Bhagavad Gita 6th Chapter 25-36 Slokas and Meaning in Telugu | భగవద్గీత శ్లోకాలు భావాలు 


ŚRĪMAD BHAGAVAD GĪTA ŚHAŚHṬHOADHYĀYAḤ
శ్రీమద్ భగవద్ గీత షష్ఠోఽధ్యాయః

atha śhaśhṭhoadhyāyaḥ |
అథ షష్ఠోఽధ్యాయః |

śanaiḥ śanairuparamedbuddhyā dhṛtigṛhītayā |
ātmasaṃsthaṃ manaḥ kṛtvā na kiñchidapi chintayet ‖ 25 ‖

శనైః శనైరుపరమేద్బుద్ధ్యా ధృతిగృహీతయా |

ఆత్మసంస్థం మనః కృత్వా న కించిదపి చింతయేత్ ‖ 25 ‖


భావం : సంకల్పం వల్ల కలిగే సకలవాంఛనలూ సంపూర్ణంగా విడిచిపెట్టి, ఇంద్రియా లన్నీటిని సమస్త విషయాలనుంచి మనస్సుతోనే మళ్ళించి బుద్ది , ధైర్యంతో మనస్సును ఆత్మ మీద నెమ్మదిగా నిలిపి చిత్తశాంతి పొందాలి. ఏ మాత్రమూ ఇతర చింతనలు చేయకూడదు. 

yato yato niścharati manaśchañchalamasthiram |
tatastato niyamyaitadātmanyeva vaśaṃ nayet ‖ 26 ‖

యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరమ్ |

తతస్తతో నియమ్యైతదాత్మన్యేవ వశం నయేత్ ‖ 26 ‖

భావం : చంచలమూ అస్థిరమూ అయిన మనస్సు ఏయే విషయాలమీదకు వేడుతుందో ఆయా విషయాలనుంచి దానిని మళ్లించి ఆత్మమీదే నిలకడగా వుంచాలి.

praśāntamanasaṃ hyenaṃ yoginaṃ sukhamuttamam |
upaiti śāntarajasaṃ brahmabhūtamakalmaśham ‖ 27 ‖

ప్రశాంతమనసం హ్యేనం యోగినం సుఖముత్తమమ్ |

ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతమకల్మషమ్ ‖ 27 ‖

భావం : ప్రశాంతమైన మనస్సు కలిగినవాడు, కామక్రోధాది ఉద్రేక కారణాలకు ఆతీతుడు, పాపరహితుడు, బ్రహ్మస్వరూపుడు అయిన యోగపురుషుడికి పరమసుఖం లభిస్తుంది.  

yuñjannevaṃ sadātmānaṃ yogī vigatakalmaśhaḥ |
sukhena brahmasaṃsparśamatyantaṃ sukhamaśnute ‖ 28 ‖

యుంజన్నేవం సదాత్మానం యోగీ విగతకల్మషః |

సుఖేన బ్రహ్మసంస్పర్శమత్యంతం సుఖమశ్నుతే ‖ 28 ‖

భావం : ఇలాగ మనస్సు నెప్పుడు ఆత్మమీద లగ్నం చేసి పాపరహితుడైన యోగి అతి సులభంగా సర్వోత్కృష్టమైన సుఖం పొందుతాడు. 

sarvabhūtasthamātmānaṃ sarvabhūtāni chātmani |
īkśhate yogayuktātmā sarvatra samadarśanaḥ ‖ 29 ‖

సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని |

ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః ‖ 29 ‖

భావం : యోగాసిద్ది పొందినవాడు సమస్తభూతల పట్ల సమభావం కలిగి సర్వభూతలలో తన ఆత్మనూ, తన ఆత్మలో సర్వ భూతలను సందర్శిస్తాడు.

yo māṃ paśyati sarvatra sarvaṃ cha mayi paśyati |
tasyāhaṃ na praṇaśyāmi sa cha me na praṇaśyati ‖ 30 ‖

యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి |

తస్యాహం న ప్రణశ్యామి స చ మే న ప్రణశ్యతి ‖ 30 ‖

భావం : అన్నీ భూతలలో నన్ను, నాలో అన్నీ భూతలనూ చూసేవాడికి నేను లేకుండా పోను. నాకు వాడు లేకుండా పోడు. 


sarvabhūtasthitaṃ yo māṃ bhajatyekatvamāsthitaḥ |
sarvathā vartamānoapi sa yogī mayi vartate ‖ 31 ‖

సర్వభూతస్థితం యో మాం భజత్యేకత్వమాస్థితః |

సర్వథా వర్తమానోఽపి స యోగీ మయి వర్తతే ‖ 31 ‖

భావం : సమస్త భూతలలో వున్న నన్ను భేదభావం లేకుండా సేవించే యోగి ఎలా జీవిస్తున్నప్పటికి నాలోనే వుంటాడు. 

