Drop Down Menus

Significance Of Tholi Ekadasi And Pooja Vidhi | Ekadasi

తొలి ఏకాదశి విశిష్ఠత,చాతుర్మాశ్య వ్రతం నియమాలు
సాధారణంగా ఆషాఢ మాసం మంచిది కాదని అంటారు కానీ,చాలామంచిది.విష్ణు ప్రీతికరం ఈ మాసం. ఎన్నో పండుగలతో కూడిన పుణ్యాన్ని చేకూర్చే మాసం. నిజానికి మొట్టమొదటి పండగ ఆషాఢమాసం లో వచ్చే శుక్ల ఏకాదశి
తొలి ఏకాదశి:  ఆషాడ మాస ఏకాదశిని  తొలి ఏకాదశి అని అంటారు. ఈ రోజుని ఇంకా ఆషాఢ శుద్ధ ఏకాదశి, శయన ఏకాదశి, ప్రధమ ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజు నుంచి శ్రీ మహావిష్ణువు క్షీరాబ్ధి యందు శయనిస్తాడు. కనుక దీన్ని “శయన ఏకాదశి” అంటారు. తొలి ఏకాదశి శ్రీ మహా విష్ణువుకు చాలా ప్రీతికరమైన రోజు. తొలి ఏకాదశి రోజు చాలా మంది ఉపవాసము ఉంటారు. పీఠాధిపతులు,మఠాధిపతులు,ఏటీశ్వరులు చాతుర్మాస్య వ్రతం ప్రారంభిస్తారు. 
వారు ఎక్కడ ఉంటె అక్కడే చాతుర్మాస్య వ్రతం మొదలుపెట్టి, పూర్తిచేస్తారు. గృహస్థులు కూడా ఆచరించవచ్చు. ఈ రోజు చాతుర్మాస్య వ్రతం మరియు గోపద్మ వ్రతమును ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని తొలి ఏకాదశి రోజు నుంచి క్షీరాబ్ధి ద్వాదశి వరకు ఆచరించవలెనని మన పురాణాలు చెబుతున్నాయి.
విష్ణువు ఈరోజు యోగ నిద్రకు ఉపక్రమించే రోజు. ఆషాఢం,శ్రావణం,భాద్రపదం,ఆశ్వయుజం మాసాలు ముగిశాక కార్తీక శుద్ధ ద్వాదశి నాడు నిద్ర లేస్తాడు. దీన్నీ చిలుకు ద్వాదశై , ఉత్తాన ద్వాదశి అని కూడా అంటారు. అందుచేత ఈ నాలుగు మాసాలు విష్ణువుని ఎవరైతే అర్చిస్తారో వారికి హరిపద ప్రాప్తి కలుగుతుంది.
ఎవరైతే విష్ణు సంకీర్తన చేస్తారో వారికి ముక్తి కలుగుతుంది. విష్ణువు కోసం ద్వార పాలకులు కూడా ఎదురు చూసే రోజు. గుమ్మడికాయ, పలు, పెరుగు,వస్త్రం,నెయ్యి, వెన్న,,గోవు విష్ణు ప్రీతిగా దానం ఇస్తే,వారు అనుకున్న పనులు నెరవేర్చబడతాయి. మకర సంక్రమణం నాడు ఏవిధంగా దాన ధర్మాదులు చేస్తామో అలాగే ఇప్పుడు కూడా చేస్తే ఇహపరమైన భోగ భాగ్యాలు లభిస్తాయి
ఉపవాసము: తొలి ఏకాదశ నాడు ఉపవాసము చేయుట వలన చాల మంచిదని, చేసిన వారికి కోరుకున్న కోరికలు నేరవేరునని అంటారు. అయితే ఉపవాసం అంటే కేవలం తినడం మానేయటం కాదు. ఆ రోజు మంచి పనులు అనగా పేదవారికి దాన, ధర్మములు చేయుట మరియు ఆ మహా విష్ణువును పూజించుట చేయవలెను.
స్వామి అలంకార ప్రియుడు కనుక మహావిష్ణువుకు జాజిపూలతో అలంకారం చేసి శాంతాకారం భుజగశయనం,పద్మనాభం అంటూ మహావిష్ణువును పూజించే ఈ ఏకాదశే తొలిఏకాదశి.
ఉపవాసవివరాలను భవిష్యోత్తర పురాణం చెబుతుంది.ఏకాదశీవ్రత ప్రాధాన్యం ఏమిటో బ్రహ్మవైవర్తన పురాణం చెప్తుంది.ఏకాదశి తర్వాత వచ్చే ద్వాదశి ఘడియల్లో చేసే అన్న దానానికి అనంతకోటి పుణ్య ఫలాలు వస్తాయని చెప్తారు.
శ్రీకృష్ణావతారంలో తాను భక్తితో ఇచ్చే నీటినైనా సంతోషంతో స్వీకరిస్తాను అని చెప్పిన భగవానుని తలుచుకుని అత్యంత అను రాగంతో కూడిన భక్తితో మహావిష్ణువును శోభాయమానంగా అలంకరించి పదకొండు వత్తులతో దీపారాధన చేస్తారు. హరికథలనే చెప్పుకుంటూ హరితో నివాసం చేస్తూ ఉపవాసం చేసిన శ్రీహరికి ఇష్టమైన పేలపిండిని బెల్లంతో కలిపి నైవేద్యంగా అర్పిస్తారు. 
ప్రతి వైష్ణవాలయంలోను స్వామికి పవళింపుసేవోత్సవం జరుపుతారు.గోముఖభాగమందు వేదాలు,కొమ్మలందు హరిహరులు, నేత్రాలలో సూర్యచంద్రులు, జిహ్వనందు సరస్వతి, పూర్వభాగములో యముడు, పశ్చిమంలో అగ్ని, గోమయంలో లక్ష్మి,అరుపులో ప్రజాపతి ఇలా గోదేహమంతా సర్వదేవతలు సర్వతీర్థాలు సర్వదేవతా నివాసస్థానమైన గోవు ను కూడా ఈ ఏకాదశిన పూజిస్తారు.అధర్వణవేదం, బ్రహ్మాండ,పద్మపురాణం, మహాభారతం కూడా గోవిశిష్టత తెలుపుతాయ.
గోశాలలను శుభ్రం చేసి ముత్యాల ముగ్గులుతీర్చి మధ్యలో ముప్పైమూడు పద్మాల ముగ్గులువేసి శ్రీమహాలక్ష్మీసమేత శ్రీ మహావిష్ణువు ప్రతిమను ఆ పద్మాలపై పెట్టి శాస్త్రోకంగా పూజచేస్తారు. పద్మానికొకఅప్పడం చొప్పున వాయనాలు దక్షిణతాంబూలాలనిస్తారు. మహావిష్ణువు అత్యంత ప్రేమపాత్రమైన తులసమ్మ దగ్గర పద్మం ముగ్గువేసి దీపం వెలిగించి వివిధరకాల పండ్లను నివేదిస్తారు.ఏకాదశి వ్రతాన్ని రుక్మాంగదుడు,అంబరీషుడు కూడా పాటించారు.వాళ్లు పాటించడమే కాక వారి రాజ్యాల్లోని జనులందరి చేతకూడా ఏకాదశివ్రతాన్ని పాటించేలా చేశారు. ఏకాదశీవ్రతం చేసేవారి యెడ సదా మహావిష్ణువు తోడునీడగా ఉంటాడు.సతీ సక్కుబాయి ఈ తొలి ఏకాదశీ వత్రం చేసి భగవానుని అనుగ్రహం పొందిందని పండరిపురంలో తొలేకాదశి నాడు మహోత్సవాలు జరుపుతారు.
ఉపవాసములో రకములు; శక్తి కొద్ది భక్తి అన్నారు పెద్దలు. అలాగే మన శక్తిని బట్టి మనం ఆ భగవంతుని పూజ గాని అందులో బాగామైన ఉపవాసం గాని చెయ్యవచ్చు. మన శక్తిని బట్టి ఈ క్రిందనివ్వబడిన నాలుగు విదానాలలో ఎలైగైన చెయ్యవచ్చు.
1.రోజంతా ఏమీ తినకుండా నిష్టగా ఉండి మరుసటిరోజు సూర్యోదయమునకు ముందే లేచి స్నానం చేసి పూజ చేసుకుని ఆ తర్వాత భోజనం చేయవలెను.

