Bhagavad Gita 2nd Chapter 37-48 Slokas and Meaning in Telugu | భగవద్గీత శ్లోకాలు భావాలు 


ŚRĪMAD BHAGAVAD GĪTA DVITĪYOADHYĀYAḤ
శ్రీమద్ భగవద్ గీత ద్వితీయోఽధ్యాయః

atha dvitīyoadhyāyaḥ |
అథ ద్వితీయోఽధ్యాయః |

hato vā prāpsyasi svargaṃ jitvā vā bhokśhyase mahīm |
tasmāduttiśhṭha kaunteya yuddhāya kṛtaniśchayaḥ ‖ 37 ‖

హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీమ్ |

తస్మాదుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః ‖ 37 ‖భావం : అర్జున! ధర్మయుద్దంలో మరణిస్తే స్వర్గం పొందుతావు. శత్రువులను జయిస్తే రాజ్య భోగలు అనుభావిస్తావు. అందువల్ల కృతనిశ్చయంతో యుద్దానికి నడుము బిగించు.

sukhaduḥkhe same kṛtvā lābhālābhau jayājayau |
tato yuddhāya yujyasva naivaṃ pāpamavāpsyasi ‖ 38 ‖

సుఖదుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ |

తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి ‖ 38 ‖


భావం : సుఖదుఖఃలూ, లాభనష్టాలు, జయాపజయాలు సమానంగా భావించి సమరం సాగించు. అప్పుడు నీకు పాపం కలుగదు.

eśhā teabhihitā sāṅkhye buddhiryoge tvimāṃ śṛṇu |
buddhyā yukto yayā pārtha karmabandhaṃ prahāsyasi ‖ 39 ‖

ఏషా తేఽభిహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు |

బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి ‖ 39 ‖

భావం : పార్ధ! ఇంతవరకు నీకు సాంఖ్యమాతనుసారం ఆత్మతత్వం గురించి చెప్పాను. ఇక సంసారబంధం వదులుకోవడానికి సాధనమైన నిష్కామ కర్మయోగం గురించి చెపుతాను విను.

nehābhikramanāśoasti pratyavāyo na vidyate |
svalpamapyasya dharmasya trāyate mahato bhayāt ‖ 40 ‖

నేహాభిక్రమనాశోఽస్తి ప్రత్యవాయో న విద్యతే |

స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ ‖ 40 ‖
భావం : ఈ కర్మయోగం ప్రారంభించి, పూర్తి చేయలేకపోయిన వృధాగా పోదు, దోషం లేదు. ఏ కొద్దిగా ఆచరించిన ఈ యోగం దారుణమైన సంసారభయం  నుంచి కాపాడుతుంది.

vyavasāyātmikā buddhirekeha kurunandana |
bahuśākhā hyanantāścha buddhayoavyavasāyinām ‖ 41 ‖

వ్యవసాయాత్మికా బుద్ధిరేకేహ కురునందన |

బహుశాఖా హ్యనంతాశ్చ బుద్ధయోఽవ్యవసాయినామ్ ‖ 41 ‖

భావం : కురునందన! నిశ్చయత్మకమైన బుద్ది ఒకే విధంగా వుంటుంది. స్థిర సంకల్పం లేని వాళ్ల ఆలోచనలు పరిపరివిధాల పరుగులెడతాయి.

yāmimāṃ puśhpitāṃ vāchaṃ pravadantyavipaśchitaḥ |
vedavādaratāḥ pārtha nānyadastīti vādinaḥ ‖ 42 ‖
యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్యవిపశ్చితః |

వేదవాదరతాః పార్థ నాన్యదస్తీతి వాదినః ‖ 42 ‖
kāmātmānaḥ svargaparā janmakarmaphalapradām |
kriyāviśeśhabahulāṃ bhogaiśvaryagatiṃ prati ‖ 43 ‖
కామాత్మానః స్వర్గపరా జన్మకర్మఫలప్రదామ్ |

