Bhagavad Gita 2nd Chapter 49-60 Slokas and Meaning in Telugu | భగవద్గీత శ్లోకాలు భావాలు 


ŚRĪMAD BHAGAVAD GĪTA DVITĪYOADHYĀYAḤ
శ్రీమద్ భగవద్ గీత ద్వితీయోఽధ్యాయః

atha dvitīyoadhyāyaḥ |
అథ ద్వితీయోఽధ్యాయః |

dūreṇa hyavaraṃ karma buddhiyogāddhanañjaya |
buddhau śaraṇamanvichCha kṛpaṇāḥ phalahetavaḥ ‖ 49 ‖

దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాద్ధనంజయ |
బుద్ధౌ శరణమన్విచ్ఛ కృపణాః ఫలహేతవః ‖ 49 ‖


భావం : ధనంజయా! ప్రతిఫలాపేక్షతో ఆచరించే కర్మ నిష్కామ కర్మకంటే హీనం. ఫలితం ఆశించి కర్మచేసే వాళ్ళు  అలుప్పలు. అందువల్ల నీవు సామ బుద్దినే ఆశ్రయించు.

buddhiyukto jahātīha ubhe sukṛtaduśhkṛte |
tasmādyogāya yujyasva yogaḥ karmasu kauśalam ‖ 50 ‖

బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృతదుష్కృతే |
తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలమ్ ‖ 50 ‖

భావం : సమాభావన కలిగిన పురుషుడు పుణ్య పాపాలను రెండింటిని ఈ లోకంలోనే వదిలేస్తున్నాడు. కనుక సమత్వబుద్ది అయిన నిష్కామ కర్మనే నీవు ఆచరించు. కౌశలంతో కర్మలు చేయడమే యోగమని తెలుసుకో.

karmajaṃ buddhiyuktā hi phalaṃ tyaktvā manīśhiṇaḥ |
janmabandhavinirmuktāḥ padaṃ gachChantyanāmayam ‖ 51 ‖

కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః |
జన్మబంధవినిర్ముక్తాః పదం గచ్ఛంత్యనామయమ్ ‖ 51 ‖


భావం : నిష్కామయోగులు కర్మఫలం ఆశించకుండా జన్మబంధనాలనుంచి తప్పించుకొని ఉపద్రవం లేని మోక్షం పొందుతున్నారు.
yadā te mohakalilaṃ buddhirvyatitariśhyati |
tadā gantāsi nirvedaṃ śrotavyasya śrutasya cha ‖ 52 ‖

యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి |
తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ ‖ 52 ‖

భావం : నీ బుద్ది అజ్ఞానమనే కల్మషాన్ని అధిగణించినప్పుడు నీకు విన్న విషయాలు, వినబోయే అర్ధాలు విరక్తి కలిగిస్తాయి.

śrutivipratipannā te yadā sthāsyati niśchalā |
samādhāvachalā buddhistadā yogamavāpsyasi ‖ 53 ‖
శ్రుతివిప్రతిపన్నా తే యదా స్థాస్యతి నిశ్చలా |
సమాధావచలా బుద్ధిస్తదా యోగమవాప్స్యసి ‖ 53 ‖

భావం : అర్ధవాదాలు అనేకం వినడం వల్ల చలించిన ని మనస్సు నిశ్చలంగా వున్నప్పుడు నీవు ఆత్మజ్ఞానం పొందుతావు.

arjuna uvācha |
అర్జున ఉవాచ |

sthitapraGYasya kā bhāśhā samādhisthasya keśava |
sthitadhīḥ kiṃ prabhāśheta kimāsīta vrajeta kim ‖ 54 ‖

స్థితప్రజ్ఞస్య కా భాషా సమాధిస్థస్య కేశవ |
స్థితధీః కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిమ్ ‖ 54 ‖

భావం : అర్జనుడు : కేశవా ! సమాధినిష్ట పొందిన స్థితప్రజ్ఞనుడీ లక్షణా లేమిటి ? అతని ప్రసంగమూ, ప్రవర్తన ఎలా ఉంటాయి.

