Tirumala Alipiri Steps Information | Tirumala Information In Telugu


1. Alipiristeps   2. Sreevari Mettu.
అందరం ఒకసారి గోవిందా గోవిందా అంటూ మొదలు పెడదాం. తిరుమల కొండ మెట్లు ఎక్కుతూ, గోవిందా నామం చెప్తూ .. మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకుంటూ... మనకన్నా వయస్సులో పెద్దవారు కర్ర చేత్తో పట్టుకుని గోవిందా అని మనల్ని దాటుకుని వెళ్తుంటే.. ఇంకా కొంచెం సేపు కూర్చుందాం అనుకున్న మనం వయస్సులో పెద్దవారు.. సామాన్లు కౌంటర్ లో పెట్టాలని తెలియక రెండు మూడేసి బాగ్ లు పైగా చిన్నపిల్లలను భుజాన వేస్కుని గోవిందా నామం చెప్తూ వారు ఎక్కుతుంటే మనం కూడా, వారితో గోవిందా అంటూ నడక మొదలు పెడతాం. ఇవి అందరికి ఉన్న అనుభవాలే. 

మనం ఇప్పుడు తిరుపతి రైల్వే స్టేషన్ లో ఉన్నాం.. మీరు బస్ స్టాండ్ లో ఉన్న ఎం పర్వాలేదు. అలిరిపి మార్గం ద్వారా మనం ఇప్పుడు తిరుమల చేరుకోబోతున్నాం. అలిపిరితో పాటు శ్రీవారి మెట్టు అనే మార్గం కూడా ఉంది. తరువాతి పోస్ట్ లో శ్రీవారి మెట్టు కోసం చూద్దాం. 
how to reach alipiri ?
తిరుమల అంటే కొండపైన అని అర్ధం, కొండ క్రింద తిరుపతి అని పిలుస్తాం. రైల్వే స్టేషన్ నుంచి మనకు ఉచిత శ్రీవారి బస్ లు ఉంటాయి. మీకు ఆలస్యం అవుతుంది అనుకుంటే  లోకల్ బస్ లు కూడా ఉన్నాయి. సరే ఏదోకటి ఎక్కి బయలు దేరుదాం. :)
Tirumala Alipiri Steps Entrance


మనం అలిపిరి దగ్గరకు చేరుకున్నాం. ఈ ఫోటో లో కనిపిస్తుంది చూసారా ? way to foot path అని .. ఆగండి ఆగండి దిగిన వెంటనే మీరు కొండపైకి నడుస్తాం అంటే ఎలా ? నేను ఉన్నానుగా :)
ముందుగా మీరు మీ దగ్గర ఉన్న బాగ్ లను పక్కనే ఉన్న లగ్గేజ్ రూం లో ఇచ్చేయండి. మీరు తీస్కుని వచ్చిన బాగ్ లకు తాళాలు ఉండాలి అప్పుడే వారు తీసుకుంటారు. తాళాలు లేవు ఇప్పుడు ఎలా అనేగా.. ఇప్పటికే మీ దగ్గరకు తాళాలు అమ్మేవాళ్ళు వచ్చే ఉండాలె. 

విలువైన వాటిని బాగ్ లలో పెట్టి ఇవ్వకండి. నిజానికి బంగారం లాంటివి తీర్ధ యాత్రలకు తీస్కుని వెళ్ళకండి. మన మనస్సు ఎప్పుడు దొంగలు ఉన్నారు.. నీ వంటి మీద బంగారం ఉంది.. జాగ్రత్త అని చెబుతూనే ఉంటుంది. మనం దేవుడి దగ్గర మనస్సు పెడదాం అంటే ఎక్కడ నిలుస్తుంది. 
రండి నడక మొదలు పెట్టండి. గోవిందా నామం చెప్తూ..
Srivari Padala Mandapam

ముందుగా మనకు శ్రీవారి పాదాల మండపం కనిపిస్తుంది. ఇక్కడ స్వామి వారి పాదుకలను  భక్తులు తమ శిరస్సు పై పెట్టుకుని ప్రదిక్షణం చేసి స్వామివారికి నమస్కారం చేస్తున్నారు.
Narayanadri