క్రియావిశేషబహులాం భోగైశ్వర్యగతిం ప్రతి ‖ 43 ‖
bhogaiśvaryaprasaktānāṃ tayāpahṛtachetasām |
vyavasāyātmikā buddhiḥ samādhau na vidhīyate ‖ 44 ‖
భోగైశ్వర్యప్రసక్తానాం తయాపహృతచేతసామ్ |

వ్యవసాయాత్మికా బుద్ధిః సమాధౌ న విధీయతే ‖ 44 ‖

భావం : పార్ధ! అవివేకులూ,అర్ధవాదాల పట్ల ఆసక్తి కాలవాళ్ళు , స్వర్గ సుఖలకు మించి మరొకటి లేదని భావించే వాళ్ళు వేద వాక్యాలు పలుకుతూ ఉంటారు. అలాంటివాళ్ళు తాము చేసిన వైదిక కర్మల ఫలితంగా స్వర్గసుఖాలు అనుభవించాక, వాళ్ళకు మళ్ళీ కర్మ భూమిలో పునర్జన్మరూపమైన కర్మఫలమే తప్ప మోక్షం లభించదు. భోగభాగ్యాలు కోరి వేదవాక్యాలకు వశులైనవారి బుద్ది నిలకడగా వుండదు.

traiguṇyaviśhayā vedā nistraiguṇyo bhavārjuna |
nirdvandvo nityasattvastho niryogakśhema ātmavān ‖ 45 ‖

త్రైగుణ్యవిషయా వేదా నిస్త్రైగుణ్యో భవార్జున |

నిర్ద్వంద్వో నిత్యసత్త్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్ ‖ 45 ‖

భావం : అర్జునా! వేదాలు మూడు గుణాలు కలిగి కర్మకాండలను వివరిస్తాయి. నీవు త్రిగుణాలను విడిచిపెట్టి , ద్వందలు లేనివాడవై యోగక్షేమలు కొరకుండా శుద్దసత్వగుణం అవలంభించి ఆత్మజ్ఞానివి కావాలి.

yāvānartha udapāne sarvataḥ samplutodake |
tāvānsarveśhu vedeśhu brāhmaṇasya vijānataḥ ‖ 46 ‖

యావానర్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే |

తావాన్సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః ‖ 46 ‖


భావం : నది నుంచి నీరు తెచ్చుకున్నే వాళ్ళు నూతికి ఎలా ప్రాముఖ్యా మివ్వరో అలాగే బ్రహ్మజ్ఞానులు ప్రతిఫలాపేక్షతో కూడిన వేదకర్మలకు ప్రాధాన్యం యివ్వరు.

karmaṇyevādhikāraste mā phaleśhu kadāchana |
mā karmaphalaheturbhūrmā te saṅgoastvakarmaṇi ‖ 47 ‖

కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన |

మా కర్మఫలహేతుర్భూర్మా తే సంగోఽస్త్వకర్మణి ‖ 47 ‖

భావం : కర్మలు చేయడం వరకే నీకు అధికారం. కర్మ ఫలంతో నీకు సంబంధం లేదు. కనుక ప్రతిఫలం ఆశించి కర్మ చేయకు. అలా అని కర్మలు మనడానికి చూడకు.

yogasthaḥ kuru karmāṇi saṅgaṃ tyaktvā dhanañjaya |
siddhyasiddhyoḥ samo bhūtvā samatvaṃ yoga uchyate ‖ 48 ‖

యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ |

సిద్ధ్యసిద్ధ్యోః సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే ‖ 48 ‖


భావం :  ఫలం దక్కినా,  దక్కక పోయినా కర్మలు సమభవనతో సాగించు. అర్జునా! ఈ సమదృష్టినే యోగమంటారు. 
bhagavad gita in telugu, bhagavad gita telugu meanings, bhagavad gita learning audios, bhagavad gita 2nd chapter, bhagavad gita slokas with meaning, bhagavad gita pdf, bhagavad gita lyrics in telugu, bhagavad gita lyrics in english, bhagavad gita all chapters with meaning

Comments