ātmaupamyena sarvatra samaṃ paśyati yoarjuna |
sukhaṃ vā yadi vā duḥkhaṃ sa yogī paramo mataḥ ‖ 32 ‖

ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోఽర్జున |

సుఖం వా యది వా దుఃఖం స యోగీ పరమో మతః ‖ 32 ‖

భావం : అర్జునా ! సమస్తజీవుల సుఖదుఃఖాలాను తనవిగా తలచేవాడు యోగులలో శ్రేష్టుడని నా అభిప్రాయం.  

arjuna uvācha |
అర్జున ఉవాచ |
yoayaṃ yogastvayā proktaḥ sāmyena madhusūdana |
etasyāhaṃ na paśyāmi chañchalatvātsthitiṃ sthirām ‖ 33 ‖

యోఽయం యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన |

ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాత్స్థితిం స్థిరామ్ ‖ 33 ‖

భావం : అర్జునుడు : మధుసుదనా! మనస్సునిలకడలేనిది కావడం వల్ల, నీవు ఉపదేశించిన ఈ జీవాత్మపరమాత్మల సమత్వయోగాన్ని స్థిరమైన స్థితిలో చూడలేకపోతున్నాను. 

chañchalaṃ hi manaḥ kṛśhṇa pramāthi balavaddṛḍham |
tasyāhaṃ nigrahaṃ manye vāyoriva suduśhkaram ‖ 34 ‖

చంచలం హి మనః కృష్ణ ప్రమాథి బలవద్దృఢమ్ |

తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరమ్ ‖ 34 ‖

భావం : కృష్ణా! మనస్సు చాలా చంచలం, బలవత్తరం, సంక్షోభకరం అలాంటి మనస్సును నిగ్రహించడం వాయువును నిరోధించడంలాగ దుష్కరమని భావిస్తున్నాను. 

śrībhagavānuvācha |
శ్రీభగవానువాచ |

asaṃśayaṃ mahābāho mano durnigrahaṃ chalam |
abhyāsena tu kaunteya vairāgyeṇa cha gṛhyate ‖ 35 ‖

అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలమ్ |

అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే ‖ 35 ‖

భావం : శ్రీ భగవానుడు : అర్జునా! మనస్సు చంచల స్వభావం కలిగింది, నిగ్రహించడానికి శక్యం కానిదీ అనడంలో సందేహం లేదు. అయితే దానిని అభ్యాసం వల్ల, వైరాగ్యం వల్ల వశపరచుకోవచ్చు. 

asaṃyatātmanā yogo duśhprāpa iti me matiḥ |
vaśyātmanā tu yatatā śakyoavāptumupāyataḥ ‖ 36 ‖

అసంయతాత్మనా యోగో దుష్ప్రాప ఇతి మే మతిః |

వశ్యాత్మనా తు యతతా శక్యోఽవాప్తుముపాయతః ‖ 36 ‖

భావం : ఆత్మనిగ్రహం లేనివాడికి యోగం సిద్దించదని నా వుద్దేశం. ఆత్మ నిగ్రహంవుంటే అభ్యాసం, వైరాగ్యం అనే ఉపాయాలతో యోగం పొందవచ్చు. 
భగవద్గీతలోని 18అధ్యాయాలు  వాటి భావాలు మరియు ఆడియోల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.   bhagavad gita in telugu, bhagavad gita telugu meanings, bhagavad gita learning audios, bhagavad gita 6th chapter, bhagavad gita slokas with meaning, bhagavad gita pdf, bhagavad gita lyrics in telugu, bhagavad gita lyrics in english, bhagavad gita all chapters with meaning

Comments