మనకు దశ అవతారాలు కొండపైకి వెళ్ళేలోపు దర్శనం ఇస్తుంటాయి. మీరు ఒక్కో అవతారానికి నమస్కరిస్తూ ముందుకు సాగండి. అలవాటు లేని నడక కాబట్టి కొద్దీ దూరం నడవగానే కాళ్ళు నొప్పి పుడతాయి. మీరు మాత్రం కూర్చోకండి. నెమ్మదిగా గోవిందా నామం చెప్తూ ఒక గంట పాటు మెట్లు ఎక్కే ప్రయత్నం చేయండి. అలిపిరి మార్గం లో మనకు మెట్లే కాదు.. రోడ్డు కూడా మధ్య మధ్యలో వస్తుంది. మనకు తినుబండారాలకు ఏ లోటు ఉండదు. సాధ్యమైనంతవరకు కూల్ డ్రింక్స్ తీసుకోకండి. మెమోలు వాటర్ తీస్కోండి. సరే రండి .. మధ్య మధ్యలో మళ్ళీ చెప్పుకుందాం. 
Thalayeru Gundu
This is the first large rook seen on the foot path to Tirumala. It is called Thalayeru Gundu . 

తలయేరు గుండు. తిరుమల వెళ్లే మెట్లదారి లో కనిపించే మొదటి పెద్ద గుండు ఇది. దీనిని తలయేరు గుండు అని అంగారు. ఇక్కడ అంజలి ఘటిస్తున్న ఆంజనేయ స్వామివారిని చూడవచ్చు. కాళ్ళ నొప్పులు కలిగిన బకెట్లు ఈ బండకు కాళ్ళను ఆనిస్తే నొప్పి పోతుందని విశ్వసిస్తారు.


Kurmaavataram కూర్మావతారం

Varaha Avataram
వరాహావతారం
Sri Vamanavataram

శ్రీ వామనావతారం
Galigouram  at alipiri steps
మనం గాలిగోపురం వరకు వచ్చేశాం .. ఇక్కడే బయోమెట్రిక్ ద్వారా మనకు టోకిన్ ఇస్తారు. మీరు తీస్కోకుండా వెళ్ళిపోతే మీకు నడిచి వచ్చినందుకు ప్రత్యేకంగా ఉన్న  దర్శనం లైన్ లో మిమ్మల్ని రానివ్వరు. 
Divyadarsan Token Counter , Alipiri


 దివ్యదర్శనం టోకెన్ కౌంటర్ లైన్ లో వెళ్లి నిలబడండి.  

మీకు ఈ విధంగా టోకెన్ ఇస్తారు. జాగ్రత్తగా పెట్టుకోండి. 

Take a Break :)
కాసేపు విశ్రాంతి తీస్కోండి. చెప్పాను కదా  మీకు అన్ని మెట్లే ఉండవని.

Sri Parasurama Avataram

శ్రీ పరశురామావతారం
  Anjanadri

వృషభాద్రి - అంజనాద్రి
మొదట్లో చెప్పాను కదా .. అర్ధం అయింది అనుకుంటా ..


2300 మెట్ల వరకు మనం చేరుకున్నాం .. గోవిందా గోవిందా 
Ramavaataram
శ్రీ రామావతారం

Balarama Avataram

శ్రీ బలరామావతారం


Park


జింకల పార్క్ .. కాసేపు బ్రేక్ .. జింకలను పలకరించి బయలుదేరుదాం

Sri Krishanavaram శ్రీ కృష్ణావతారం

ఈ విధంగా పెడితే సొంత ఇంటి కల.. నిజమవుతుంది అని అక్కడ పెద్దాయన చెప్పారు.

6 km .. 
ఇక్కడ నుంచి తిరుమల కు 6 కిమీ దూరం ..

