Drop Down Menus

List of Famous Temples Kadapa District | Andhra Pradesh

కోదండ రామాలయం, ఒంటిమిట్ట :
పుణ్యక్షేత్రమైన ఒంటిమిట్టలోని కోదండ రామాలయం ప్రాచీనమైన మరియు విశిష్టమైన హిందూ దేవాలయం. ఇక్కడి మూలమూర్తులు కోదండరాముడు, సీతాదేవి, లక్ష్మణస్వామి. ఇక్కడ ఉన్న కోదండ రామాలయంలోని విగ్రహాన్ని జాంబవంతుడు ప్రతిష్ఠించాడు. ఒకే శిలలో శ్రీరాముని, సీతను, లక్ష్మణుని ఇక్కడ చూడవచ్చు. ఈ దేవాలయంలో శ్రీరామ తీర్థము ఉంది. సీత కోరికపై శ్రీ రాముడు రామ బాణంతో పాతాళ గంగను పైకి తెచ్చాడని స్థల పురాణంలో వివరించబడింది. రామ లక్ష్మణులు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు, విశ్వామిత్రుడు వారిని తమ యాగరక్షణకు తీసుకున్నాడని తెలిసిందే. కానీ సీతారామ కల్యాణం జరిగాక కూడా, అలాంటి సందర్భమే ఒకటి ఏర్పడింది. అప్పుడు మృకండు మహర్షి, శృంగి మహర్షి రాముని ప్రార్థించడంతో దుష్టశిక్షణ కోసం, ఆ స్వామి సీతా లక్ష్మణ సమేతుడై అంబుల పొది, పిడిబాకు, కోదండం, పట్టుకుని ఈ ప్రాంతానికి వచ్చి యాగ రక్షణ చేశాడని పురాణం చెబుతుంది. అందుకు ప్రతిగా ఆ మహర్షులు సీతారామ లక్ష్మణుల విగ్రహాలను ఏకశిలగా చెక్కించారనీ, తరువాత జాంబవంతుడు ఈ విగ్రహాలను ప్రాణప్రతిష్ఠ చేశారనీ ఇక్కడ ప్రజల విశ్వాసం.

కడప-తిరుపతి రహదారిపై ఉంది. కడపనుంచి 26 కి.మీ.దూరం ప్రయాణిస్తే ఆలయానికి చేరుకోవచ్చు.
రైలులో రాజంపేట రైల్వేస్టేషన్‌లో దిగి బస్సులో దిగి చేరుకునే సౌలభ్యముంది.
కడప రైల్వేస్టేషన్‌లో కూడా రైలు దిగి బస్సు లేదా ఇతర వాహనాల్లో చేరుకునే సౌలభ్యముంది.
తిరుపతి విమానాశ్రయం 100 కి.మీ.దూరంలోవుంది.

తాళ్ళపాక చెన్న కేశవ మూర్తి :
శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయం తల్లాపాక తిరుపతి నుండి 100 కిలోమీటర్లు, రాజంపేట నుండి 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. తల్లాపాకా గొప్ప కవి శ్రీ అన్నామాచార్య జన్మస్థలం (1408 1503). పురాణాల ప్రకారం, ఈ ఆలయాన్ని మట్టి రాజా నిర్మించారు మరియు ఇది 1000 సంవత్సరాల పురాతన ఆలయం. అన్నమాచార్య జన్మస్థలం గుర్తుగా, 108 అడుగుల (33 మీటరు) ఎత్తైన అన్నమయ్య విగ్రహాన్ని నిర్మించారు

కడప నుండి 1.5 గంటల ప్రయాణం. ప్రతి 15 నిమిషాలకు ప్రత్యక్ష బస్సులు అందుబాటులో ఉన్నాయి. తిరుపతి నుండి 93 కి.మీ, రోడ్డు ద్వారా 1 గంట 50 నిమిషాలు.

అత్తిరాల శ్రీ పరశురామ ఆలయం :
మహా భారత పురాణంలో పేర్కొన్న క్షేత్రం. సుమారు వెయ్యేళ్ళ చరిత్రను సొంతం చేసుకొన్న ప్రాంతం. సత్య యుగంలో లో శ్రీమన్నారాయణుని ఆరో అవతారమైన శ్రీ పరశురాముడు, ఇరవై ఒక్క మార్లు భూమండలంలో జరిపిన రక్త పాతం వలన సంక్రమించిన పాపంతో ఆయన గొడ్డలి హస్తానికి అంటుకొని రాలేదు. మహేశ్వరుని ఆజ్ఞ మేరకు పుణ్య నదులలో స్నానమాడుతూ, క్షేత్ర దర్శనం చేస్తూ ఇక్కడికి వచ్చారు. బహుదా నదిలో స్నానమచారించగానే పరుశువు రాలి క్రింద పడిపోయింది. అలా పరశురామునికి చుట్టుకొన్న హత్య పాపం రాలిపోవడంతో "హత్యరాల" అన్న పేరొచ్చింది. అదే నేడు వాడుకలో "అత్తిరాల" గా పిలవబడుతోంది.

