Drop Down Menus

List of Famous Temples in Anantapur District | Andhra Pradesh




1)పుట్టపర్తి :

ఈ పట్టణమునకు ముఖ్య ఆకర్షణ శ్రీ సత్య సాయిబాబా వారి ప్రశాంతి నిలయం ఆశ్రమము. ఈ ఆశ్రమము చూసేందుకు నిత్యం కొన్ని వేల నుంచి లక్షలలో అనేక దేశాల నుంచి భక్తులు విచ్చేస్తుంటారు.

పుట్టపర్తి నగరమునకు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వములచే బస్సులు నడపబడుచున్నాయి. ఈ నగరము అనంతపురమునకు 84 కి.మీ., హిందూపురమునకు 65 కి.మీ., బెంగుళూరుకు 156 కి.మీ., హైదరాబాదుకు 472 కి.మీ. దూరములో ఉంది. బెంగుళూరు నుండి బస్సులో రోడ్డు ప్రయాణం 3 గంటలు పడుతుంది. బెంగుళూరు నుండి సొంత వాహనము పై వచ్చేవారు జాతీయ రహదారి నం.7 (NH 7) మీద కోడూరు గ్రామం చేరుకుని, ఆంధ్రప్రదేశ్-కర్ణాటక సరిహద్దు వద్ద కుడి వైపునకు తిరిగి పుట్టపర్తి రోడ్డు గుండా వెళ్ళాలి.

పుట్టపర్తి నగరమునకు రైల్వే స్టేషను ఉంది. "శ్రీ సత్య సాయి ప్రశాంతి నిలయం" పేరిట దీనిని 23 నవంబరు 2000 నుండి ప్రారంభించారు. ఇది ఆశ్రమమునకు దాదాపుగా 8 కి.మీ. (5 మైళ్ళు) దూరములో ఉంది. ఇక్కడికి బెంగుళూరు, హైదరాబాదు, విశాఖపట్టణం, భువనేశ్వర్ , ముంబయి, కొత్త ఢిల్లీ మొదలగు పట్టణముల నుండి రైళ్ళు ఉన్నాయి. దీనికి 45 కి.మీ. (28 మైళ్ళు) దూరములో ఉన్న ధర్మవరం రైల్వేస్టేషను (రైలు కూడలి) నుండి, ఇండియాలో అన్ని ముఖ్య పట్టణములకు రైళ్ళు ఉన్నాయి. ధర్మవరం స్టేషను నుండి పుట్టపర్తి ఆశ్రమమునకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వముచే నడపబడుచున్న బస్సులు కూడా ఉన్నాయి

పుట్టపర్తి నగరములో శ్రీ సత్యసాయి విమానాశ్రయం ఉంది. ఇచ్చటి నుండి ముంబయి, చెన్నై పట్టణములకు హైదరాబాదు, విశాఖపట్టణం మీదుగా ఇండియన్ ఎయిర్లైన్స్ వారిచే నడుపబడుతున్న విమానములు ఉన్నాయి. ఈ విమానాశ్రయము ఆశ్రమమునకు 4 కి.మీ. (2.5 మైళ్ళు) దూరములో ఉంది. దీనికి 110 కి.మీ. (68 మైళ్ళు) దూరములో కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్టు వారు పుట్టపర్తి విమానాశ్రయ హక్కుదారులు. ఈ విమానాశ్రయ విస్థీర్ణము 450 ఎకరములు, రన్ వే పొడవు 2,230 మీ.పలు వార్తల ప్రకారం, ప్రస్తుతము ఈ విమానాశ్రయమును రూ. 600 కోట్లకు అమ్మకమునకు పెట్టారు.

2) లేపాక్షి :
లేపాక్షి హిందూపురం పట్టణం నుంచి 15 కి.మీ, దూరంలో ఉంటుంది. ఎంతో నైపున్యంగా శిల్పులు చెక్కిన ఆ అందమైన ప్రాణం పోసుకున్న ఆ శిల్పాలను చూస్తూ అక్కడే ఉండాలి అని అనిపించే చారిత్రక ఆలయం లేపాక్షి. ఈ ఆలయానికి ఎన్నో ప్రతేకతలు వున్నాయి.

లేపాక్షి దేవాలయమున చక్కని ఎరుపు, నీలిమ, పసుపుపచ్చ, ఆకుపచ్చ, నలుపు, తెలుపు లను ఉపయోగించి అబ్ధుతమగు చిత్రములు గీయించిరి. కృష్ణదేవరాయల కాలపు చిత్రలేఖనము యొక్క గొప్పదనము- అంటే లేపాక్షి చిత్రలేఖనపు గొప్పదనమును కూడా చూడవచ్చును. రావణాసురుడు మహాసాధ్వియగు సీతను అపహరించుకోని యా ప్రంతములో వేళ్ళుతూ వుంటే ఈ కూర్మ పర్వతము పైన జటాయువు అడ్డగిస్తుంది. రావణుడు ఆ పక్షి యొక్క రెక్కలు నరికివేయగ ఈ స్థలములో ఆ పక్షి పడిపోయింది. ఆ పిమ్మట సీతాన్వేషణలో ఈ స్థలమునకు వచ్చిన శ్రీరాముడు జటాయువును తిలకించి జరిగిన విషయమును పక్షి నుండి తెలుసుకోని తర్వాత ఆ జటాయువు పక్షికి మోక్షమిచ్చి ’లే-పక్షి’ అని ఉచ్చరిస్తాడు. లే-పక్షి అను కుదమే క్రమ క్రమముగా లేపాక్షి అయనట్లు ఇక్కడి ప్రజలు అంటున్నారు.

