Drop Down Menus

Mahabalipuram Tourism Tamil Nadu - Ancient History Encyclopedia

మహాబలిపురం :
పల్లవ రాజులు నిర్మించిన మహాబలిపురం తీర దేవాలయంలో అనేక రహస్యాలను దాగి ఉన్నాయి. 1200 ఏళ్ల చరిత్ర కలిగిన ఆ దేవాలయంలో ఎన్నో వింతలు దర్శనమిస్తాయి. అందులోని శిల్పాలను చూస్తే పురాతనకాలంలోనే రాకెట్ ప్రయోగాలకు నాంది పలికారని అనిపిస్తుంది. మహాబలిపురం తమిళనాడు రాష్ట్రం కంచి జిల్లాలోని ఒక గ్రామము. కంచి పట్టణానికి 66 కి.మీ. దూరంలో రాష్ట్ర రాజధాని చెన్నైకి 70 కి.మీ. దూరంలో ఉంది. మహాబలిపురం తమిళ భాషలో మామల్లపురం అని పిలుస్తారు.
మహాబలిపురానికి ఆ పేరు రావటానికి మరొక కథనం ప్రకారం పూర్వం బలిచక్రవర్తి ఈ ప్రాంతాన్ని పాలించటంవల్ల ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చింది అని స్థానికులు అంటుంటారు. తదనంతర కాలంలోనూ పల్లవుల పరిపాలనా కాలంలోనూ ఈ ప్రాంతం స్వర్ణయుగాన్ని చూసింది. పల్లవులు ఈ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని కొంతకాలం పాలించారు. అప్పుడు కట్టించినవే ఈ శిల్పకళా సంపద. పల్లవులు దీనిని మంచిరేవుపట్నంగా తీర్చిదిద్దారు. దానికోసం ఇక్కడ కొండమీద ఒక లైట్ హౌస్ ని కట్టారు.
మహాబలిపురం బంగాళా ఖాతానికి అభిముఖంగా కోరమండల్ తీరంలో కలదు. పల్లవుల పాలనలో అంటే క్రి.శ.650 నుండి 750 వరకూ ఈప్రదేశంలో అనేక కళలు, పురావస్తు,శిల్ప సంపద,సాహిత్యం, డ్రామాలు మరియు అనేక ఇతర సాంస్కృతిక రంగాలు అభివృద్ధి చెందాయి. అయితే సంవత్సరం అంతా ఇక్కడి ఆకర్షణలు దర్సించేందుకు వచ్చే పర్యాటకులతో ఈపట్టణం కిట కిట లాడుతూ వుంటుంది.

సందర్శనా స్థలాలు:
మహాదేవుని ఆలయంతోపాటు పంచ పాండవ రథాలు ఇందులో ఉన్నాయి వీటిలో ప్రధానమైనది కృష్ణుని రాయి. దీన్ని కృష్ణుడి వెన్నముద్దగా పిలుస్తారు. దాదాపు 20అడుగుల పొడవు, వెడల్పు ఎత్తు కలిగిన ఈ రాయి కేవలం రెండు చదరపు గజాల స్థలంలో ఉంటుంది. 250 టన్నుల బరువుండే ఈ రాయిని తొలగించడానికి చాలా మంది ప్రయత్నించి కనీసం అంగుళం కూడా కదిలించలేకపోయారు. 1908 లో ఈ ప్రాంతాన్ని పరిశీలించిన ఆర్ధర్ ఆలీ అనే బ్రిటీష్ అధికారి 7 ఏనుగులను తెప్పించి పెద్ద గొలుసులతో దాన్ని కదిలించడానికి శతవిధాలుగా ప్రయత్నించాడు కానీ కొంచెం కూడా కదపలేక నిరాశతో వెనుదిరిగారు.




ఈ ప్రదేశంలోని శిల్పాలను చూస్తే టెక్నాలజీకి అబ్బురపకుండా ఉండలేరు. ఒకే చిత్రంలో ఆవు, పాలు తాగుతున్న దూడను చూడవచ్చు. ఆ కాలంలోనే అంతరిక్ష పరిశోధనలకు శ్రీకారం చుట్టారా? అనటానికి అనేక శిల్పాలు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. పల్లవరాజు ఇక్కడ అంతరిక్ష పరిశోధనలు చేసారనడానికి ఆధారాలు కనిపిస్తున్నాయి.ఆ ఆలయంలోని గణేశుడి విగ్రహంపై రాకెట్ లాంచింగ్ వెహికల్ కనిపిస్తుంది. దీంతో పాటు రాకెట్ లాంచ్ చేస్తున్న అనేక రూపాలు కనిపిస్తాయి.

