Tirumala Darshan Information:

Tirumala News ***  ఓం నమో వేంకటేశాయ *** నవంబర్ నెలకు సంబంధించిన రూ.300/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం టిక్కెట్ల‌ ఆన్‌లైన్ కోటాను సెప్టెంబరు 21న ఉదయం 9 గంటలకు టీటీడీ వెబ్‌సైట్‌లో విడుదల చేయ‌నుంది.***నవంబర్ నెలలో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకార సేవతో సహా ఆర్జిత సేవా టిక్కెట్లు సెప్టెంబరు 21 మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. ***నవంబర్ నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్లు సెప్టెంబర్ 21 నుండి అందుబాటులో ఉంటాయి.***అక్టోబర్ నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్‌లు సెప్టెంబర్ 22న ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయబడతాయి.***అక్టోబ‌రు 25న సూర్యగ్రహణం, న‌వంబరు 8న చంద్ర‌గ్ర‌హ‌ణం- ఆయా రోజుల్లో 12 గంట‌ల పాటు శ్రీ‌వారి ఆల‌య త‌లుపులు మూత –అన్ని ర‌కాల ద‌ర్శ‌నాలు ర‌ద్దు – స‌ర్వ‌ద‌ర్శ‌నం భ‌క్తుల‌కు మాత్ర‌మే అనుమ‌తి.** ***ప్రస్తుతం తిరుమలలో ఎటువంటి ఉచిత దర్శనం టికెట్స్ ఇవ్వడం లేదు . అందరు టికెట్ లేకుండా దర్శనం చేసుకోవచ్చు. ***జులై 7న సెప్టెంబరు నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా 9 గంట‌ల‌కు టిటిడి ఆన్ లైన్ లో విడుదల.***తిరుమలలో సంపూర్ణ ప్లాస్టిక్‌ నిషేధం. ప్లాస్టిక్ బాటిళ్లు, బ్యాగులు, కవర్ల వినియోగాన్ని తిరుమలలో టీటీడీ పూర్తిగా నిషేధించింది. *** ఆన్లైన్ సేవ తీసుకున్నవారికి కూడా దర్శనం ఉంటుంది సేవ తో పాటు దర్శనం బుక్ చేస్కోవాలి .*** కళ్యాణం టికెట్స్ ఏ ఇద్దరైనా బుక్ చేస్కోవచ్చు దంపతులే కాకుండా   ఇద్దరు మగవాళ్ళు , ఇద్దరు ఆడవాళ్లు కూడా బుక్ చేస్కోవచ్చు . *** .****

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . ***షిర్డీ ఆలయం ఓపెన్ లోనే ఉంది . ఆన్ లైన్ లో టికెట్స్ బుక్ చేస్కుని దర్శనానికి వెళ్ళాలి . రామేశ్వరం లో బావుల్లో స్నానానికి అనుమతించడం లేదు తమిళనాడు లోని ఆలయాలకు ఆన్లైన్ బుకింగ్ అవసరం లేదు . అరుణాచలం దర్శనానికి ఆన్ లైన్ టికెట్ అవసరం లేదు నేరుగా వెళ్లి దర్శించవచ్చు గిరిప్రదక్షిణ కలదు .  . 

The Story of Sri Adi Varaha Swamy | Tirumala


ఇప్పటి వరకు మీరు తిరుమల ఎన్నిసార్లు వెళ్లారు, వెళ్లిన ప్రతి సారి  మీరు వెంకటేశ్వర స్వామిని మాత్రమే దర్శించుకుంటున్నారా , తిరుమల వెళ్లిన ప్రతి ఒక్కరు కూడా వెంకటేశ్వర స్వామి ని మాత్రమే దర్శించుకుంటే చాలదు మీకు యాత్ర ఫలం కలగాలన్న మీరు తిరుమల వెళ్లిన ప్రతిసారి ముందుగా ఆదివారాహస్వామి ని దర్శించాలి. తిరుమల వైకుంఠ కాంప్లెక్స్ లో ఒక లక్ష మంది భక్తులు ఉంటే. అందులో ఎంత మంది ముందుగా ఆదివారాహస్వామి ని దర్శించుకుంటున్నారు. లక్ష మందిలో సగం కూడా ముందుగా స్వామి వారిని దర్శించుకోవడం లేదు. ఇకపై మీరు ఆ తప్పు చేయకండి.  ముందుగా కొండమీదకు వెళ్ళగానే మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించే ముందు  ఆదివారాహస్వామి వారిని దర్శించండి. స్వామి వారి పుష్కరిణి పక్కనే ఆదివారాహస్వామి వారు కూడా ఉంటారు . ఈసారి మీరు తిరుమలకు వెళ్ళినపుడు తప్పకుండ ఆదివారాహస్వామిని  దర్శనం చేసుకోండి ఆ వేంకటేశ్వరుని దీవెనలు పొందండి. 


