ఈ వారం రాశిఫలాలు | This Week Horoscope in Telugu | Horoscope PDF Download


మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)

శుభయోగాలున్నాయి. బలమైన ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారంలో లాభాలున్నాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కొన్ని కీలక నిర్ణయాల్లో వారి సహకారం మీకు లభిస్తుంది. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒక ముఖ్యమైన పనిని ఎట్టకేలకు పూర్తిచేయగలుగుతారు. సమాజంలో గొప్ప పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు. పట్టుదలతో మరువలేని విజయాలను సొంతం చేసుకుంటారు. ఇష్టదేవతా స్మరణ శుభప్రదం.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా.)

ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి మంచి ఫలితాలను సాధిస్తారు. కీలక నిర్ణయాలు తీసుకునే ముందు బాగా ఆలోచించి తీసుకోవాలి. ఉద్యోగ విషయాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు. ఆశయాలు నెరవేరుతాయి. వ్యాపారస్తులకు శుభకాలం. ఆర్థికంగా అభివృద్ధి ఉంది. కొత్త బాధ్యతలు చేపడతారు. ఒక శుభవార్త శక్తినిస్తుంది. మీ ప్రతిభకు ప్రశంసలున్నాయి. మంచి జీవితాన్ని పొందుతారు. వారాంతంలో శుభం చేకూరుతుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. ఇష్టదైవారాధన శుభప్రదం.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)

మిశ్రమ ఫలితాలున్నాయి. చేపట్టే పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధుమిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు. ముఖ్య విషయాల్లో పెద్దల ఆశీర్వచనాలు అందుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనవసర ధనవ్యయం సూచితం. అనారోగ్య సమస్యలు కాస్త ఇబ్బంది పెడతాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. చేయని పొరపాటుకు నిందపడాల్సి వస్తుంది. మనోధైర్యాన్ని కోల్పోకండి. బంధువులతో వాదనలకు దిగడం వల్ల విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఇష్టదేవతా స్తోత్రం పారాయణ చేస్తే మంచిది

కర్కాటకం: (పునర్వసు 4 పా, పుష్యమి, ఆశ్లేష)

బలమైన ప్రయత్నంతో అనుకున్నది సాధిస్తారు. చేపట్టిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తిచేసే ప్రయత్నం చేస్తారు. ఆర్థికంగా మిశ్రమ ఫలితాలున్నాయి. ఏకాగ్రత సడలకుండా చూసుకోవాలి. ఒక వ్యవహారంలో మీ ముందుచూపు, వ్యవహారశైలికీ ప్రశంసలు లభిస్తాయి. బుద్ధిబలంతో అనుకున్నది సాధిస్తారు. వారం మధ్యలో అనుకున్నది సాధిస్తారు. ఆరోగ్యం పై శ్రద్ధ అవసరం. లక్ష్మీదేవిని ఆరాధిస్తే మంచిది.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)

అదృష్టవంతమైన కాలం నడుస్తోంది. గ్రహబలం విశేషంగా యోగిస్తోంది. చేపట్టిన పనులను సునాయాసంగా పూర్తిచేస్తారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. కొన్ని వ్యవహారాల్లో ఆర్థిక లాభం పొందుతారు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బంధుమిత్రులతో విభేదాలు రావచ్చు. కుటుంబ సభ్యుల్లో ఒకరి అనారోగ్యం కాస్త ఇబ్బంది కలిగిస్తుంది. అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. సుబ్రహ్మణ్య స్తోత్రం పఠిస్తే బాగుంటుంది.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)

తలపెట్టిన పనులు అనుకున్నట్టుగా పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ఒక వ్యవహారంలో డబ్బు చేతికి అందుతుంది. బుద్ధిబలం బాగుంటుంది. కీలక సమయాల్లో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. నూతన వస్తువులను కొంటారు. కొత్త పనులను ప్రారంభిస్తారు. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. తోటివారి సహాయ సహకారాలుంటాయి. బంధువులతో ఆనందాన్ని పంచుకుంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ప్రయాణాలు ఫలిస్తాయి. సూర్య అష్టోత్తర శతనామావళి పఠించడం మంచిది.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)

