Drop Down Menus

List of Famous Temples Kurnool District | Andhra Pradesh

శ్రీశైలం :
హరహర మహదేవ శంభో శంకరా అంటూ భక్తుల గొంతులతో మారుమ్రోగుతూ నల్లమల అడవులలో కొండగుట్టలమధ్య గల శ్రీ మల్లికార్జునుని పవిత్ర క్షేత్రము. మెలికలు తిరుగుతూ, లోయలు దాటుతూ దట్టమైన అరణ్యాల మధ్య భక్తజనులను బ్రోచేందుకు వెలసిన పరమేశ్వరుని దివ్యధామం అయిన శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగాల లో ఒకటి.

హైదరాబాదు నుండి శ్రీశైలం 212 కి.మీ. దూరంలో ఉంది.ఈ రోడ్డు అటవీ ప్రాంతం గుండా పోతుంది. అటవీశాఖ వారు రాత్రి వేళల్లో ఈ ప్రాంతం గుండా ప్రయాణించటానికి అనుమతించరు కనుక పగటి వేళ మాత్రమే ప్రయాణించాలి. గుంటూరు నుండి శ్రీశైలం 225 కి.మీ. దూరంలో ఉంది. గుంటూరు నుండి నరసరావుపేట, వినుకొండ మీదుగా వచ్చే ఈ మార్గం దోర్నాల వద్ద కర్నూలు రోడ్డుతో కలుస్తుంది. అక్కడి నుండి శ్రీశైలంకు కొండ మార్గంలో ప్రయాణం (53 కి.మీ.) కొండల మధ్యగా చాలా బాగుంటుంది. భారతదేశములో ఏవైపునుండి అయినా గుంటూరు మీదుగా నరసరావుపేట వరకూ రైలు సౌకర్యములు కలవు. హైదరాబాద్ నుండి విజయవాడ లేదా గుంటూరు వరకూ మైనర్ ఎయిర్ పోర్టులద్వారా చేరుకొని అటుపై బస్సు ద్వారా చేరవచ్చు.

మహానంది:
ఇక్కడ గల స్వామి మహానందీశ్వరుడు, అమ్మవారు కామేశ్వరీ దేవి. ఇక్కడి మహానందీశ్వర దేవాలయం 7వ శతాబ్దినాటిది. ఈ ఆలయ శిల్పశైలిని బట్టి ఇది బాదామి చాళుక్య చక్రవర్తి వినయాదిత్యుని పాలనాకాలం (680-696) నాటిదని అంచనా. ఇచ్చట గల శివలింగము ఎత్తుగా కాక కొంచెము తప్పటగ వుంటుంది. పుట్టలో గల స్వామివారికి ఆవు పాలు ఇస్తుండగా కోపించిన యజమాని ఆవుని కొట్టగా పుట్టలో గల స్వామివారిని ఆవు తొక్కుట వలన లింగము కొంచెము అణిగివుంటుంది. ఆవు గిట్ట గుర్తు లింగముపై వుంటుంది. ఇచ్చట శుద్ధ స్ఫటిక వర్ణంలో కనిపించే జలం జలజలా ప్రవహించే దృశ్యం మహానంది ప్రత్యేకత. ఈ పుష్కరిణిలు విశ్వబ్రాహ్మణ శిల్పుల యొక్క పనితనాన్ని తెలియచేస్తుంది.

మహానంది నంద్యాల్ నుండి 21 కి. సమీప విమానాశ్రయం హైదరాబాద్ వద్ద ఉంది, ఇది కర్నూలు నుండి 215 కిలోమీటర్ల దూరంలో ఉంది మరియు సమీప రైల్వే స్టేషన్ నంద్యాల్ వద్ద ఉంది. నంద్యాల్ పట్టణం నుండి మహానంది చేరుకోవడానికి 2 మార్గాలు ఉన్నాయి. తిమ్మపురం మీదుగా ఒక మార్గం మరియు బస్ స్టాండ్ నుండి 17 కి.మీ.