శ్రీవరాహమూర్తి, వరాహావతారము, వరాహ స్వామి   ఇవన్నీ శ్రీమహావిష్ణువు మూడవ అవతారమును వర్ణించే నామములు. హిందూ పురాణాల ప్రకారం త్రిమూర్తులలో విష్ణువు లోకపాలకుడు. సాధుపరిరక్షణకొఱకు, దుష్టశిక్షణ కొఱకు ఆయన ఎన్నో అవతారాలలో యుగయుగాన అవతరిస్తాడు. అలాంటి అవతారాలలో 21 ముఖ్య అవతారాలను ఏకవింశతి అవతారములు అంటారు. వానిలో అతిముఖ్యమైన 10 అవతారాలను దశావతారాలు అంటారు. ఈ దశావతారాలలో మూడవ అవతారము వరాహావతారము. మహాలక్ష్మిని సంబోధించే "శ్రీ" పదాన్ని చేర్చి శ్రీవరాహమూర్తి అని ఈ అవతార మూర్తిని స్మరిస్తారు. వరాహావతారం హిరణాక్షుడిని చంపి, భూమిని ఉద్ధరించి, వేదములను కాపాడిన అవతారము. స్వామి ప్రార్థనలలో ఒకటి:
ఆది వరాహ మూర్తి, యజ్ఞవరాహ మూర్తి, మహా సూకరం అని నామాలు కూడా ఉన్నాయి. తిరుమల కొండలపై మొదట వెలసిన స్వామి వీరే, వీరి అనుమతితోనే వేంకటేశ్వరుడు అక్కడ నివాసము ఏర్పాటుచేసుకున్నారు. రాక్షసునితో భయంకరంగా యుద్ధం చేసి, చక్రాయుధంతో వానిని సంహరించి, భూమాతని జలము పై నిలిపిన స్వామి, వేదాలను రాక్షసుల బారినుండి రక్షించిన స్వామి.


ముందుగా వరాహస్వామిని ఎందుకు దర్శించుకోవాలి?
అశేష భక్తజనానికి ఆరాధ్యదైవం అయిన తిరుమల వేంకటాచలంలో ఆదిదైవం వరాహస్వామి. వరాహస్వామికి అంత ప్రాముఖ్యత ఎందుకంటే అసలు భూమాతను రక్షించింది వరాహావతారమేగా మరి.
హిరణ్యాక్షుడు భూమాతను సముద్రంలోకి విసిరేయగా రక్షించేందుకు, విష్ణుమూర్తి వరాహావతారం ఎత్తాడు. అప్పటికీ పశ్చాత్తాపం లేకుండా హిరణ్యాక్షుడు హేళన చేయగా, విష్ణుమూర్తి ఆగ్రహావేశాలకు పోకుండా భూమాతను జాగ్రత్తగా తన మూతిపై నిలిపి పట్టుకున్నాడు. సురక్షితంగా సముద్రంలోంచి పైకి తీశాడు. అదీ వరాహస్వామి కథ. ఇక వైకుంఠం వదిలి వచ్చిన శ్రీనివాసునికి భూలోకంలో స్థలాన్ని ప్రసాదించింది కూడా వరాహస్వామివారే. ఈ కారణంగానే తిరుమల దివ్యక్షేత్రంలో వేంకటేశ్వరుని కంటే ముందుగా ఆది వరాహస్వామి దర్శనం అవుతుంది.


‘‘మహావరాహో గోవిందః సుషేణాః కనకాంగది’’ ఆదివరాహమూర్తే గోవిందుడు. తిరుమల ప్రధానంగా ఆయన క్షేత్రమే. శ్రీనివాసుడు వచ్చి అక్కడ ఉండటానికి అనుమతి కోరితే అందుకు వరాహస్వామి అంగీకరించాడు.అందుకు కృతజ్ఞతగా తన వద్దకు వచ్చే భక్తులకు తనకన్నా ముందే ఆయననే దర్శించుకుంటారనిశ్రీవారు వరాహమూర్తికి మాట ఇచ్చారు. అందుకే తిరుమల వెళ్లే భక్తులు ముందుగా వరాహస్వామిని దర్శించుకుని ఆ తర్వాత వేంకటేశ్వరుణ్ని దర్శించుకుంటే యాత్రాఫలం దక్కుతుంది.
 ఈ ఆచారం ఈనాటిది కాదు. శతాబ్దాలుగా ఈ ఆచారమే కొనసాగుతోంది. భక్తులు వరాహస్వామిని దర్శించిన తర్వాతే శ్రీవారి దర్శనం చేసుకుంటారు. అందుకే తిరుమల పుణ్య తీర్థాన్ని ''ఆది వరాహ క్షేత్రం'' అని కూడా అంటారు. 

మరిన్ని తిరుమల సమాచారం కోసం ఈ క్రింది లైక్స్ పై క్లిక్ చేయండి :
Related Postings :adivarahaswamy history in telugu, varahaswamy information in telugu, tirumala, tirumala varahaswamy temple, tirumala yatra information, tirumala angapradakshana, temple timings, accommodation details, hindu temples guide.

Comments

  1. అంత బాగే ఉంది అండి కాని మీరు ఇచ్చిన information కాపీ చేసుకోడానికి విలు లేదు. ప్రింట్ అవుట్ కూడ తీసుకో రావడం లేదు.

    ReplyDelete
  2. Sir. This information should be in other languages also. It will be too good.

    ReplyDelete

Post a Comment

Popular Posts