Today Tirumala Darshan Information:

1) 300 Rupess Darshan Tickets for Month of December will be availble for Booking 11-11-2022 Morning 10 am **డిసెంబ‌రు నెల‌కు సంబంధించిన‌ రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను న‌వంబ‌రు 11న ఉద‌యం 10 గంట‌ల‌కు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.** తిరుమలలో అంగ ప్రదక్షిణ , వృద్దల వికలాంగుల దర్శన టికెట్స్ ఇప్పుడు ఆన్లైన్ లో మాత్రమే ఇస్తున్నారు **. అంగ ప్రదక్షిణ నవంబర్ నెలకు టికెట్స్ అన్ని బుక్ అయ్యాయి డిసెంబర్ నెలకు నవంబర్ 20వ తేదీ తరువాత విడుదల చేస్తారు .** వృద్దల టికెట్స్ నవంబర్ నెలకు అక్టోబర్ 26వ తేదీన విడుదల చేశారు.  *** కళ్యాణం టికెట్స్ ఏ ఇద్దరైనా బుక్ చేస్కోవచ్చు దంపతులే కాకుండా   ఇద్దరు మగవాళ్ళు , ఇద్దరు ఆడవాళ్లు కూడా బుక్ చేస్కోవచ్చు . *** 12 సంవత్సరాల లోపు పిల్లలకు అన్ని సేవలకు టికెట్ లేకుండానే తీస్కుని వెళ్ళవచ్చు age proof కోసం  ఆధార్ కార్డు చూపించాలి

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . ***అరుణాచలంలో కార్తీక మహా దీపం డిసెంబర్ 6న గురువారం సాయంత్రం 4 గంటలకు వెలిగిస్తారు.**చార్ ధామ్ యాత్ర 2022 సమాచారం : అక్టోబర్ 26న గంగోత్రి , 27న కేదార్నాథ్ మరియు గంగోత్రి ఆలయాలు మూసివేస్తారు . చివరిగా బద్రీనాథ్ ఆలయాన్ని నవంబర్ 19న మూసివేస్తారు మరల 6 నెలల తరువాత అక్షయ తృతీయ నాడు చార్ ధామ్ యాత్ర ప్రారంభం అవుతుంది. ** కాణిపాకం ఆలయ నిర్మాణం పూర్తీ అయింది దర్శనాలు జరుగుతున్నాయి.** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు . ** అరుణాచలంలో కార్తీక దీపోత్సవం 10 రోజులు జరుగుతుంది నవంబర్ 27వ తేదీ నుంచి డిసెంబర్ 6వ వరకు. మహాదీపం డిసెంబర్ 6న పెడతారు** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారు శివరాత్రి నాడు భక్తుల రద్దీ అధికంగా ఉండటం వలన ఆ రోజు చెయ్యరు. రాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

Meaning of Kalow Venkatanayaka

కలియుగం లో వెలసిల్లిన కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి, ఆయనకు వున్న పేర్లు ఎన్నో అందులో మనకు తెలియంది "కలౌ వెంకటనాయకా" అంటే అర్థమేమిటి?
నాలుగు యుగాల్లో కలియుగంలో పాపాలు ఎక్కువగా వుంటాయి. ఎందుకంటే ధర్మం ఒక్క పాదంతో నడుస్తుంటుంది. కలిపురుషుని ప్రభావంతో అనేక చిత్ర విచిత్రమైన సంఘటనలు సంభవిస్తుంటాయి. మానవులు ధర్మబాటలో నడవకుండా అధర్మప్రచారానికి ప్రభావితమవుతారు. కలియుగంలో మనకు అండగా వుండేందుకు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఏడుకొండలపై శ్రీ వేంకటేశ్వరస్వామిగా అవతరించారు. స్వామిని స్మరిస్తేనే పాపాల నుంచి విముక్తి కలిగిస్తాడు. కలియుగ ప్రత్యక్షదైవంగా వుంటూ భక్తుల పాపాలను తొలగిస్తున్న స్వామిని ‘కలౌ వేంకటనాయకా’ అని పిలుస్తారు.

‘సర్వపాపాని వేం ప్రాహుః కట స్తద్దాహ ఉచ్యతే ’ భవిష్యత్‌పురాణంలో ఇలా పేర్కొన్నారు. అన్ని పాపాలను ‘వేం’ అని అంటారు. కట అంటే తొలగించడం. వేంకట అంటే మన పాపాలను దహించేవాడు. అందుకనే ఆ నారాయణుడిని కలౌ వేంకటనాయకా అని భక్తితో కొలుస్తాము. ‘‘ శ్రీవైకుంఠ విరక్తాయ స్వామిపుష్కరిణీ తటే, రమయా రమమాణాయ వేంకటేశాయ మంగళమ్‌’’ఈ మంగళశాసనం వైకుంఠనాథుడైన శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో కలిసి భూమండలంలోని తిరునగరిలోని పుష్కరిణిలో విహరించడానికి విచ్చేశారని వెల్లడిస్తోంది. తన భక్తులను స్వయంగా పరిరక్షించేందుకే స్వామివారు వైకుంఠం నుంచి వచ్చి ఆదివ‌రాహ‌ స్వామి వద్ద అనుమతి పొంది నివాసముంటున్నారు. శ్రీ వేంకటేశ్వరస్వామి స్వయంగా వెలిశారు కనుకనే ఈ తిరుక్షేత్రం లక్షలాది భక్తుల రాకతో దివ్యారామంగా విరాజిల్లుతోంది.

Related Postings:

> Tirumala Near By Famous Temples List

> Tirumala Complete Information in Telugu

> History Of Tirumala Srivari Laddu

> Tirumala Surrounding Temples Details

> How To Perform Thulabaram at Tirumala Venkateswara swamy

> Tirumala Alipiri Steps Information

> Kapila Theertham Tirumala Information

> Tirumala Angapradikshana Details

Tirumala Information in telugu, Tirumala history in telugu, tirumala, tirumala angapradakshana details, tirumala timings. tirumala online, tirumala travel information, tirumala surrounding temples list, hindu temples guide.

Comments

Popular Posts