మన రాష్ట్రంలోని  ఒకే ఒక్క  ఆలయం ఉన్న ఈ పరశురామ క్షేత్రాన్ని ప్రచారంలోనికి తీసుకురావలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇంతటి ప్రాధాన్యతలకు నిలయమైన అత్తిరాల కడప జిల్లా రాజంపేటకు అయిదు కిలో మీటర్ల దూరంలో ఉన్నది.
రాజంపేటకు రాష్ట్రంలోని అన్ని నగరాల నుండి బస్సు సౌకర్యం కలదు. సందర్శకులకు కావలసిన  వసతి, భోజనాలు రాజంపేటలో లభిస్తాయి.  తిరుపతి నుండి కూడా సులభంగా రాజంపేట చేరవచ్చును.

గండికోట :
క్రీ.శ.1557 నాటి శాసనంలో రంగనాథాలయం గురించిన విషయాలు పొందుపరచబడి వున్నాయి. ఆ శాసనంలో గుడికి భూమిని మాన్యంగా ఇచ్చినట్లు తెలుపుతుంది. ఈ ఆలయనిర్మాణశైలిని బట్టి చూస్తే రంగనాథాలయం నూటికి నూరు పాళ్ళూ విజయనగర రాజుల నిర్మాణం అని తెలుస్తుంది. ఈ ఆధారాలను బట్టి ఈ ఆలయాన్ని క్రీ.శ.15వ శతాబ్దంలో నిర్మించినట్లు చెప్పవచ్చు.

మాధవరాయ ఆలయం ఈ ఆలయం గురించిన మొట్టమొదటి ప్రస్తావన క్రీ.శ. 16 వ శతాబ్దానికి చెందిన శాసనాలలో కనిపిస్తుంది. ఆలయ నిర్మాణాన్ని బట్టి దాదాపుగా 1501-1525 మధ్యకాలంలో నిర్మించినట్లు చెప్పవచ్చు. చాళుక్యులు, విజయనగరరాజులు, పెమ్మసాని నాయకులు వంటి రాజుల పాలనలో గండి కోట చారిత్రక కట్టడాలు వారి జీవన శైలిని తెలుపుతాయి.

గండికోటకు 15 కిలోమీటర్ల దూరంలో జమ్మల మడుగు రైల్వే స్టేషన్ కలదు. రోడ్డు మార్గం : హైదరాబాద్ నుండి సొంత వాహనం మీద వచ్చేవారు ఎన్ హెచ్ 7 మీదుగా కర్నూల్ చేరుకొని, అక్కడి నుండి బనగానపల్లె -కోవెలకుంట్ల -జమ్మలమడుగు గండికోట చేరుకోవచ్చు.

దేవుని కడప :
ఇక్కడ ఉన్న శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరాలయం మూలంగా ఈ ప్రాంతానికి దేవుని కడప అని పేరు వచ్చింది. దేవుని కడప క్షేత్రం తిరుమలకు తొలిగడపగా ప్రసిద్ధిగాంచింది. దక్షిణ ప్రాంత యాత్రికులు కాశీ వెళ్ళడానికి ఉత్తర భారతదేశ యాత్రికులు రామేశ్వరం వెళ్ళడానికి తిరుమల వేంకటేశ్వరుని వద్దకు కాలిబాటన వెళ్ళేవారికి కడపే ప్రధాన మార్గం. ఈ కారణంగా మూడుచోట్లకు వెళ్ళే భక్తులు కచ్చితంగా ఇక్కడ మొదటిగా శ్రీ లక్ష్మీప్రసన్న వేంకటేశ్వరుణ్ణి, సోమేశ్వర స్వామిని దర్శించుకుని అనంతరం మూడు క్షేత్రాలకు వెళ్ళేవారు. ఇందువల్లనే మూడు క్షేత్రాల తొలి గడపగా దేవుని కడప ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయానికున్న మరో విశిష్టత మతసామరస్యం. ఉగాదినాడు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే ముస్లిం సోదరులు స్వామి వారిని దర్శించుకోవడం కనిపిస్తుంది. వారితో పాటు జైనులు కూడా వస్తుంటారు. రథసప్తమి రోజు జనసందోహం మధ్య స్వామి రథాన్ని కులమతాలకతీతంగా లాగడం మతసామరస్యానికి నిదర్శనం.