Kalki Avataram

కల్కి అవతారం ..
  Anjanadri


ఆంజనాద్రిపైన ఆంజనేయుడు ..
 Sri Dasa Anjaneya Swamy Temple

శ్రీ దాస ఆంజనేయ స్వామి ఆలయం

Sri Lakshmi Narasihma Swamy Temple
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ..  

Govinda .. Govindaa
మోకాళ్ళ పర్వతం .. 
ఇక్కడ చాలామంది మోకాళ్ళ పర్వతం దగ్గర మోకాళ్ళతో ఎక్కడం .. మరికొంత మంది 11 మెట్లు .. 7 మెట్లు .. ఓపికను బట్టి ఎక్కడం  చూడవచ్చు. 
మోహన్ గారు ఇచ్చిన వివరణ ఏమిటంటే .. " అక్కడంతా సాలగ్రామశిలామయమని భగవద్రామానుజులు మోకాళ్ళతో ఎక్కరాటా అందుకని భక్తులు ఎక్కువారు. "
Mokalla Parvatam


 Bhagavata Ramanujacharylu

Narayanaadri - Seshadri
నారాయణాద్రి - శేషాద్రి
  POIGAI ALWAR

KULASEKHAR AALVARU

కులశేఖరాళ్వారు

TIRUMANGAI ALVARULast step at Alipiri Foot path Wayతిరుమల అలిపిరి చివరి మెట్టు ..

PERIYALVARU 

అర్ధమైంది .. లగేజి ఎక్కడ తీసుకోవాలని అనేగా .. ఇదిగో లగేజి సెంటర్.. క్రింద కౌంటర్ లో ఇచ్చినటోకెన్ ఉందిగా అది చూపించండి.ప్రక్కనే ఆలయం వారు ఏర్పాటు చేసిన సమాచారకేంద్రం ఉంటుంది. మీకు కావలిసిన సమాచారం అడిగి తెల్సుకోండి. 
  Luggage Center
అలిపిరి నుంచి కొండపైకి 15 కిమీ దూరం ఉంటుంది. ఎక్కువ  లగేజి మీతో పాటు తీస్కుని వెళ్ళకండి. మెట్ల మార్గం లో దేవస్థానం వారు అన్ని ఏర్పాట్లు చేశారు. దర్శనం వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్న వారిని అడగండి. మెట్లమార్గం ద్వారా వచ్చినవారికి ప్రత్యేక లైన్ ఉంటుంది. దర్శనం మెమోలో రోజుల్లో 3-4 గంటల సమయం పడుతుంది.
Click Here For : 
Tirumala Surrounding Temples
Tirumala Near By Famous Temples List
keywords : Alipiri Steps information , Telugu travel blog , Alipiri Steps Guide, Tirumala , Alipiri, tirumala information in telugu

Comments

 1. నిజంగా మీరు ఓపికగా అన్నీ అర్ధం అయ్యే ల ఫోటో లో తో సహ వివరించారు ఇక్కడ ఒక చిన్న సమాచారం మార్గం లో కొందరు ఇక్కడ మొక్కన్దీ అండ్ దారికి అడ్డంగా వచ్చి విసిగిస్తారు జాగ్రత తరివత పిల్లలతో బాగ్ పోయింది/పర్స్ పోయింది అని ఏదో ఒక కధ చెప్పి సాయం చేయండి మోసగాళ్ళు ఎక్కువైపోయారు జాగ్రత మీకు మా థాంక్స్ ఇంకా మంచి విషయాలి పంచుకో గలరు జైహింద్

  ReplyDelete
 2. మీతో పాటు తిరుమల కొండ ఎక్కిన అనుభూతి కలిగింది... ధన్యవాదములు.

