Drop Down Menus

Sri Jagannath Temple | Delhi

శ్రీ జగన్నాథ్ ఆలయం, ఢిల్లీ :

ఈ ఆలయం ఢిల్లీ లోని ప్రధాన ఆలయాలలో ఒకటి. ఈ ఆలయంని ఒరియా వారు ఒక సంస్థగా  ఏర్పాటు చేసి ఆలయ నిర్వహణ మొత్తం వారే చూస్తున్నారు. ఈ ఆలయం త్యాగరాజ్ నగర్ లో ఇండోర్ స్టేడియం వద్ద కొద్ది దూరంలోనే కలదు. ఈ ఆలయ వార్షిక జగన్నాథ్ రథయాత్ర ఉత్సవాని భారీ ఎత్తున నిర్వహిస్తారు. అప్పడు వేలాది మంది భక్తులు రథయాత్రలో పాల్గొంటారు.

ఆలయ చరిత్ర :

ఈ ఆలయం 1968 సంవత్సరంలో రిజిస్ట్రేషన్ చట్టం సొసైటీ కింద నమోదు చేయబడింది.  మొదట ఈ ఆలయాని 15 జనవరి 1968 మొదలు పెట్టిన నిర్మాణ పనులు మాత్రం అస్సలు 1968 ఫిబ్రవరి 5 న ప్రారంభమయ్యాయి. ప్రారంభంలో ఒక చిన్న ఆలయాన్ని నిర్మించారు. తరువాత భక్తుల కనుకలతో పునః నిర్మించారు.  ఆలయానికి వచ్చే సందర్శకుల కోసం ఆలయానికి సమీపంలో 18 గదులతో కూడిన ధర్మశాల కూడా ఉంది. 1991 లో, ఈ ఆలయాన్ని పునర్నిర్మించే పనులు ప్రారంభించబడ్డాయి మరియు జనవరి 28, 1999 న ఆలయం ప్రారంభించబడింది. పూరి నుండి తీసిన మూడు దేవతల పెద్ద పరిమాణ విగ్రహాలను వేద బ్రాహ్మణులు స్థాపించారు.


ఈ ఆలయంలో దాదాపుగా 250 మంది ఒకే సారి కూర్చొని భోజన సదుపాయాలతో,  వివాహం,  మొదలైన వాటి కోసం రెండు పెద్ద హాల్ లను పునః నిర్మాణం చేశారు. ఈ ఆలయ ప్రాంగణం లోనే పుస్తక శాల కూడా ఉన్నది. ఉత్సవ సమయంలో భక్తులు  ఒడిశా యొక్క గొప్ప సాంప్రదాయ జానపద నృత్యాలతో చేస్తూ పాల్గొంటారు.

ఆలయ దర్శన సమయం :

ఉదయం       : 5.00-1.00
సాయంత్రం  : 4.00-9.00

వసతి వివరాలు :

వయో వృద్ధులకి ప్రత్యేకమైన విశ్రాంతి గది కలదు. దగ్గరలోనే ప్రైవేట్ హోటల్ లు చాలా కలవు.

ఆలయానికి చేరుకునే విధానం :

రోడ్డు మార్గం :

త్యాగరాజ్ నగర్ లో ఇండోర్ స్టేడియం  వద్ద కి చేరుకొని అక్కడి నుంచి నడక దారిలో ఈ ఆలయానికి చేరుకోవచ్చు.

రైలు మార్గం :

ఈ ఆలయానికి దగ్గరలోనే హౌజ్ ఖాస్ మెట్రో స్టేషన్ కలదు. ఈ స్టేషన్ నుంచి కేవలం 2 కి. మీ దూరం కలదు.

విమాన మార్గం :

ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకొని అక్కడి నుంచి ఈ ఆలయానికి 15కి. మీ దూరంలో  ఈ ఆలయం కలదు.

ఆలయ చిరునామా :

శ్రీ జగన్నాథ్ ఆలయం,
సి-బ్లాక్,
సఫ్దర్‌జంగ్ డిప్లోప్‌మెంట్ ఏరియా,
భగవాన్ జగన్నాథ్ మందిర్ చౌక్ ,
ఢిల్లీ
పిన్ కోడ్ - 110016

Key Words : Sri Jagannath Temple , Famous Temples In Delhi , Hindu Temples Guide
ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.