దేవుని కడప ఆలయానికి సమీప రైల్వే స్టేషన్ 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న కదపా రైల్వే స్టేషన్. ఇక్కడి నుండి తరచూ బస్సు మరియు ఆటో సేవలు దేవుని కడప ఆలయానికి అందుబాటులో ఉన్నాయి. విమానంలో: దేవుని కడప ఆలయానికి సమీప విమానాశ్రయం తిరుపతి విమానాశ్రయం, ఇది 138 కిలోమీటర్ల దూరంలో ఉంది.

నందలూరు :
నందలూరు గురించి యాత్రాచరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య తన కాశీయాత్రాచరిత్రలో పలు విశేషాలు నమోదుచేశారు. 1830నాటికి ఈ గ్రామం పుణ్యక్షేత్రంగా పేరొందింది.  1వ శతాబ్దంలో చోళవంశరాజులచే నిర్మించబడిన ఆలయం. సంతాన సౌమ్యనాథునిగా, వీసాల సౌమ్యనాథునిగా ప్రసిద్ధికెక్కాడు. ఆలయం చుట్టూ 9 ప్రదక్షిణలు చేసి, కోర్కెను మొక్కుకుని, 108 ప్రదక్షిణలుచేస్తే, నెరవేరుతుందని భక్తుల నమ్మకం. ఆలయానికి జిల్లా నలుమూలల నుండియేగాక, తమిళనాడు, కర్నాటక తదితర ప్రాంతాలనుండి గూడా భక్తులు అధిక సంఖ్యలో విచ్చేస్తారు. ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో బ్రహ్మోత్సవాలు జరుపుతారు. ఈ బ్రహ్మోత్సవాలలో ప్రతి రోజూ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.

శ్రీ సౌమ్యనాథ స్వామి ఆలయం నందలూర్ కడప జిల్లాలో ఉంది. ఈ ఆలయాన్ని 11 వ శతాబ్దంలో నిర్మించారు. ఆలయ సమయాలు: ఉదయం 6.00 నుండి 11.00 వరకు.
సాయంత్రం 4.00 నుండి రాత్రి 8.00 వరకు. ఆలయానికి ఎలా చేరుకోవాలి: కడప నుండి 44 కి.
రాజంపేట నుండి 11 కి. దేవాలయాల దగ్గర: తల్లాపాక శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయం - 9 కి.మీ.

పుష్పగిరి :
అనేక శైవవైష్ణవాలయముల సముదాయము పుష్పగిరి. పుష్పగిరి ఆలయ సముదాయము గురించి అతి విలువైన చారిత్రిక ఆధారాలు, చరిత్ర ఉన్నది. పుష్పగిరి గురించిన మొట్టమొదటి ప్రస్తావన స్కంద పురాణములోని శ్రీశైలఖండములో ఉన్నది. వైద్యనాథస్వామి దేవస్థానము ఒక్క అద్భుతమైన శిల్పకళా విశేషము. ఇందులో లెక్కకు మీరి దేవతామూర్తి ప్రతిమలు ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యముగా కామాక్షి అమ్మవారి గుడిలోని శ్రీచక్రము ఒక విశేషము. దేవస్థానములో రెండు గర్భగృహములున్నవి. ఒకటి స్వామివారికి కాగా రెండవది అమ్మవారిది. చుట్టూ ఉన్న అనేక దేవతాప్రతిమలు ఇప్పుడు భారతీయ పురాతత్వ శాఖ పర్యవేక్షణలో ఉన్నాయి.పుష్పగిరి ఆలయముల సముదాయము ఆంధ్రప్రదేశములోని కడప జిల్లా, చెన్నూరు మండలములోని పుష్పగిరి గ్రామమునందు కలదు.

కడప నుండి 24 కి.మీ; తిరుపతి నుండి కడప వరకు రైళ్లు అందుబాటులో ఉన్నాయి; రోడ్డు మార్గం, తిరుపతి నుండి 3 గంటలు పడుతుంది.