అహోబిలం :
అహో అంటే ఒక గొప్ప ప్రశంస.బిలం అంటే బలం అని చెపుతారు.కనుక అహోబిలం అంటే గొప్పదైన బలం అని చెప్పాలి. పురాణాల మేరకు శ్రీమహావిష్ణువు రాక్షసుల రాజైన హిరణ్యకశికుడ్నిసంహరించేందుకు సగం మనిషిగానూ, సగం సింహ రూపంలోనూ అవతరించినది ఈ ప్రదేశంలోనే అని చెబుతారు. విష్ణువు యొక్క ఈ భయంకరమైన రూపంచూసిన సకలదేవతలు ఆయన గురించి అహో! ఎంత బలవంతుడు అని కీర్తించినారట. ప్రస్తుతం అహోబిలం క్షేత్రం సీమాంధ్రలోని కర్నూలు జిల్లాలో ఆళ్లగడ్డమండలంలో కలదు.

చెన్నై-బొంబాయి రైల్వేమార్గములో గల కడప స్టేషన్‌లోదిగి అక్కడ నుండి బస్‌లో 90 కి.మీ.దూరంలోని ఆర్లగడ్డ" అనే చోటదిగి అక్కడ నుండి వేరుబస్‌లో 25 కి.మీ. దూరంలో ఈ క్షేత్రము చేరవచ్చును. నంద్యాల నుండి 45 కి.మీ. బస్ సౌకర్యం ఉంది. అన్నివసతులు ఉన్నాయి. హైదరాబాదు నుండి అహోబిలం వెళ్ళేందుకు రోడ్డు సౌకర్యం ఉంది.కడప. తిరుపతి నుండి వచ్చువారు, చాగలమర్రి నుంచి ముత్యాలపాడు, క్రిశ్నాపురం, బాచేపల్లి మీదుగ కూడా అహోబిలం చేరుకోవచ్చు.

మంత్రాలయం :
మంత్రాలయం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాకు చెందిన పట్టణం.  మధ్వాచార్యుల పరంపరలో ధృవనక్షత్ర సమానమైన రాఘవేంద్రస్వామివారి పుణ్యక్షేత్రం మంత్రాలయం తుంగభద్రా నదీతీరంలో ఉంది. ఇది రాఘవేంద్రస్వామి యొక్క అతి ప్రసిద్దమైన పుణ్యక్షేత్రం. రాఘవేంద్రస్వామి దర్శనానంతరం భక్తులకు ప్రత్యేకంగా పరిమళ ప్రసాదం అందిస్తారు. రూ. 20కి 4 ముక్కలు ఇస్తారు. ఇది ఇక్కడి ప్రత్యేక ప్రసాదం.

మంత్రాలయంకు సొంత రైల్వే స్టేషన్, ముంబై-చెన్నై మార్గంలో మంత్రాలయం రోడ్ (16 కి.మీ) ఉంది, దేశంలోని ప్రధాన నగరాల నుండి మంత్రాలయంకు రైళ్లు ఉన్నాయి. స్టేషన్ నుండి మంత్రాలయం చేరుకోవడానికి టాక్సీ / క్యాబ్‌లు, బస్సులు అందుబాటులో ఉన్నాయి.

యాగంటి :
యాగంటి ఆలయంలోని నంది విగ్రహానికి "యాగంటి బసవన్న" అని పేరు. ఈ విగ్రహం అంతకంతకూ పెరుగతూవుంటుందని, కలియుగం అంతమయ్యేనాటికి లేచి రంకె వేస్తుందని వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానంలో వర్ణించారు. అగస్త్యమహర్షి శాపం వల్ల ఈ గ్రామంలో కాకులు ఉండవని ప్రతీతి. కర్నూలు జిల్లాలో బ్రహ్మం గారు నివసించిన బనగానపల్లి గ్రామానికి సమీపంలో ఉన్న పుణ్యక్షేత్రమే యాగంటి. ఆహ్లాదకరమైన ప్రకృతి సౌందర్యంతో పరవశింపచేసే పుణ్యక్షేత్రాలలో యాగంటి ఒకటి. యాగంటి గ్రామంలో ఉమామహేశ్వర స్వామి ఆలయం నెలకొనివుంది. సమీపంలోని కొండ గుహ ఒకదానిలో వేంకటేశ్వరస్వామి విగ్రహం ఉంది. ఇక యాగంటిలో కాకి కనిపించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

హైదరాబాద్ - రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (290 కి.మీ) హైదరాబాద్‌కు ప్రత్యక్ష విమానాలు. నంద్యాల్ రైల్వే స్టేషన్ (55 కి.మీ) నంద్యాల్‌కు ప్రత్యక్ష రైళ్లు. యాగంటి బస్ స్టాండ్ (0 కి.మీ) బనగనపల్లె (11 కి.మీ) యాగంటికి ప్రత్యక్ష బస్సులు.

ఉరుకుంద :
ఉరుకుంద ఈరన్న స్వామి భక్తులపాలిట నిజంగా కొంగుబంగారమే! కోరిన వెంటనే భక్తుల కోర్కెలను తీర్చే దేవుడిగా ఈరన్న స్వామికి పేరు. స్వామివారికి ఎంతో ఇష్టమైన సోమ, గురువారాలలో భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. శ్రావణమాసం 3 వ సోమవారం నాడు ఏకంగా పాతిక లక్షల పైబడి భక్తులు దర్శించుకుంటారంటే అతిశయోక్తి కాదేమో ! అదొక్కరోజే స్వామివారి హుండీ 2 కోట్లు దాటుతుంది.

కౌతాళం మండలానికి కేవలం 6 km ల దూరంలో ఉన్న ఈరన్న స్వామి (నరసింహ స్వామి) కి నిర్దిష్ట ఆకారం అంటూ లేదు. ఈయనొక సిద్ధ పురుషుడని, యోగి అని, దేవదూత అని స్థానికులు చెబుతారు. బాలబ్రహ్మచారిగా స్వామి వారు అశ్వద్ధ వృక్షం కింద కూర్చొని తపస్సు చేసేవాడని సమాధి ముద్రలో నరసింహస్వామిని కీర్తిస్తూ గడిపేవారని అంటారు. నిరాకారుడైన స్వామి అశ్వద్ధ వృక్ష స్వరూపుడిగా పూజలు అందుకుంటున్నాడు.

కోసిగి రైల్వే స్టేషన్, కుప్గల్ రైల్వే స్టేషన్ ఉరుకుండకు చాలా దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్లు. పట్టణం అడోని దగ్గర నుండి రైల్వే స్టేషన్లను కూడా మీరు పరిగణించవచ్చు. అడోని రైల్వే స్టేషన్, ఇసివి రైల్ వే స్టేషన్ అడోనికి సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్లు. మీరు అడోని నుండి ఉరుకుండ వరకు రహదారి ద్వారా చేరుకోవచ్చు.

రణమండల వీరాంజనేయస్వామి ఆలయం :
కొండపైనున్న శ్రీరణమండల వీరాంజనేయస్వామివారి ఆలయాన్ని చేరుకునేందుకు సుమారు 600 మెట్లను ఎక్కాల్సి ఉంటుంది. అలా మెట్లెక్కుతున్నప్పుడు శివలింగానికి ప్రక్కనే నందీశ్వరుని దర్శించుకోగలం. అలా మెట్లెక్కుతూ ఇంకొంచెం దూరం పైకెలితే, ఓ చిన్న ఆలయంలో సంతాన ఆంజనేయస్వామి దర్శనమిస్తాడు. ఈ స్వామిని మ్రొక్కుకుంటే సంతానప్రాప్తి లేనివారికి సంతానం కలుగుతుందని భక్తజనుల విశ్వాసం. ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో శ్రీరణమండలవీరాంజనేయస్వామివారికి ఉత్సవాలు జరుగుతూంటాయి. శ్రావణమాసం ప్రారంభమైనది మొదలు మండలకాలంపాటు స్వామివారికి విశేషంగా అభిషేకాలు, ఆకు పూజలు జరుగుతూంటాయి. ప్రతి శనివారం విశేషపూజలు జరుగుతాయి.

ఆదోనికి అన్ని నగరాల నుంచి బస్సుల ద్వారా చేరుకోవచ్చు. ఆదోనికి దగ్గరలోనున్న రైల్వేస్టేషన్ మంత్రాలయం రోడ్డు. మంత్రాలయం దర్శించుకునే భక్తులు ఆదోని శ్రీరణమండల వీరాంజనేయస్వామిని దర్శించుకుంటుంటారు.

కొలను భారతి - సరస్వతి దేవాలయం :
ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు పిల్లలకు అక్షరాభ్యాసం చేయించాలంటే బాసర వెళ్ళి వచ్చేవారు. కానీ ఇప్పుడు బాసర తెలంగాణ రాష్ట్రంలో ఉండిపోయింది. ఎంతైనా రాష్ట్రాలు విడిపోయాయి కదా !! అంతదూరం వెళ్ళాలా అని కొంతమందికి అనిపించవచ్చు. అలాంటి వారికి 'ఆంధ్ర బాసర' గా వెలుగొందుతున్నది కొలను భారతి. ఇది ఆంధ్ర ప్రదేశ్ లో పేరుగాంచిన సరస్వతి దేవి దేవాలయం. సరస్వతీదేవి యొక్క ద్వాదశ నామ స్తోత్రములలో మొదటి నామము ఐన శ్రీ భారతి పేరుతో వెలసిన క్షేత్రమే కొలను భారతి క్షేత్రము.

కొలను భారతి నుండి ఆత్మకూరు - 20 KM, శ్రీశైలం - 130 KM, కర్నూలు - 88 KM, నంద్యాల - 70 KM, హైదరాబాద్- 300 KM, విజయవాడ - 293 KM.

సంగమేశ్వర దేవాలయం :
 ఏకంగా ఏడునదులు కలిసే ప్రదేశం. ఏడాదిలో 8 నెలలపాటు నీటిలో ఉండి కేవలం 4 నెలలు భక్తులకు దర్శనభాగ్యం కలిగించే ఆలయం. వేలసంవత్సరాల చరిత్ర ఉన్న పవిత్రస్థలం. ఎందరో మునుల తపస్సుకు ఆశ్రయమిచ్చిన ప్రాంతం. పూర్వం ఈ ప్రాంతంలో దక్షయజ్ఞం జరిగిందని, ఆ సమయంలో దక్షుడు సతీదేవిని అవమానించడంతో... ఆమె యజ్ఞ వాటికలో పడి మరణించిందని స్థల పురాణం చెబుతోంది. సతీదేవి శరీర నివృత్తి జరిగిన ప్రాంతం కాబట్టి నివృత్తి సంగమేశ్వరాలయంగా ప్రసిద్ధి కెక్కింది. సంగమేశ్వర దేవాలయం, కర్నూలు జిల్లాలోని ప్రసిద్ధ శైవాలయం.

కర్నూలు నుంచి 55 కిలోమీటర్ల, నందికోట్కూరు నుంచి 20 కిలోమీటర్ల దూరంలో వున్న ఈ క్షేత్రానికి వివిధ మార్గాల ద్వారా చేరవచ్చు. నందికోట్కూరుకు 16 కిలోమీటర్ల దూరంలో వున్న 'మచ్చుమర్రి' గ్రామానికి బస్సుల ద్వారా చేరుకుని, అక్కడినుంచి 6 కిలోమీటర్ల దూరంలో వున్న సంగమేశ్వరానికి ఆటోలు, జీపులలో వెళ్ళవచ్చు. కర్నూలు జిల్లా ఆత్మకూరు నుంచి కపిలేశ్వరమునకు బస్సులో చేరుకుని అక్కడి నుంచి 5 కిలో మీటర్ల దూరంలోవున్న ఈ క్షేత్రానికి ఆటోలు, జీపులలో చేరవచ్చు. స్వంతవాహనాల్లో వెళ్ళేవారు ఏ దారిలోనైనా సరాసరి ఆలయం వరకు వెళ్లవచ్చు. మహాశివరాత్రి నాటికి ఈ క్షేత్రం బయటపడితే క్షేత్రానికి వివిధ ప్రాంతాలనుంచి ఆర్‌.టి.సి.వారు బస్సులను నడుపుతారు.తెలంగాణ ప్రజలు మహబూబ్ నగర్ నుంచి సోమశిల వరకు బస్సులో ప్రయాణించి అక్కడి నుంచి బోటు ద్వారా సంగమేశ్వరం చేరుకోవచ్చు.
hyderabad to kurnool tourist places, parks in kurnool, tourist places near nandyal, places to visit near mahanandi,kurnool to ahobilam, places to visit near adoni,tourist places near dhone, mantralayam to srisailam tourist places, kurnool district famous temples list

               
ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.