Tirumala Darshan Information:

Tirumala News ***  ఓం నమో వేంకటేశాయ *** ***ప్రస్తుతం తిరుమలలో ఎటువంటి ఉచిత దర్శనం టికెట్స్ ఇవ్వడం లేదు . అందరు టికెట్ లేకుండా దర్శనం చేసుకోవచ్చు. ***సెప్టెంబర్ నెలకు-2022  శ్రీవారి సేవా ఎలక్ట్రానిక్ DIP రిజిస్ట్రేషన్లు 27.06.2022 10:00 PAM బుకింగ్ కోసం అందుబాటులో ఉంటాయి. ***సెప్టెంబర్ నెలకు -2022 శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్ల కోటా 27.06.2022 సాయంత్రం 04:00 గంటలకు అందుబాటులో ఉంటుంది. ***సీనియర్ సిటిజన్లు /ఫిజికల్లీ ఛాలెంజ్ టికెట్ కోటా జూలై-2022 కోసం, 28-06-2022 10:00 AM లోపు బుకింగ్ అందుబాటులో ఉంటుంది. ***తిరుమలలో సంపూర్ణ ప్లాస్టిక్‌ నిషేధం. ప్లాస్టిక్ బాటిళ్లు, బ్యాగులు, కవర్ల వినియోగాన్ని తిరుమలలో టీటీడీ పూర్తిగా నిషేధించింది. *** ఆన్లైన్ సేవ తీసుకున్నవారికి కూడా దర్శనం ఉంటుంది సేవ తో పాటు దర్శనం బుక్ చేస్కోవాలి .*** కళ్యాణం టికెట్స్ ఏ ఇద్దరైనా బుక్ చేస్కోవచ్చు దంపతులే కాకుండా   ఇద్దరు మగవాళ్ళు , ఇద్దరు ఆడవాళ్లు కూడా బుక్ చేస్కోవచ్చు . *** .****

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . ***షిర్డీ ఆలయం ఓపెన్ లోనే ఉంది . ఆన్ లైన్ లో టికెట్స్ బుక్ చేస్కుని దర్శనానికి వెళ్ళాలి . రామేశ్వరం లో బావుల్లో స్నానానికి అనుమతించడం లేదు తమిళనాడు లోని ఆలయాలకు ఆన్లైన్ బుకింగ్ అవసరం లేదు . అరుణాచలం దర్శనానికి ఆన్ లైన్ టికెట్ అవసరం లేదు నేరుగా వెళ్లి దర్శించవచ్చు గిరిప్రదక్షిణ కలదు .  . 

Manasa Sarovara Yatra Special Information | Kailash manasarovar


మానస సరోవరం:
2500 సంవత్సరాలు గా ఈ ప్రాంతం యాత్రా స్థలంగా ఉందని పురాణాలు సైతం చెబుతున్నాయి. మహా భారతం లోని అరణ్య పర్వంలో, రామాయణం లోని సుందరా కాండలో కైలాస మానస సరోవరం ప్రస్తావన వుంది. ఈ ప్రాంతం చైనాలోని టిబెట్ ప్రాంతంలో వుంది. 1962 వరకు ఎలాంటి వీసాలు లేకుండా ఈ ప్రాంతానికి వెళ్ళే వాళ్ళు. 1981 వరకు కైలాస మానస సరోవరం ప్రాంతానికి అనుమతి లేదు. ఆ తర్వాత చైనా వీసా తో పర్యటన కు అనుమతించారు. ఆల్మోరా మార్గం, బదరినాథ్ మార్గం లోని జోషి మఠం మార్గం లోనూ, కాశ్మీర్ లోయలో నుండి అనేక మార్గాలు ఉన్నా, నేపాలమీదుగా కైలాస మానస సరోవరం వెళ్లడం ఇటీవల ఎక్కువ సులభంగా ఉంది. ఇటీవల నాథులా పాస్ మీదుగా మరింత సులభంగా ఈ యాత్రకు వెళ్లే అవకాశం ప్రభుత్వం కలిగించింది. ప్రభుత్వం ద్వారా వెళ్లాలనుకుంటే ప్రభుత్వం పత్రికలలో ఇచ్చే ప్రకటన ను గమనించి అప్ప్లై చేసుకోవాలి. నేపాల్ మీద ప్రయాణానికి అనేక ప్రయివేటు ట్రావెల్ సంస్థలు ఉన్నాయి.

కొన్ని వేల ఏళ్ల నుంచి హిందువుల నమ్మకాలు ఇవి. అందుకే జీవితంలో ఒకసారైనా- మానస సరోవరంలో స్నానం చేయాలని.. కైలాస పర్వతాన్ని దగ్గరగా చూసి ప్రదక్షిణం చేయాలని కోట్లాది మంది భావిస్తూ ఉంటారు. కాని సముద్రమట్టానికి దాదాపు 15 వేల అడుగుల ఎత్తున ఉన్న మానస సరోవరాన్ని.. దానికి సమీపంలో ఉన్న కైలాస పర్వతాన్ని అధిరోహించటం అంత సులభం కాదు. అందుకే చాలా మందికి కైలాస యాత్ర ఒక కల. తీరని కోరిక.

