శ్రీమద్ భగవద్ గీత షష్ఠోఽధ్యాయః
అథ షష్ఠోఽధ్యాయః |
సమం కాయశిరోగ్రీవం ధారయన్నచలం స్థిరః |
సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్ ‖ 13 ‖
సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్ ‖ 13 ‖
ప్రశాంతాత్మా విగతభీర్బ్రహ్మచారివ్రతే స్థితః |మ
నః సంయమ్య మచ్చిత్తో యుక్త ఆసీత మత్పరః ‖ 14 ‖
నః సంయమ్య మచ్చిత్తో యుక్త ఆసీత మత్పరః ‖ 14 ‖
భావం : శరీరమూ, శిరస్సు, కంఠమూ కదలకుండా స్థిరంగా ఉంచి, దిక్కులు చూడకుండా ముక్కుచివర దృష్టి నిలిపి, ప్రశాంతచిత్తంతో, భయం విడిచిపెట్టి, బ్రహ్మచర్యవ్రతం అవలంభించి, మనోనిగ్రహం కలిగి, బుద్దిని నా మీదనే లగ్నంచేసి, నన్నే పతిగా, గతిగా భావించి ధ్యానం చేయాలి.
యుంజన్నేవం సదాత్మానం యోగీ నియతమానసః |
శాంతిం నిర్వాణపరమాం మత్సంస్థామధిగచ్ఛతి ‖ 15 ‖
శాంతిం నిర్వాణపరమాం మత్సంస్థామధిగచ్ఛతి ‖ 15 ‖
భావం : అలాంటి యోగి ఆత్మానుభవం మీద మనస్సును నిరంతరం నిలిపి, నా అధీనంలో వున్న మోక్షప్రదమైన శాంతిని పొందుతున్నాడు.
నాత్యశ్నతస్తు యోగోఽస్తి న చైకాంతమనశ్నతః |
న చాతిస్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జున ‖ 16 ‖
న చాతిస్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జున ‖ 16 ‖
భావం : అర్జునా! అమితంగా భుజించేవాళ్ళకి, బొత్తిగా తినని వాళ్ళకి, అధికంగా నిద్రపోయే వాళ్ళకి అస్సలు నిద్ర పోనీ వాళ్ళకి యోగం సిద్దించదు.
యుక్తాహారవిహారస్య యుక్తచేష్టస్య కర్మసు |
యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖహా ‖ 17 ‖
భావం : ఆహార విహారాలలో, కర్మలలో, నిద్రలో, మేల్కోవడంలో పరిమితి పాటించే యోగికి సర్వ దుఃఖాలూ పోయి యోగసిద్ది కలుగుతుంది.
యదా వినియతం చిత్తమాత్మన్యేవావతిష్ఠతే |
నిఃస్పృహః సర్వకామేభ్యో యుక్త ఇత్యుచ్యతే తదా ‖ 18 ‖
నిఃస్పృహః సర్వకామేభ్యో యుక్త ఇత్యుచ్యతే తదా ‖ 18 ‖
భావం : మనస్సును వశపరచుకొని ఆత్మమీద నిశ్చలంగా నిలిపి సర్వవాంఛలూ విసర్జించినప్పుడు యోగసిద్ది పొందుతాడని చెబుతారు.
యథా దీపో నివాతస్థో నేంగతే సోపమా స్మృతా |
యోగినో యతచిత్తస్య యుంజతో యోగమాత్మనః ‖ 19 ‖
యోగినో యతచిత్తస్య యుంజతో యోగమాత్మనః ‖ 19 ‖
భావం : ఆత్మయోగం అభ్యసించేవాడి మనస్సు గాలిలేనిచోట వుండేదీపంలాగా నిలకడగా వుంటుంది.
యత్రోపరమతే చిత్తం నిరుద్ధం యోగసేవయా |
యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి ‖ 20 ‖
యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి ‖ 20 ‖
సుఖమాత్యంతికం యత్తద్బుద్ధిగ్రాహ్యమతీంద్రియమ్ |
వేత్తి యత్ర న చైవాయం స్థితశ్చలతి తత్త్వతః ‖ 21 ‖
వేత్తి యత్ర న చైవాయం స్థితశ్చలతి తత్త్వతః ‖ 21 ‖
యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః|
యస్మిన్స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే ‖ 22 ‖
యస్మిన్స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే ‖ 22 ‖
తం విద్యాద్దుఃఖసంయోగవియోగం యోగసంజ్ఞితమ్ |
స నిశ్చయేన యోక్తవ్యో యోగోఽనిర్విణ్ణచేతసా ‖ 23 ‖
స నిశ్చయేన యోక్తవ్యో యోగోఽనిర్విణ్ణచేతసా ‖ 23 ‖
భావం : ఏ స్థితిలో మనస్సు యోగాభ్యాసం వల్ల నిగ్రహించబడి, శాంతిని పొందుతుందో, యోగి ఎప్పుడు పరిశుద్దమైన మనస్సుతో పరమాత్మను తనలో సందర్శిస్తూ సంతోషిస్తున్నాడో, ఇంద్రియాలకు గోచరించకుండా బుద్దివల్లనే గ్రహించబడే అనంత సుఖాన్ని అనుభవిస్తాడో, ఆత్మతత్వం నుంచి ఏమాత్రమూ చలించడో, దేనిని పొంది, దానికి మించిన లాభం మరోకటి లేదని భావిస్తాడో, ఏ స్తితిలో స్థిరంగా వుండి దుర్భర దూస్సహ, దుఃఖాన్ని కయినా కలత చెందడో, దుఃఖాలకు దూరమైన అలాంటి దానినే యోగమంటారు. దిగులు పడకుండా దీక్షతో ఆ యోగాన్ని అభ్యసించాలి.
సంకల్పప్రభవాన్కామాంస్త్యక్త్వా సర్వానశేషతః |
మనసైవేంద్రియగ్రామం వినియమ్య సమంతతః ‖ 24 ‖
మనసైవేంద్రియగ్రామం వినియమ్య సమంతతః ‖ 24 ‖
భావం : సంకల్పంవల్ల కలిగే సకలవాంఛలనూ సంపూర్ణంగా విడిచిపెట్టి, ఇంద్రియా లన్నిటినీ సమస్త విషయాల నుంచి మనస్సుతోనే మళ్ళించి, బుద్ది ధైర్యంతో మనస్సును ఆత్మమీదనే నెమ్మదిగా నిలిపి చిత్తశాంతి పొందాలి. ఏ మాత్రం ఇతర చింతనలు చేయకూడదు.
6వ అధ్యాయం యొక్క కేవలం పారాయణ ఆడియో కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
భగవద్గీత మొత్తం అధ్యాయాలు చూడటం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
శ్రీ లలితా సహస్రం , శ్రీ విష్ణు సహస్రం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
శ్రీ లలితా సహస్రం పిడిఎఫ్ బుక్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
Bhagavad Gita Slokas with Audios in English Click Here
bhagavad gita in telugu, bhagavad gita telugu meanings, bhagavad gita learning audios, bhagavad gita 6th chapter, bhagavad gita slokas with meaning, bhagavad gita pdf, bhagavad gita lyrics in telugu, bhagavad gita lyrics in english, bhagavad gita all chapters with meaning

ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Comments
Post a Comment