజంగా అన్నపూర్ణాదేవి వడ్డిస్తున్నట్టు అక్కడివారు చాలాబాగా వడ్డించారు. మీరు తప్పకుండా అన్నపూర్ణాదేవి సత్రం లో భోజనం చెయ్యండి. 
మీరు కొత్తగా వెళ్తే కనుక పై జాగ్రత్తలు పాటించండి. 

కాశి లో  వాహనాలు పై వెళ్లి చూడవలసినవి : 
సంకట మోచన్ హనుమాన్ గుడి, తులసీ మానస గుడి, దుర్గ గుడి , గవ్వలమ్మ గుడి ,సారనాధ,వ్యాస కాశీ, కాలభైరవ మందిరం, బిర్లమందిరం. 
మీరు దిగిన రూమ్స్ దగ్గర్లోనే లోకల్ టెంపుల్స్ చూపించడానికి ట్రావెల్స్ వాళ్ళు ఉంటారు. వారిని సంప్రదించి లోకల్ టెంపుల్స్ చూసిరండి. 
అసలైన విషయం కాశి లో ఇప్పుడు ప్రత్యేకంగా స్పర్శదర్శనం సమయం పెట్టారు తెల్లవారు జామున 3 గంటలకు ఆలయం దగ్గర ఉండండి . 3-4 వరకు స్పర్శ దర్శనం ఉంటుంది అదేవిధంగా సాయంత్రం కూడా ఉంటుంది. 
కాస్త దూరంగా ఉన్న ప్రసిద్ధ ఆలయాలకోసం రాసిఉన్నాను. మీరు ఆ పోస్ట్ కూడా చదివితే కాశి లో ఎన్నిరోజులుండాలి అనే దానిపై మీకు అవగాహన వస్తుంది. ఆ వివరాలకు ఇక్కడ క్లిక్ చెయ్యండి. 
Place to See by Walk:
1.Kashi Visweswara Temple 2.Kashi Visalakshi Temple 3. Kashi Annapurna Temple 4. Sakshi Ganapathi Temple 5. Doondi Ganapati Temple 6. Jangambadi Temple 7. Kedareswara Temple 8. Tilabhandeswara Temple 9. Varahini Temple
Kashi Viswanadha Temple 

Places to see by Vehicle Varanasi :
1. Kaala Bhairav Temple 2. Saranth ( Budh Temple ) 3. Vyasa Kashi ( Kashiraju Kota ) 4. Birla Temple 5. Santaka Vimochana Hanuman Temple 6. Tulasi Manasa Mandir 7. Durga Devi Temple 8. Gavalamma Temple


varanasi tour information in telugu, kashi information, kasi information in telugu, kasi local temple details, kashi inforamtion , 

Comments

  1. MANCHI VISHAYALU CHEPPARU, KOTTAGA VELLEVARIKI CHAALA OOPAYOGAM!

    ReplyDelete
  2. గొప్ప సైటు. ఇంతకాలం ఇది నా దృష్టిలో ఎందుకు పడలేదో ఆశ్చర్యంగా ఉంది. మొన్న కాశీకి వెళ్లే ముందు ఈ సైటును చూసి ఉంటే బాగుండేది. అభినందనలు.

    ReplyDelete
  3. Nice post!!!
    GANGA harathi chaala baagu untundi!!!

    ReplyDelete
  4. sit bagundi kani modatisari velley varikosham video post cheste baguntundi miru chepparu telugu bramanulu miku akkadi gudlu anni chupincharu ani ayana ekkada untaru ella kalusukovali chepandi ninu kashi velthunnanu cheppagalaru

    ReplyDelete
  5. చాలా బాగా వివరించారు..

    ReplyDelete
  6. can we visit kasi in march? please advise.

    ReplyDelete
  7. చాలా ఉపయోగకరమైనది ఈ సైట్

    ReplyDelete
  8. జాగ్రత్తల గురించి వ్రాసింది అక్షరాల నిజం. దోచుకుంటారు. ఇదేమి అని అడిగితే మీకు సపోర్ట్ చేసేవారు ఎవ్వరు ఉండరు. నేను చాలా సార్లు వెళ్లాను. మనమే స్వయంగా దర్శించుకుంటే మంచిది. గైడ్స్ జోలికి వెల్లద్దు.

    ReplyDelete
  9. Very interesting, good job and thanks for sharing such a good article. keep it up!

    For more details, Please visit our site: http://mandirmandir.com/

    ReplyDelete
  10. Jyotirling/Shakti Peeth/Nepal
    Yatra Package available
    Call/whatsapp 9198595775

    ReplyDelete

Post a Comment