śrībhagavānuvācha |
శ్రీభగవానువాచ |

prajahāti yadā kāmānsarvānpārtha manogatān |
ātmanyevātmanā tuśhṭaḥ sthitapraGYastadochyate ‖ 55 ‖

ప్రజహాతి యదా కామాన్సర్వాన్పార్థ మనోగతాన్ |
ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే ‖ 55 ‖

భావం : శ్రీ కృష్ణాభగవానుడు! మనస్సులోని కొరికాలన్నీటిని విడిచిపెట్టి, ఎప్పడూ ఆత్మానందమే అనుభవించే వాడే స్థితప్రజ్ఞడు.

duḥkheśhvanudvignamanāḥ sukheśhu vigataspṛhaḥ |
vītarāgabhayakrodhaḥ sthitadhīrmuniruchyate ‖ 56 ‖

దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః |
వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే ‖ 56 ‖

భావం : దుఃఖలకు క్రుంగనివాడు, సుఖలకు పొంగని వాడు, భయం రాగద్వేషాలు వదిలిపెట్టిన వాడు అయిన మునీంద్రుడు స్థితప్రజ్ఞడు.

yaḥ sarvatrānabhisnehastattatprāpya śubhāśubham |
nābhinandati na dveśhṭi tasya praGYā pratiśhṭhitā ‖ 57 ‖

యః సర్వత్రానభిస్నేహస్తత్తత్ప్రాప్య శుభాశుభమ్ |
నాభినందతి న ద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా ‖ 57 ‖

భావం : స్నేహవ్యామోహాలు లేకుండా వ్యవహరిస్తూ శుభాశుభాలు కలిగినప్పుడు సంతోషం, ద్వేషం పొందకుండా వుండేవాడే స్థితప్రజ్ఞడు.

yadā saṃharate chāyaṃ kūrmoaṅgānīva sarvaśaḥ |
indriyāṇīndriyārthebhyastasya praGYā pratiśhṭhitā ‖ 58 ‖

యదా సంహరతే చాయం కూర్మోఽంగానీవ సర్వశః |
ఇంద్రియాణీంద్రియార్థేభ్యస్తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా ‖ 58 ‖

భావం : తాబేలు తన అవయవాలు లోపలికి ఎలా ముడుచుకుంటుందో అలాగే ఇంద్రియాలను సర్వవిధాలా విషయసుఖల నుంచి మళ్లించినవాడు స్థితప్రజ్ఞడవుతాడు.

viśhayā vinivartante nirāhārasya dehinaḥ |
rasavarjaṃ rasoapyasya paraṃ dṛśhṭvā nivartate ‖ 59 ‖

విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః |
రసవర్జం రసోఽప్యస్య పరం దృష్ట్వా నివర్తతే ‖ 59 ‖

భావం : ఆహారం తీసుకొనివాడికి ఇంద్రియా విషయాలు అణగిపోతాయి. అయితే విషయ వాసన మాత్రం వదలదు. ఆత్మ దర్శనంతోనే అది కూడా అడుగంటిపోతుంది.

yatato hyapi kaunteya puruśhasya vipaśchitaḥ |
indriyāṇi pramāthīni haranti prasabhaṃ manaḥ ‖ 60 ‖
యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః |
ఇంద్రియాణి ప్రమాథీని హరంతి ప్రసభం మనః ‖ 60 ‖


భావం : కుంతినందనా! ఆత్మనిగ్రహం కోసం అమితంగా ప్రయత్నించే విద్వాంసుడి మనసును సైతం ఇంద్రియాలు బలవంతంగా లాగుతాయి. 


bhagavad gita in telugu, bhagavad gita telugu meanings, bhagavad gita learning audios, bhagavad gita 2nd chapter, bhagavad gita slokas with meaning, bhagavad gita pdf, bhagavad gita lyrics in telugu, bhagavad gita lyrics in english, bhagavad gita all chapters with meaning

Comments