వెల్లాల :
వెల్లాలలో చెన్నకేశవస్వామి, భీమలింగేశ్వరస్వామి, లక్ష్మీనృసింహస్వామి దేవాలయాలున్నాయి. శైవ వైష్ణవభేదాలు లేకుండా సాగిన గ్రామమిది. ఇందరు దేవతలు కొలువుదీరినా ఇక్కడ సంజీవరాయనికున్న వైభవం గొప్పది. సంజీవరాయడు అంటే ఆంజనేయస్వామి. సంజీవని కోసం వెళ్తున్న ఆంజనేయుడు ఇక్కడ ఆగి కుందూ నది సమీపంలో ఒక గుండంలో స్నానం చేశాడు. సూర్యునికి నమస్కారం చేసుకున్నాడు. ఆ గుండానికి హనుమంతు గుండం అని పేరు వచ్చింది. సంజీవని కోసం వెళ్తున్న స్వామి కాబట్టి సంజీవరాయడుగా ఇక్కడ కొలువుదీరాడు. గుండం దగ్గర రాతి మీద స్వామి పాదముద్రలున్నాయి. గ్రహదోషాలు తొలగిస్తాడని, వ్యాధి బాధలు దూరం చేస్తాడని ఇంకా ఎన్నెన్నో ఆశలతో ఈ స్వామిని సేవిస్తారు. వెల్లాల వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు సమీపంలోని రాజుపాలెం మండలంలో ఉంది.

రైల్వే స్టేషన్. కర్నూలు, బస్ స్టేషన్.కూర్నూల్, ప్రొడత్తూర్. బస్సులు బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ నుండి కర్నూలుకు అందుబాటులో ఉన్నాయి. ఈ గ్రామానికి సమీప ప్రసిద్ధ ప్రదేశం ప్రొడతూర్ మరియు దాదాపు ఇరవై మూడు కిలో మీటర్లు. [కడప - కర్నూలు మార్గంలో] చాగలమరి నుండి ఈ గ్రామానికి చేరుకోవచ్చు మరియు చాగలమరి నుండి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది.

పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి :
బ్రహ్మం గారు సాక్షాత్ దైవ స్వరూపుడు. రాబోయే కాలంలో జరగబోయే విపత్తుల గురించి తన కాలజ్ఞానంలో సుస్పష్టంగా వివరించి, జనులందరిని సన్మార్గంలో నడువమని బోధించిన మహిమాన్వితుడు. పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ( 1608-1693) 17వ శతాబ్దములో కాలజ్ఞాన తత్వాలను బోధించిన యోగి, హేతువాది, సంఘ సంస్కర్త. సాక్షాత్ దైవ స్వరూపుడు. బ్రహ్మం గారు తన కాలజ్ఞానములో భవిష్యత్తు గురించి చెప్పిన చాలా విషయాలు నిజమయ్యాయి. శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి, వైఎస్ఆర్ కడప జిల్లా లోని కందిమల్లాయపల్లిలో చాలాకాలం నివసించి సజీవ సమాధి నిష్ఠనొందాడు. వీరబ్రహ్మము వలన ప్రసిధ్ది పొందుట చేత కందిమల్లాయపల్లె తర్వాతి కాలములో బ్రహ్మంగారిమఠంగా ప్రసిద్ధి చెందింది. ప్రపంచంలో ఏ వింత జరిగిన ఇది బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో ఆనాడే చెప్పారు అంటూ ప్రజలు గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటారు. కాలజ్ఞానంలో చెప్పినవన్నీ పొల్లు పోకుండా ఇప్పటివరకు జరిగాయి. జరుగుతున్నాయి.

కదప నుండి కందిమల్లయపల్లె వరకు మైదుకూర్ మీదుగా వెళ్ళే మార్గం. మైదుకూర్ నుండి, మాతం & nbsp; 37 కి.మీ. బ్రహ్మగారి మాతం సమీప రైల్వే స్టేషన్ కడప వద్ద ఉంది. సమీప విమానాశ్రయం రెనిగుంట విమానాశ్రయం. కడప నుండి 62.6 కిలోమీటర్ల దూరంలో, కడప బస్ స్టేషన్ నుండి బ్రహ్మగారి మాతం వరకు ప్రత్యక్ష బస్సు అందుబాటులో ఉంది. రోడ్డు మార్గంలో 1 గంట పడుతుంది. తిరుపతి నుండి 230 కి.మీ., ఈ ప్రదేశానికి చేరుకోవడానికి రోడ్డు మార్గంలో 4 గంటలు పడుతుంది.

                         
tourist places in kadapa district, tourist places near proddatur, kadapa temples list, tourist places in rayalaseema, how to develop kadapa tourism, tourist places near jammalamadugu, kadapa famous food, famous shiva temples in kadapa district
ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.