వీరభద్ర స్వామి దేవాలయం,లేపాక్షి :
వీరభద్రస్వామి దేవాలయం భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అనంతపురం జిల్లాలో లేపాక్షి వద్ద ఉంది. దీనిని 16వ శతాబ్దంలో నిర్మించబడింది. విజయనగర సామ్రాజ్యాధిపతుల నిర్మాణ శైలిలో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. నిర్మాణంలో ముఖ్య పాత్ర పోషించిన విశ్వకర్మ బ్రాహ్మణుల అద్భుతమైన కళా చాతుర్యానికి గొప్ప ఉదాహరణ ఈ ఆలయం. ఈ ఆలయం అధ్బుతమైన మండపాలతో అలాగే శిల్పకళా వైశిష్ట్యంతో అలరారుతూ ఉంటుంది. దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన ఈ ఆలయానికి ప్రతి సంవత్సరం దేశం నలుమూలల నుండి అనేకమైన భక్తులు తరలి వస్తుంటారు. ఈ ఆలయంలో కొలువై ఉన్న దేవుడు వీరభద్ర స్వామి. ఈ దేవాలయంలో ఫ్రెస్కో చిత్రాలలో కాంతివంతమైన రంగుల అలంకరణలతో కూడుకొని ఉన్న రాముడు మరియు కృష్ణుడు యొక్క పురాణ గాథలకు సంబంధించినవి ఉన్నాయి.

రోడ్డు మార్గం : హైదరాబాద్, అనంతపురం, బెంగళూరు తదితర ప్రాంతాల నుండి హిందూపూర్ కు బస్సులు కలవు. అక్కడి నుండి ఆర్టీసీ బస్సులలో, జీపులలో ప్రయాణించి లేపాక్షి వెళ్ళవచ్చు.

రైలు మార్గం : లేపాక్షి కి సమీపాన హిందూపూర్ రైల్వే స్టేషన్ కలదు. ఇక్కడికి హైదరాబాద్, బెంగళూరు తదితర ప్రాంతాల నుండి రైళ్ళు వస్తుంటాయి. హిందూపూర్ లో దిగి, అక్కడి నుండి ప్రభుత్వ బస్సులలో, జీపులలో లేపాక్షి చేరుకోవచ్చు.

వాయు మార్గం : బెంగళూరు లోని అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఉన్నది. క్యాబ్ లేదా టాక్సీ అద్దెకు తీసుకొని లేపాక్షి సులభంగా చేరుకోవచ్చు.

4) కదిరి :
కదిరి లక్ష్మినరసింహ స్వామి ఆలయం భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురంజిల్లాలో ఉంది.కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుపతిలో వేంచేసియున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయము తర్వాత అతి ప్రాచీనమైనదిగా శ్రీమత్ కదిరి లక్ష్మీనరసింహస్వామి వారి దేవాలయం ప్రసిద్ధిచెందింది. హిందూ పురాణాల ప్రకారం నరసింహ స్వామి హిరణ్యకశిపుని చంపడానికి కదిరి చెట్టు యొక్క మూలాల నుండి స్వయంభుగా ఉద్భవించారు. హిరణ్యకస్యపుని సంహరించిన అనంతరము ఉగ్రస్వరూపులైన శ్రీ నరసింహస్వామి వారిని కదిరి పట్టణమునందు గల "స్తోత్రాద్రి" పర్వతవము వద్ద ముక్కోటి దేవతలు, భక్తప్రహ్లదుడు శాంతియింపచేసిరి. అందువలన ఈ క్షేయత్రము ప్రహ్లద సమితి నరసింహస్వామి దేవాలయము వెలిసినది స్థలపురాణ ప్రకారం కదిరి పట్టణముకు ఆ పేరు వచ్చుటకు అనేక గాధలు ఉన్నవి.

ఈ ఆలయానికి చేరుకోవడానికి ఎపిఎస్‌ఆర్‌టిసి అందించే బస్సులు చాలా ఉన్నాయి మరియు ఇది అనంతపూర్ నుండి సమీపంలో ఉంది. అనంతపూర్ నుండి 90 కి.మీ. తిరుపతి నుండి 200 కి.మీ. వైయస్ఆర్ కదప నుండి 150 కి.మీ. ప్రధాన రైల్వే స్టేషన్ కదిరి. సమీప విమానాశ్రయాలు పుట్టపర్తి (40 కి.మీ). బెంగళూరు విమానాశ్రయం (130 కి.మీ).