ఆశించిన ఫలితాలున్నాయి. స్వస్థానప్రాప్తి ఉంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. మీలోని నిజాయతీ మిమ్మల్ని ఉన్నతుల్ని చేస్తుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో తగినంత ప్రయత్నం అవసరం. అవసరానికి తగ్గట్టు అడుగులువేయండి. క్రమంగా పనులు పూర్తవుతాయి. మీ పనితీరుతో అందరి మనసులను గెలుచుకుంటారు. సొంతింటి నిర్మాణ పనుల్లో ముందడుగు పడుతుంది. అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. శత్రువులకు దూరంగా ఉండాలి. ఆరోగ్యం సహకరిస్తుంది. దుర్గాదేవి ఆరాధన శుభప్రదం.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)

విజయావకాశాలు పెరుగుతాయి. మంచి మనస్సుతో పనిచేయండి. ముఖ్య విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. కొద్దిపాటి అనారోగ్య సమస్యలు ఉన్నా ఆరోగ్యం కాస్త ఫర్వాలేదనిపిస్తుంది. మీరు ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్న ఒక ముఖ్యమైన పని దాదాపుగా పూర్తి కావస్తుంది. తోటివారి సలహాలు ఉపకరిస్తాయి. బంధుమిత్రులను కలుపుకొనిపోవడం ఉత్తమం. ఆర్థికంగా ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ప్రయాణాల్లో నిర్లక్ష్యం రానీయకండి. అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. ఆదిత్యహృదయం పఠించడం మంచిది.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)

గ్రహబలం అనుకూలంగా లేదు. చేపట్టిన పనిలో ఆటంకాలు ఎదురవుతాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోరాదు. మనస్తాపానికి గురి చేసే అంశాలను దరిచేరనీయకండి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ఆత్మీయుల సహకారం అవసరం. మొహమాటం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. ఇబ్బంది పెట్టే వారి నుంచి దూరంగా ఉండాలి. కీలక వ్యవహారాల్లో బుద్ధిబలంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. నవగ్రహ ఆలయ సందర్శనం శుభప్రదం.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)

శుభఫలితాలున్నాయి. చేపట్టే పనుల్లో విజయావకాశాలు మెరుగవుతాయి. భవిష్యత్ ప్రణాళికలు ఫలిస్తాయి. లక్ష్య సాధనలో చిన్నచిన్న ఆటంకాలు ఎదురైనా పెద్దగా ఇబ్బంది చేయవు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ బుద్ధిబలంతో కీలక వ్యవహారాల్లో సమయస్ఫూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలను అందుకుంటారు. ఇబ్బంది పెట్టే సంఘటనలకు దూరంగా ఉండండి. ఒక వార్త మనస్సుకు ఆనందాన్నిస్తుంది. ఇష్టదేవతా స్తుతి మేలునిస్తుంది.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)

మంచి శుభ కాలం. ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థికంగా శుభ ఫలితాలున్నాయి. ఉత్సాహంగా ముందుకు సాగాలి. ఒక ముఖ్యమైన వ్యవహారంలో పెద్దల సహకారం లభిస్తుంది. చంచలబుద్ధితో కాలాన్ని వృథా చేస్తారు. ఒక వార్త బాధ కలిగిస్తుంది. ఖర్చులు పెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టకుండా జాగ్రత్త పడాలి. బంధువుల అండదండలుంటాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. శివనామస్మరణ మేలుచేస్తుంది

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)

శుభఫలితాలు ఉన్నాయి. అదృష్టకాలం. కార్యసిద్ధి విశేషంగా ఉంది. ఏకాగ్రతతో లక్ష్యాన్ని చేరుతారు. ఆచార సంప్రదాయాలకు పెద్దపీట వేస్తారు. మీ ప్రతిభకు గౌరవ సన్మానాలను పొందుతారు. మనోబలం కలదు. ఆదాయానికి తగ్గ వ్యయం ఉంటుంది. దైవబలం రక్షిస్తుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. కుటుంబ సహకారం లభిస్తుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేప్పుడు ధైర్యంగా వ్యవహరించాలి. సూర్య ఆరాధన మరింత శుభాన్ని ఇస్తుంది.

Credit : Eenadu

KEYWORDS : Horoscope, Weekly Horoscope, Favorate Horoscope, Horoscope PDF

Comments