నిజంగా ఒక అద్భుతమైన శిల్పకళా స్థావరం అయిన మామల్లాపురం లేదా మహాబలిపురంలో చూడవలిసిన ప్రదేశాలని మూడు భాగాలుగా విభజించవచ్చు.
మొదటివి మండపాలు, గోపురాలు, లైట్ హౌస్, బిగ్ రాక్ మొదలైనవి వున్న ప్రాంతం. వీటిని చూడటానికి, ఫొటోలకి రుసుము లేదు పూర్తిగా ఉచితం. రెండవది అక్కడినుంచి పావు నుంచి అరకిలోమీటరు దూరంలో వుండే పాండవ రథాలు. ఇవి చూడటానికి, ఫొటోలకి టికట్ తీసుకోవాలి. మూడవది అతి సుందరమైన సీషోర్ టెంపుల్. ఇక్కడికి వెళ్ళటానికి టికెట్ తీసుకోవాలి. సముద్రుం ఒడ్డున అందమైన గొపురపు గుడి ఇది. ఇది కూడా చాలా దగ్గరే. బస్సు దిగిన దగ్గరనుంచి ఎడమవైపు సముద్రం ఒడ్డున ఉంటుంది.

బిగ్ రాక్: ఏటవాలు కొండపై ఏ ఆధారమూ లేకుండా ఆ కాలమునుండి పడిపోకుండా అలాగే ఉంది. ఇది ఒక విచిత్రం. ఇక్కడ ఒక చెట్టు ఉంది. ఆ చెట్టుకి కాసే కాయలు అరచేయ్యంత పరిమాణం కలిగి వుంటాయి.
బీచ్ : మహాబలిపురం బీచ్ అందమైనది. సాయంకాలం చల్లగాలిని ఆస్వాదించవచ్చు. ఈ బీచ్ లోని అలలు చాల భయంకరంగా వుంటాయి. మరియు బీచ్ లో సముద్రపు లోతు ఎక్కువ. కనుక సముద్ర స్నానం ప్రమాధకరము. గవ్వలతో చేసిన వస్తువులు కొనుక్కోవచ్చు. ఇక్కడ బీచ్ తీరం వెంబడి దొరికే రకరకాల వేడి వేడి సీఫుడ్ అత్యంత రుచికరంగా ఉంటుంది. ఇక్కడ భొజనం హోటళ్ళకి, లాడ్జిలకి కొరతే లేదు. కాని రాత్రి సమయాలలో ఉండేటందుకు అనువైన సౌకర్యాలు కలిగిన ప్రాంతంకాదు. భారతీయులతో పాటు ఫారినర్స్ కూడా ఎక్కువమంది ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంటారు.

ఇక్కడ విచిత్రమైన మరో అంశం బావి. కొలతలు కూడా అందుబాటులో లేని కాలంలో ఎంతో ఖచ్చితత్వంతో బావిని నిర్మించారు. అప్పట్లోనే సాంకేతిక పరిఙ్ఞానం వాడారు అనడానికి ఇది గొప్ప నిదర్శనం. ఆలయ గోపురంపై ఉండే శూలాన్ని చూస్తే టెక్నాలజీ అబ్బురపరుస్తుంది. శూలానికి సంబంధించిన దేవుడు మనకి ఎక్కడా కనిపించడు. అతని తల మీద రెండు కొమ్ములు,అలాగే హెల్మెట్ ధరించినట్లు ఉంటుంది.
రవాణా సౌకర్యాలు :
మహాబలిపురం వెళ్ళటానికి చెన్నై కోయంబేడునుంచి బస్సులు ఉన్నాయి. అక్కడినుంచి మహాబలిపురానికి ఒక గంటన్నర రెండు గంటల్లో చేరుకోవచ్చు. మహాబలిపురంలో చూడదగ్గ ప్రదేశాలన్ని చుట్టుపక్కల అరకిలోమీటర్ దూరంలోనే వుంటాయి. ఎక్కడికైనా నడిచే వెళ్ళవచ్చు. లేదా ఆటోలు దొరకుతాయి.

mahabalipuram timings, mahabalipuram beach, mahabalipuram hotels, mahabalipuram underwater city, mahabalipuram images, mahabalipuram resorts, mahabalipuram weather, mahabalipuram upcoming events, mahabalipuram temples, mahabalipuram history, mahabalipuram information, mahabalipuram history telugu, mahabalipuram images, mahabalipuram tourism .
ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.