  ReplyDelete
 3. తిరుపతి అలిపిరినుండి తిరుమలకు మమ్మల్ని చేయిపట్టుకుని తీసుకవెళ్లి స్వామివారి దివ్యదర్శనము చేయించినంత అనుభూతి కలిగినది. చిత్రములతో త్రోవయెక్క వర్ణనతో మీప్రస్తుతీకరణ అద్భుతం, మహాద్భుతం,అనితరసాధ్యం.ధన్యవాదములు-అభినందనలు
  - Suryanarayana Murthy Dharmala

  ReplyDelete
 4. One of the best articles I have ever read in face book. Hats off to the author. Om namo venkatesaya namaha.
  - Adabala Veerraju

  ReplyDelete
 5. ధన్యోస్మి
  చాలా చక్కగా వివరించారు
  చాలా సార్లు తిరుమల వెళ్లాం కాని మెట్ల దారిలో వెళ్లలేదు
  మీ కధనం తో ఇపుడే ఒక్కసారి ఆ మెట్లదారిలో
  ఆ వేంకటేశ్వరుని దర్శించాలని సంకల్పం కలిగింది.
  ఇక అది నేరవేర్చటం ఆ స్వామి దయ మా ప్రాప్తం.
  మరొక్కసారి మీకు ధన్యవాదములు.
  - Polise Varanasi

  ReplyDelete
 6. Sooperb explaiation with pics
  - Gvk Durga Ravi

  ReplyDelete
 7. Super Explanation.....Govindaaa

  ReplyDelete
 8. కళ్లకు కట్టినట్టు ఫోటొలతో సహ చూపించారు.మాకు మెట్ల మార్గం పూర్తి సమాచారన్ని ఇచ్చినందుకు ధన్యవాదలు.గోవింద..గోవింద..గోవింద.

  ReplyDelete
 9. admin gaaru meeru enno vyaa prayaasalaku oorchi chaala vivaram ga varninchi vivarinchharu chaala kruthagnathalu.

  ReplyDelete
 10. కళ్లకు కట్టినట్టు ఫోటొలతో సహ చూపించారు.మాకు మెట్ల మార్గం పూర్తి సమాచారన్ని ఇచ్చినందుకు ధన్యవాదలు.గోవింద..గోవింద..గోవింద.

  ReplyDelete
 11. manchi vivarana.. kaani.. oka chinna vishayam.. "alipiri nundi tirumala-9km matrame"-Veera Pavan Mahesh

  ReplyDelete
 12. Very clear and detailed information. Good Job. Thank you.

  ReplyDelete
 13. Manchi Information Share Cheesaaru Chinna Pillaadu Koodaa Eeee Information Thoo Single Gaa Tirumala Velli Darshanam Cheesukuni Tirigi Raavichchu!!!

  ReplyDelete
 14. Thirumala metla margam lo velley vallu thapakka chadhavalsina article.chala baga vivarincharu.

  ReplyDelete
 15. EXCELLENT FACILITIES PROVIDED BY TTD.

  ReplyDelete
 16. చక్కనివివరణనిచ్చారు ధన్యవాదములు

  ReplyDelete
  Replies
  1. Its very nice illustration about alipiri steps

   Delete
 17. SATYANARAYANA SRAVANAMMay 6, 2017 at 11:14 AM

  Ome Namo Venkatesha. Very good information

  ReplyDelete
 18. చాలా చక్కగా వివరించారు. నమో: వేంకటేశ

  ReplyDelete
 19. govinda govinda govinda venkata ramana govinda,edukondalavada govinda,very good infermation. sir tank u.
  ReplyDelete
 20. Om namo venkatesha very very very valuable information

  ReplyDelete
 21. Om namo venkatesha very very very valuable information

  ReplyDelete
 22. Thanks for sharing each and every thing.. Proud of you guys and team

  ReplyDelete
 23. ఏ.వేంకటేశ్వర్లుJune 14, 2018 at 10:45 PM

  ప్రత్యక్షంగా మమ్మల్ని మీతో నడిపించి మెట్ల మార్గం గుండా తీసుకొని వెళ్లిన అనుభూతి కల్గించారు. అద్భుతం, అమోఘం, అద్వితీయం.
  ధాన్యవాదములు.

