24.పాశురము
అన్రివ్వులగ మళన్దాయ్! ఆడిపోట్రి చ్చెనద్గుత్తెన్నిలజ్జెశెత్తాయ్! తిఱల్ పోట్రి పొనచ్చెగడ ముదైత్తాయ్ ! పుగళ్ పోట్రి కన్రు కుణిలా వెఱిన్దాయ్ ! కళల్ పోట్రి కున్రుకుడైయా వెడుతాయ్ ! గుణమ్ పోట్రి పడుకు ని కైయిల్ వేల్ పోట్రి ఏన్రున్ శేవగమే యేత్తిప్పలై కొళ్వాన్ ఇన్రియామ్ వన్దోమ్ ఇరట్లేలో రెమ్బావాయ్.
భావము: అలనాడు బలివలన దుఃఖితులైన దేవతలను రక్షించుటకు రక్షించుటకు త్రివిక్రముడవై మూడు లోకాలను కొలిచిన వామనుడా! నీ రెండు పాదములకును మంగళము! సీతమ్మ నపహరించిన దుష్టడగు రావణుని లంకను గెల్చిన ఓ శ్రీరామా! నీ ధీరతకు మంగళము! బండి రూపంలో శకటాసురుడనే రాక్షసుడు నిన్ను చంపప్రయత్నింపగా వాని కీళ్ళూడునట్లు తన్నిన నీ కీర్తి ప్రభలకును మంగళము! దూడ రూపమున నిన్ను చంపవచ్చిన వత్సాసురుడనే రాక్షసుని. వెలగ చెట్టుగా దారికి ప్రక్కన నిల్చిన కపితాసురుడనే రాక్షసుని ఒక్కసారిగా సంహరించిన నీ వంచిన పాదమునకు మంగళము!
దేవేంద్రుడు రాళ్ళ వర్షమును కురిపించగా గోవర్ధనగిరిని గోడుగుగా నెత్తి గోకులమును రక్షించిన నీ ఆశ్రిత రక్షణ గుణమునకును మంగళమగుగాక! శత్రువులను చీల్చి చెండాడునట్టి నీ చేతి చక్రమునకు మంగళ మ! ఇట్లు నీ వీర గాధలన్నేన్నింటినో నోరార సుత్తించును నీ నుండి మా నోమునకు కావాల్సిన పరికరములను పొందుటకై మేము నేడు యిచ్చాటకు వచ్చి యున్నాము. కావున మా యందు దయచేసి వానిని కృపతో ప్రసాదింపుము. అని గోపికల్లెలరు స్వామిని వేడుకొన్నారు.
1 నుండి 30 వరకు తిరుప్పావై పాశురములు:
Tags: తిరుప్పావై, పాశురం, thiruppavai pasuram in telugu, tiruppavai telugu pdf, thiruppavai telugu, తిరుప్పావై పాశురాలు, pasuralu in telugu, తిరుప్పావై 24వ పాశురం