5) తాడిపత్రి :
బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం అనంతపురం జిల్లా, తాడిపత్రిలో ఉన్న ఒక ప్రాచీన దేవాలయం. ఇందులో శివుడు రామలింగేశ్వర స్వామిగా కొలువై ఉన్నాడు. సూర్య చంద్రులు ఎలాగో భగవంతుడు ఒక్కడేనని ఆ భగవంతుడు శివుడేనని హిందువులు గట్టిగా నమ్ముతారు.  ఒక్కో ఆలయానానికి ఒక్కో చరిత్ర ఉంది. అన్ని ఆలయాల్లో ఒకటి అనంతపురం జిల్లా తాడిపత్రిలోని బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయం అత్యంత మహిమాన్వితమైనది. ఇక్కడ పెన్నానది తీరంలో త్రేతా యుగంలో శ్రీరామ చంద్రుడి చేతి ప్రతిష్టింపబడిన లింగం కావటం చేత రామలింగేశ్వరుడుగా పూజింపబడుతున్నాడు. భక్తుల నుండి పూజలందుకుంటున్న రామలింగేశ్వరుడి ప్రతిమ త్రేతాయుగం కాలం నాటిది. బ్రహ్మణుడైన రావణుడిని చంపడంల వల్ల వచ్చే పాపం నుండి విముక్తి కొరకు సాక్షాత్తు శ్రీరామ చంద్రుడే దేశంలో చాలా చోట్ల శివలిగాలను ప్రతిష్టించారు, అలా ప్రతిష్టింపబడిన శివలింగాలలో ఇది కూడా ఒకటని ఆలయ పూజారులు కథనం. భక్తులు గర్భగుడిలోని ఆ పరమేశ్వరుడిరి దర్శించినప్పుడు ఎంతటి భక్తి పారవశ్యానికి లోనవుతారో అలాగే ఆలయ గోడల మీదున్న ఈ శిల్పాలకు అంతే మంత్రముగ్ధులవుతారు. రామాచారి అనే శిల్పకారుడు సుమారు 650 మంది సహాయంతో కొన్ని సంవత్సరాల పాటు కష్టపడి ఈ ఆలయాన్ని నిర్మించారు.

అనంతపురంకు 57కిలోమీటర్ల దూరంలో కర్నూలు, కడప జిల్లాల సరిహద్దులకు దగ్గరగా తాడిపత్రి ఉంది.  తాడిపత్రి రైల్వే స్టేషన్ నుండి 4 కిలోమీటర్ల దూరంలో, అనంతపురం నుండి 58 కిలోమీటర్లు, కడప నుండి 107 కిలోమీటర్లు, హైదరాబాద్ నుండి 357 కిలోమీటర్లు, విజయవాడ నుండి 413 కిలోమీటర్లు మరియు బెంగళూరుకు 269 కిలోమీటర్ల దూరంలో బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం తడిపత్రిలోని పెన్నా నది ఒడ్డున ఉంది.

6) పెన్న అహోబిళం :
శ్రీ నరసింహస్వామి కొలువుదీరిన ప్రాచీన పుణ్యక్షేత్రం ఇక్కడ ఉంది. ఇక్కడ స్వామివారి పాదంక్రింద ఒక బిలం ఉంది. స్వామివారికి అభిషేకం చేసిన నీరు, ఈ బిలం గుండా వెళ్ళి పెన్నా నదిలో కలుస్తుంది. అందువలన ఈ క్షేత్రానికి "పెన్న అహోబిలం" అను పేరు వచ్చిందని స్థలపురాణ కథనం. స్వామివారి కుడి పాద ముద్రికకు నిత్యపూజలు: ద్వాపర యుగంలో ఉద్ధాలక మహర్షి క్షేత్రగిరిపై ఘోర తపస్సు చేయగా స్వామి ప్రసన్నుడై తన కుడిపాద ముద్రికను గిరిపై అలాగే కర్నూలుజిల్లా అహోబిల క్షేత్రంలో ఎడమ పాదాన్ని ప్రతిష్ఠించినట్లు ఇక్కడి శాసనాలు, స్థల, పద్మపురాణాలను బట్టి తెలుస్తోంది.

లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో ఉంది. ఇది నంద్యాల్ నుండి 220 కిలోమీటర్ల దూరంలో మరియు జిల్లా ప్రధాన కార్యాలయం కర్నూలు నుండి 185 కిలోమీటర్ల దూరంలో ఉంది, భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ లోని అనంతపూర్ నుండి 41 కిలోమీటర్ల దూరంలో ఉంది మరియు 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఉరవకొండ నుండి.

     

anantapur temples list, anantapur places to visit images, anantapur famous for, parks in anantapur, hill station near anantapur, anantapur district andhra pradesh famous, places near penugonda, anantapur
ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

ఎక్కువమంది చదివినవి

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.