2.నీళ్ళు, పాలు తీసుకుని.. మరుసటిరోజు సూర్యోదయమునకు ముందే లేచి స్నానం చేసి పూజ చేసుకుని ఆ తర్వాత భోజనం చేయవలెను.

3.నీళ్ళు, పాలుతో పాటు పండ్లను కూడా తీసుకుని, మరుసటిరోజు సూర్యోదయమునకు ముందే లేచి స్నానం చేసి పూజ చేసుకుని ఆ తర్వాత భోజనం చేయవలెను.

4.అల్పాహారం స్వీకరించి, మరుసటిరోజు సూర్యోదయమునకు ముందే లేచి స్నానం చేసి పూజ చేసుకుని ఆ తర్వాత భోజనం చేయవలెను.

ఈ వ్రతము వలన కలిగే ప్రయోజనాలు; అరవై వేల సంవత్సరాలు తపస్సు, , అశ్వమేధ యాగం, భూమి దానం చేసినంత పుణ్యం వస్తుంది. మహాసాధ్వీ సతీ సక్కుభాయి ఈ వ్రతాన్నే ఆచరించి మోక్ష సిద్ధి పొందటం జరిగింది. అంతేకాకుండా ఉపవాసము చేయడం వలన మనిషికి ఇంద్రియ నిగ్రహం కలిగి కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యాలను  జయించడం వలన దేనినైనా సాదించగలడు.

ఈ విధంగా శ్రీకృష్ణుడు ఈరోజుకు ఉన్న మహిమ గురించి మరియు చేయాల్సిన విధివిధానాల గురించి భీముడికి చెప్పినారు.
Related Postings

Keywords:
తోలి ఏకాదశి నియమాలు | What We Must Do On Tholi Ekadasi,తొలి ఏకాదశి రోజు నుండి చేసే చాతుర్మాశ్య వ్రతం, అంటే ఏమిటి?నియమాలు| Chturmasya Vratham, Significance,రేపు తొలి ఏకాదశి రోజున ఇలా చేస్తే సకల పాపాలు జన్మ జన్మ కష్టాలు తొలగిపోతాయి,తొలి ఏకాదశి విశిష్ఠత Tholi Ekadasi, Tholi Ekadashi Pooja, Tholi Ekadasi Visistatha, Ekadashi,Things To Do On Tholi Ekadasi,తొలి ఏకాదశి ప్రత్యేకత ,Toli Ekadasi,రేపు తొలి ఏకాదశి రోజున ఇలా చేస్తే సకల పాపాలు జన్మ జన్మ కష్టాలు తొలగిపోతాయి,తొలి ఏకాదశి విశిష్ఠత,చాతుర్మాశ్య వ్రతం నియమాలు,pooja vidhi,pooja vidhanam,tholi ekadasi puja vidhi

ఇవి కూడా చూడండి
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON