Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

list of krishna district famous temples |Andhra Pradesh

కనకదుర్గ గుడి:
కనకదుర్గ గుడి, ఆంధ్ర ప్రదేశ్, భారతదేశంలో ఒక ప్రసిద్ధమైన దేవస్థానం. ఇది విజయవాడ నగరంలో కృష్ణా నది ఒడ్దున ఇంద్రకీలాద్రి పర్వతం మీద ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే రెండో పెద్ద దేవాలయం. విజయవాడ పేరు చెప్పగానే కనక దుర్గ ఆలయం గుర్తుకు వస్తుంది. హిందూ పురాణాలలో అమ్మవారి గురించి ప్రస్తావన ఉంది. ఆలయంలో అమ్మవారి విగ్రహం సుమారు నాలుగు అడుగుల ఎత్తు ఉంటుంది. మిరిమిట్లు గొలిపే ఆభరణాలు, పూలతో అలంకరించబడి ఉంటుంది. మూర్తికి ఎనిమిది చేతులు ఉన్నాయి. ఒక్కో చేతిలో ఒక్కో ఆయుధం ఉంటుంది. త్రిశూలంతో మహిషాసురుని గుండెలో పొడుస్తున్న భంగిమలో ఉంటుంది.

ఆలయ సమయాలు : 4:00 AM to 6:00 AM 7:00 AM to 11:00 AM 12:15 PM to 04:00 PM 6:15 PM to 10:00 PM.


పెనుగంచిప్రోలు:
పెనుగంచిప్రోలు కృష్ణా జిల్లా, ఇదే పేరుతో ఉన్న మండలం యొక్క కేంద్రము. ఇది సమీప పట్టణమైన జగ్గయ్యపేట నుండి 20 కి. మీ. దూరంలో ఉంది. పెనుగంచిప్రోలు గ్రామం పూర్వ పేరు పెదకంచి. తదనంతరం పెనుగంచిగా పెనుగంచిప్రోలుగా పిలువబడింది. పెనుగంచిప్రోలు అను పేరు పెద్ద కంచీపురం నుండి వచ్చింది. ఇప్పుడు తమిళనాడులోనున్న కంచి చిన్న కంచి అయితే, ఇది పెద్ద కంచి. ఈ ఊరిలో 108 దేవాలయములు ఉండేవని అంటారు. అయితే కాల క్రమలో ఈ ఊరి ప్రక్కనే ప్రవహించుచున్న మునియేరు వరదల వల్ల ఆ ఊరు, ఆ దేవాలయములు భూగర్భంలో కలిసిపోయాయి. అందుకే ఇప్పటికనీ ఆ ఏటికి వరద వచ్చినపుడు ఇసుక తిన్నెల మధ్యన పురాతన దేవాలయాల స్ధంభాలు నీటిలో కనిపిస్తాయి. కొన్ని బయటకు కూడా కనిపిస్తాయి. కాని వాటి గురించి ఎవరూ పట్టించుకోరు. ఈ ఊరిలోనున్న ఆదినారాయణస్వామి, గోపాలస్వామి విగ్రహాలు భూమిలో దొరికినవే. పెనుగ్రంచిపోలు సంస్థానానికి సంబంధిచిన అనేక తవ్వకాలలో అనేక శాసనాలు లభ్యమయ్యాయి.

ఆలయ సమయాలు : 5.00 AM to 9.00 PM

పరిటాల వీరఅభయాంజనేయ స్వామి:
భారీ రూపం, అత్యంత ఎత్తైన విగ్రహం, 135 అడుగుల ఎత్తు. ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం ఇదేనని చెబుతారు. ఇక్కడి విగ్రహం బరువు 2,500 టన్నులు. నిర్మాణ కాలం 25 నెలలు. నిర్మాణానికి వాడిన సిమెంటు 14 వేల టన్నులు. ఇనుము 150 టన్నులు, ఇసుక వెయ్యి లారీలు. విగ్రహం పాదమే ఆరడుగుల ఎత్తులో ఉంది. విగ్రహం చేతిలోని గద చుట్టుకొలత 20 అడుగులు. కోటిన్నర రూపాయల వ్యయం తో నిర్మించినారు. 2003 సద్గురు శ్రీ శివానందమూర్తిగారు ఆలయ సముదాయాన్ని ఆవిష్కరించారు .

35 అడుగుల ఎత్తైన ఈ వీర అభయ ఆంజనేయ స్వామి విగ్రహం 2003 లో ప్రతిష్టించారు. ఇది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ నగరానికి 30 కి. మీ. ల దూరంలో కలదు. ఇండియాలో ప్రస్తుతానికి ఇది ఒక అతి ఎత్తైన విగ్రహం. కృష్ణా జిల్లాలో కంచిక చర్ల మండలంలోని పరిటాల గ్రామంలో ఈ బారీ విగ్రంగా ఉంది. విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై 135 అడుగుల భారీ శ్రీ వీరాంజనేయ స్వామి విగ్రహం చుట్టు ప్రక్కల అయిదు కిలోమీటర్ల దూరానికి కూడా దర్శనమిస్తుంది.

ఎలా వెళ్ళాలి : 
గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. కంచికచెర్ల, ఇబ్రహీంపట్నం నుండి రోద్దురవాణా సౌకర్యం ఉంది.

రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. రైల్వేస్టేషన్ విజయవాడ 28 కి.మీ దూరంలో ఉంది.

వేదాద్రి:
వేదాద్రి కృష్ణా జిల్లా, జగ్గయ్యపేట మండలం లోని గ్రామం. ఇది మండల కేంద్రమైన జగ్గయ్యపేట నుండి 12 కి. మీ. దూరంలో ఉంది. వేదాద్రి క్షేత్ర మహాత్మ్యాన్ని గురించిన ప్రస్తావన శ్రీనాథుడి 'కాశీ ఖండం' లో కనిపిస్తుంది. 'వేదాద్రి'నరసింహ స్వామి అవతరించిన అత్యంత శక్తివంతమైన క్షేత్రాలలో ఒకటి. వేదాలను తనలో నిక్షిప్తం చేసుకున్న పర్వత ప్రదేశం కాబట్టి ఈ క్షేత్రానికి వేదాద్రి అనే పేరు వచ్చింది.కృష్ణానది తీరంలో కొలువుదీరి పుణ్య ఫలాలను అందించే ఈ దివ్య క్షేత్రం కృష్ణా జిల్లాకి వన్నె తెస్తూ భక్తుల హృదయాలను గెలుచుకుంటూ వుంది.

ఎలా చేరుకోవాలి :
రవాణా సౌకర్యాలు బస్సు మార్గం :
విజయవాడ, జగ్గయ్యపేట ప్రాంతాల నుండి లోకల్ బస్సులు వేదాద్రి ఆలయం వరకు ప్రతి రోజూ తిరుగుతాయి. జగ్గయ్యపేట నుంచి షేర్ ఆటోలు, జీపులు కూడా దొరుకుతాయి.
రైలు మార్గం : వేదాద్రి ఆలయానికి సమీపాన మధిర రైల్వే స్టేషన్ కలదు. అక్కడ తిరిగే లోకల్ బస్సులలో ప్రయాణించి ఆలయానికి చేరుకోవచ్చు.
విమాన మార్గం : విజయవాడ లోని దేశీయ విమానాశ్రయం వేదాద్రి ఆలయానికి 90 కిలోమీటర్ల దూరంలో కలదు. అక్కడి నుండి క్యాబ్ లేదా టాక్సీ అలలో ఎక్కి ఆలయానికి చేరుకోవచ్చు.

ఆలయ దర్శన సమయాలు ఉదయం 6: 30 నుండి మధ్యాహ్నం 1:00 వరకు .. మధ్యాహ్నం 3:00 నుండి 5:30 వరకు తిరిగి 6:30 నుండి 8 :30 గంటల వరకు.

మోపిదేవి:
మోపిదేవి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కృష్ణాజిల్లాలో దివి సీమకు చెందిన ఒక మండలం మోపీదేవి. ఇది మచిలీపట్టణం నుండి 30కిమీ ల దూరంలో వుంది.దీనికి మోహినీపురమని, సర్పక్షేత్రమని పేరు. కాని కాలక్రమేణా మోపీదేవిగా మారింది.ఈ ఆలయంలో సుబ్రహ్మణ్యేశ్వరస్వామి లింగ రూపంలో వుండటం ఈ క్షేత్రం యొక్క విశిష్టత. మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరస్వామిఆలయానికి సుమారు 5సంల చరిత్ర వుంది. ఈ క్షేత్ర ప్రస్తావన స్కందపురాణంలోనూ కనిపిస్తుంది. ఇక్కడ స్వామి స్వయంభూగా వెలసాడని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే, కుమార స్వామి మనకు చిత్రాల్లో కనిపించినట్టుగా చేతిలో శక్తి ఆయుధం పట్టుకుని బాలుడిలాగా దర్శనం ఇవ్వడు! తండ్రి శివుని మాదిరిగా లింగాకారంలో ధన్యుల్ని చేస్తాడు! ఇక శివ లింగాలకి వున్నట్టుగా ఈ స్వామికి పానవట్టం వుండదు. దానికి బదులు ఒక పాము చుట్టలు చుట్టుకుని వున్నట్లుగా కింది భాగం వుంటుంది. దానిపైనే లింగాకారంలోని స్కందుడు కొలువై వుంటాడు.

ఆలయ దర్శన సమయాలు : Morning - 5.30 am - 1.00 pmEvening - 4.00 pm - 8.00

శ్రీకాకుళం (ఘంటసాల):
శ్రీకాకుళం, కృష్ణా జిల్లా, ఘంటసాల మండలానికి చెందిన గ్రామం. దివిసీమకు చెందిన ఈ కృష్ణా నది తీర గ్రామంలో ప్రసిద్ధి చెందిన ఆంధ్ర మహా విష్ణువు మందిరం, శ్రీ రాజ్యలక్ష్మీ సమేత శ్రీకాకుళేశ్వర స్వామి మందిరం (శివాలయం) ఉన్నాయి. ఇంకా రామాలయం, హనుమాన్ మందిరం, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మందిరం, వినాయకుని గుడి ఉన్నాయి.

శ్రీ పెద్దింట్లమ్మ దేవాలయం, కొల్లేటికోట :
శ్రీ పెద్దింట్లమ్మ దేవాలయం నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని కృష్ణా జిల్లా కైకలూరు మండలం కొల్లేటికోట అనే గ్రామంలో ఉంది. కొల్లేరు సరస్సు నడిబొడ్డున ఉన్న కొల్లేటికోట ప్రాంతమున ఉన్న ప్రసిద్ధ ఆలయం పెద్దింట్లమ్మ వారి ఆలయము. శతాబ్ధాల చరిత్ర కలగిన ఈ అమ్మవారి ఆలయంలో తొమ్మిది అడుగులపైబడి, విశాల నేత్రాలతో పద్మాసన భంగిమతో అత్యద్భుతంగా దర్శనమిచ్చే అమ్మవారిని దర్శించేందుకు ఇతర రాష్ట్రాలైన ఒడిషా, అస్సాం, తమిళనాడు ల నుండి సైతం భక్తులు వస్తుంటారు. ఏటా పాల్గుణ శుద్ధ పాడ్యమి నుండి పౌర్ణమి వరకూ జరిగే ఉత్సవాలలో పాల్గుణ శుద్ధ ద్వాదశి రోజున పెద్దింట్లమ్మ సమేత జలదుర్గకు కొల్లేటి కోట సమీపాన కల గోకర్ణేశ్వరస్వామి వారికి కళ్యాణము జరిపిస్తారు.

రవాణా సౌకర్యాలు;
సమీపాన కల ఆకివీడు నుండి లాంచీ ల ద్వారా, లేదా ఆలపాడు నుండి చిన్న రవాణా సాధనాలతో కర్రల వంతెన ద్వారా, ఏలూరు నుండి కైకలూరు మీదుగా బస్సు ద్వారా ఇక్కడికి చేరవచ్చు.

ఆలయ దర్శన సమయాలు : 6 a.m to 1 p.m. to 3.00 p.m. to 7.00 p.m.

నెమలి - వేణుగోపాలస్వామి:
నెమలి కృష్ణా జిల్లా, గంపలగూడెం మండలం లోని గ్రామం. ఇది మండల కేంద్రమైన గంపలగూడెం నుండి 20 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన నూజివీడు నుండి 52 కి. మీ. దూరంలోనూ ఉంది. గంపలగూడెం మండలంలోని నెమలి గ్రామంలో ఉన్న శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం, జిల్లాలోనే ప్రముఖ పుణ్య క్షేత్రంగా పరిగణించబడుతుంది. ఈ ఆలయంలోని వేణుగోపాలుడు మహిమాన్వితుడుగా విశ్వసిస్తున్నారు. అందువలన ఇక్కడికి విశేష సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. మానసిక ప్రశాంతత లేనివారు, అంతుచిక్కని వ్యాధుల బారిన పడినవారు, సంతానలేమితో బాధపడేవారు ఇక్కడికి ఎక్కువగా వస్తుంటారు. ఆలయ ప్రాంగణంలో గణాచారి వ్యవస్థ కనిపిస్తుంది. అరోగ్య పరమైన సమస్యలకి గల కారణాలను, పరిష్కార మార్గాల గురించి భక్తులు వారి ద్వారా తెలుసుకుని, స్వామివారి దర్శనం చేసుకుని వెళుతూ వుంటారు.

ఆలయ దర్శన సమయాలు : 07:00 AM - 12:00 PM, 06:00 PM - 08:30 PM

పెదకళ్ళేపల్లి - నాగేశ్వరాలయం:
పెదకళ్ళేపల్లి, కృష్ణా జిల్లా, మోపిదేవి మండలానికి చెందిన గ్రామం. మోపిదేవి, అవనిగడ్డ నుండి రోడ్డురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; విజయవాడ 64 కి.మీ. ఈ ఆలయంలో శివుడు స్వయంభూగా వెలసినాడని భక్తుల విశ్వాసం. దక్షిణకాశీగా పేరుగాంచిన ఈ ఆలయంలో, మహాశివరాత్రి సందర్భంగా, స్వామివారి వార్షిక నవరాత్రి బ్రహ్మోత్సవాలు, వైభవంగా నిర్వహించారు. తొమ్మిది రోజులపాటు అవిశ్రాంతంగా భక్తుల పూజలందుకున్న ఉభయ దేవతా సమేత నాగేశ్వరస్వామివారికి, విశిష్టలతో ద్వాదశ ప్రదక్షిణలు, మేళతాళాల మధ్య, వేడుకగా నిర్వహించారు. అనంతరం పవళింపుసేవ అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముత్తైదువులకు పసుపు, కుంకుమ, దుస్తులు, అమ్మవారల కానుకగా అందజేసినారు. అలసి సొలసిన స్వామివారలకు శ్రావ్యంగా లాలి, జోలపాటలు పాడుచూ ఉత్సవాలకు ముగింపు పలికినారు.

ఆలయ దర్శన సమయాలు : 07:00 AM - 12:00 PM, 06:00 PM - 08:30 PM

ఆగిరిపల్లి - వ్యాఘ్రనరసింహస్వామి:
ఆగిరిపల్లి కృష్ణా జిల్లా, ఇదే పేరుతో ఉన్న మండలం యొక్క కేంద్రము. ఇది సమీప పట్టణమైన నూజివీడు నుండి 21 కి. మీ. దూరంలో ఉంది. ఈ గ్రామంలో వున్న కొండపై శ్రీ శోభనాచలపతి స్వామివారు అనబడే వ్యాఘ్రనరసింహస్వామి. ఈ ఆలయం నూజివీడు జమీందార్లచే నిర్మించబడింది. వూళ్ళో ప్రతి రథసప్తమికి ఈ గ్రామములో విశేషరీతిలో తిరునాళ్ళు, రథోత్సవం జరుపుతారు. ఒక లక్షకు పైచిలుకు జనం ప్రతి ఏటా వస్తారు అని అంచనా. ప్రతి కార్తీక పౌర్ణమికి ఈ ఊరి కొండ మెట్ల మీద దీపాలంకరణ (నెయ్యీ) చేస్తారు.

ఆలయ దర్శన సమయాలు : 06:00 AM - 12:00 PM, 06:00 PM - 08:30 PM

తిరుమలగిరి :
జగ్గయ్యపేట నేషనల్ హై వే మీద చిల్లకుంట సెంటర్ నుండి వాయువ్య దిశలో రెండు కిలోమీటర్ల దూరంలో తిరుమలగిరి అనే ఊరుంది. ఇక్కడి వేంకటేశ్వర స్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధి పొందింది. శ్రీదేవి, భూదేవి సమేతంగా కొలువై ఉన్న శ్రీ వేంకటేశ్వరస్వామిని చుట్టుపక్కల భక్తులే కాకుండా ఎక్కడెక్కడి నుండో వచ్చి దర్శించుకుంటారు. గ్రామానికి ఉత్తరంగా తిరుమలగిరి పర్వతం ఉంది. అంటే పవిత్రమైన కొండ అని అర్ధం. పేరుకు తగ్గట్టే ఈ కొండపై దేవుని దర్శించుకుంటే అనుకున్న పనులు సవ్యంగా నెరవేరుతాయని స్థానికులు చెప్తుంటారు. 

ఈ గ్రామం పేరు తిరుమల తిరుపతిని పోలి "తిరుమల"గా ఉంది. తిరుపతి, అలివేలు మంగాపురం లాగే, ఈ గ్రామానికి జంటగా మంగొల్లు ఉంది. తిరుమలగిరికి కొద్ది దూరంలో ఉన్న మంగొల్లును మొదట మంగప్రోలు అనేవారు. క్రమంగా మంగవోలు అయి, చివరికి మంగొల్లుగా స్థిరపడింది. ఇక్కడ అలివేలుమంగమ్మ నివసించేదని, అందుకే ఆ ఊరికి ఆ పేరు వచ్చిందని అంటారు.
ఆలయ దర్శన సమయాలు : 06:00 AM - 12:00 PM, 06:00 PM - 08:30 PM

మాచవరం శ్రీ దాసాంజనేయ స్వామి దేవాలయం:
వెలసిన శ్రీ దాసాంజనేయ స్వామి భక్త సులభుడు .సుమారు ఏడు వందల ఏళ్ళ చరిత్ర కలిగిన గొప్ప దేవాలయం ..విజయ నగర సామ్రాజ్యాన్ని పాలించిన సాలువ ,తులువ వంశ రాజు ల కు పూజ నీయ స్థానంలో గురు స్థానం లో ఉన్న వ్యాస రాయల వారు (వ్యాస తీర్ధులు )ప్రతిష్ట చేసి ,నిర్మించిన మహనీయ దేవాలయం . పావన కృష్ణా నదీ తీరం ఎన్నో మహిమాన్విత దేవాలయాలకు నిలయం. మట్టపల్లి, వేదాద్రి, ఇంద్రకీలాద్రి లాంటి వాటిల్లో విజయవాడ నగరంలో ఉన్న మాచవరం శ్రీ దాసాంజనేయ స్వామి వారి దేవస్థానం ఒకటి. నిత్యం వందలాది మంది భక్తులతో కళకళలాడే ఈ ఆలయం రాష్ట్రమంతటా ఎంతో ప్రసిద్ది.

ఉదయం ఆరు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకూ భక్తుల సౌలభ్యం కొరకు తెరిచి ఉండే మాచవరం శ్రీ దాసాంజనేయ స్వామి ఆలయం నూత వాహన పూజలకు ఏంతో  ప్రసిద్ది.
ప్రతినిత్యం ఎందరో వచ్చి తమ వాహనాలకు పూజలు చేయించు కొంటారు.

ఆలయ దర్శన సమయాలు : 06:00 AM 08:30 PM

కైకలూరు:
సుమారు 400 సంవత్సరాలకు పూర్వం ప్రస్తుతం శ్యామలాదేవి ఆలయ ప్రాంగణంలో రామలింగేశ్వరుడి ఆలయం, అదే ప్రాంగణంలో '' గ్రామ చావిడి '' ఉండేవి. 1967లో శ్యామలాంబ అమ్మవారి ఆలయాన్ని దర్శించిన అప్పటి కంచికామకోటి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామివారు దేవిని మహామంత్రదేవతగా గుర్తించి వ్యాపారులు, ధనాధికులతో చర్చించి నైవేద్యాన్ని పెంచే ఏర్పాట్లు చేయడంతో పాటు ఆయన అదే ఏడాది విజయదశిమికి ముందురోజు నుంచి యజ్ఞ యాగాది, హోమాలను నిర్వహించి దేవి శక్తిని 16 కళలకు పెంచి శక్తిని పున: ప్రతిష్ఠింపచేశారు. దాంతో దేవికి సంపూర్ణ వైభవం తిరిగి వచ్చింది.

ఆలయ దర్శన సమయాలు : 06:00 AM 08:30 PM
krishna district tourist places, temples in guntur district, tourist places near jaggayyapeta, tourist places in vijayawada,tourist places near gudivada, tourist places in krishnagiri district, krishna district map, famous temples in andhra pradesh

                  

Comments