బ్రహ్మపుత్ర, కర్ణాలి (గంగ), సింధు, సట్లజ్ నదులు మానస సరోవరం నుంచి పుట్టాయని భక్తుల భావన. అయితే దీనికి కచ్చితమైన ఆధారాలేమీ లేవు.
సాధారణంగా ఈ ప్రాంతంలోకి యాత్రికులను బౌద్ధ పూర్ణిమ నుంచి దీపావళి వరకు అనుమతిస్తారు. కొన్నిసార్లు వాతావరణాన్ని బట్టి ఇది మారుతుంది కూడా. ఆ కాలంలో కూడా ఉష్ణోగ్రత కొన్నిసార్లు మైనస్‌కి వెళ్లిపోతుంది.

భారత ప్రభుత్వం ఏడాదికి 750 మందిని మాత్రమే ఈ యాత్రకు పంపిస్తుంది. కొన్ని ప్రైవేటు సంస్థలు కూడా ఈ యాత్రను నిర్వహిస్తున్నాయి. వారు నేరుగా చైనా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుంటారు.

మానస సరోవర ప్రాంతంలో తెల్లవారు జాము రెండున్నర నుంచి నాలుగున్నర వరకూ ఆకాశంలో విచిత్రమైన కాంతి కనిపిస్తుంది. ఈ సమయంలో దేవతలు స్నానం చేయటానికి ఆ సరోవరానికి వస్తారనేది భక్తుల నమ్మకం. ఈ కాంతిని చూడటానికి భక్తులు ఆసక్తి చూపిస్తుంటారు.

కైలాస మానస సరోవరం యాత్రలో తీసు కోవాల్సిన జాగ్రత్తలు:
1. మీరు ఏ ట్రావెల్స్ ద్వారా వెళుతున్నారో వారు గతంలో నిర్వహించిన యాత్రలలో వెళ్లిన వారి ద్వారా వారి నిర్వహణ తెలుసుకొండి.

2. నేపాల్ చేరిన తర్వాత అక్కడి ట్రావెల్స్ కు, చైనా లో అక్కడి ట్రావెల్స్ కు బృందాలను అప్పగిస్తారు. కనుక చైనా చేరిన తర్వాత అద్భుత మైన సౌకర్యాలు, భోజన వసతుల గురించి ఎదురు చూడకండి. సర్దుకు పోవాలి.

3. అక్కడ ఆక్సిజన్ తక్కువ ఉంటుంది. కర్పూరం ముద్ద ఒక పలుచని గుడ్డ లో కట్టుకుని వాసన పీల్చుకోండి. ఆక్సిజన్ సిలెండర్ ఉంచుకుని అత్యవసర పరిస్థితుల్లో వాడండి.

4. మంచులో , పర్వత ప్రాంతాల్లో నడవడానికి అనువైన బూట్లు వాడండి. నీరు, మంచు బూట్ల లోపలికి వెళితే చాలా ప్రమాదం. వేగంగా నడవ కండి.

5. చలి తీవ్రత ఎక్కువగా ఉన్నపుడు స్నానం చేయకండి. మైనస్ ఉష్ణోగ్రత ఉన్నప్పుడు చల్ల నీటి స్నానం చాలా ప్రమాదం.

6.జీడిపప్పు, బాదంపప్పు, ఎండుద్రాక్ష,పిస్తాపప్పు,అత్తి పళ్ళు,అంజిర్, బిస్కట్లు మీవద్ద ఉంచుకొండి.

7.పర్వతారోహణ సమయంలో గొంతు తడారిపోతుంది. గ్లూకోజ్, ఎలాక్ట్రోల్ కలిపిన నీరు, నిమ్మ తొనలు ఉంచుకొండి.

8. ఆకలి కాకపోయినా పొద్దున్నే ఏదో ఒక ఆహారం తీసుకొండి.

9. చైనా పోలీసులు, మిలిటరీ వారిని ఫోటోలు, వీడియోలు తీయకండి.

10.ఇన్నర్లు, స్వెట్టర్లు, జాకెట్టు తప్పనిసరి.

కైలాస మానస సరోవరం నుండి ఏమి తెచ్చు కోవాలి?
1.మానస సరోవరం గడ్డ కట్టినపుడు చేపలు చనిపోయి, ఒడ్డుకు కొట్టుకు వస్తాయి. వాటిని అక్కడ దొరికే చెట్ల వేర్లను అమ్ముతారు. అవి తెచ్చుకొండి.

2. మానస సరోవరం జలాలు, గౌరీ కుండ్ జలాలు తెచ్చుకొండి.

3. మానస సరోవరం దగ్గర దొరికే లింగాకార రాళ్లు, ఓంరాళ్లు తెచ్చుకొండి.

4.సరోవరం తూర్పు వైపు యూదారంగు ఇసుకను తెచ్చుకొండి.

5.తీర్ధ పురి దగ్గర  వేడినీటి బుగ్గల సమీపంలో తెల్లని బూడిద లాంటి భస్మాన్ని తెచ్చుకొండి.

6.తీర్ధ పురి దగ్గరలోని సింధూర పర్వతం నుండి పసుపు రంగు లోని జిగురు మట్టి తెచ్చుకొండి

manasa sarovara yatra, bangalore to manasa sarovara, manasa sarovara yatra cost, manasasarovaram in guntur, manasasarovaram tourism, manasa sarovara yatra 2019, mansarovar yatra details in telugu, manasasarovaram images

Comments

Popular Posts