  ReplyDelete

Post a Comment

Hindu Temples Guide ( HTG)

Tirumala Tour History Surrounding Temples Timings Seva Details Online Ticket Booking Information: https://goo.gl/LHwnpS

Arunachalam Information : https://goo.gl/YKQFt5

Varanasi Tour: https://goo.gl/7551ZC

Kanchipuram Detailed Info : https://goo.gl/9U11rh

Srisailam Tour : https://goo.gl/h4NJZH

Top Ten Towers in India : https://goo.gl/G9GHdy

Shirdi Tour Visiting Places : https://goo.gl/WFbNcs

Srikalahasti Temple Details : https://goo.gl/PXJv9Q

Rameswaram Tour and Packages : https://goo.gl/uXffLV

Telangana Amarnath Yatra : https://goo.gl/ihJV4M

Thanjavur Temple History : https://goo.gl/tCTYbW

Sriragnam Temple Tour : https://goo.gl/fPWdos

Madhurai Meenakshi Temple History: https://goo.gl/yV6R7E

Bhadrachalam Temple and Sightseeing Places : https://goo.gl/X3rDb3

Annavaram History Temple Timings: https://goo.gl/bdJYeD

Pithapuram Padagaya Temple History : https://goo.gl/ezR4Cs

Toli Tirupathi East Godavari: https://goo.gl/WsSYF9

Draksharamam Temple History Rooms : https://goo.gl/BBRSqV

5000 Years Old Temple at Kakinada : https://goo.gl/UbQH8T

Samarlakota Bhimeswara Swamy Temple : https://goo.gl/E6gdQc

How to Do Pooja by Sri Chaganti : https://goo.gl/mQwFww

Chidambaram Temple Tour and History : https://goo.gl/CQqjr2

Shakti Peetham Located in Srilanka : https://goo.gl/dCecSa

Kolhapur Mahalakshmi Temple Details : https://goo.gl/tM2EXG

Yaganti Temple Timings History : https://goo.gl/XkN7zz

Sri Kanipakam Temple History Route form Tirumala : https://goo.gl/Yb2871

Jamukeswaram Jalalingam : https://goo.gl/5Lk6wR

Simhachalam Accommodation History : https://goo.gl/ZUYdKd

Famous Lord Shiva Temples : https://goo.gl/6xhEus

Kashi Veesalakshi Shakti Peetham Information : https://goo.gl/SGMhQh

Sri Sailam Bramarambhika Devi Shakti Peeth : https://goo.gl/Co1pSw

Sri Puruhutika Devi Shakti Peetham : https://goo.gl/Pb1P8H

Sri Manikyamba Shakti Peeth : https://goo.gl/eknwne

Sri Vaishnavi Devi Shakti Peeth : https://goo.gl/QNtgom

Sri Madhaveswari Shakti Peeth Information : https://goo.gl/ARA2La

Sri Mangala Gowri Shakti Peeth : https://goo.gl/ViMsnm

Ujjain Mahakali Shakti Peeth : https://goo.gl/w2cLHF

Sri Girija Devi Shakti Peeth : https://goo.gl/t18oRU

Sri Khamakya Shakti Peeth : https://goo.gl/3Mk6oj

Sri Jogulambha Shakti Peeth : https://goo.gl/aa9NLm

Sri Shankari Devi Shakti Peeth : https://goo.gl/rc1Doi

Sri Chamundeswari Shakti Peeth : https://goo.gl/LY2wNG

Sri Ekaveera Shakti Peeth : https://goo.gl/yryF7j

Kolhapur Mahalakshmi Shakti Peeth : https://goo.gl/kCHXti

Sri Saraswathi Devi Shakti Peeth : https://goo.gl/p8mQaz

Kanchipuram Kamakshi Amman Temple : https://goo.gl/9vBUc6

Madhurai Meenakshi Amman Temple : https://goo.gl/yhdBZc

Sri Shrungeri Shakti Peeth : https://goo.gl/yHpxWH

Sri Kanaka Mahalakshmi Temple Vizag : https://goo.gl/RRwgnv

Golden Temple Sripuram History Timings : https://goo.gl/AVD4VR

Talulamma Talli Temple History Timings : https://goo.gl/VobnnQ

Contact Form

Name

Email *

Message *